కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమీ భావాలు వ్యక్తపరచండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
డౌన్‌లోడ్ చేయి
సేవా నిబంధనలు2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ అవ్వండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
WhatsApp Webడౌన్‌లోడ్

కరోనా వైరస్ (COVID-19) వ్యాధి వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కనెక్ట్ అయ్యి ఉండేందుకు WhatsApp మీకు ఎలా సాయపడగలదు

మీకు అత్యంత ముఖ్యమైన వారితో కనెక్ట్ కావడానికి WhatsApp మీకు సహాయపడుతుంది. మీ స్నేహితులను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు, తాజా అధికారిక ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందేందుకు, మరియు సమాచారాన్ని బాధ్యతాయుతంగా షేర్ చేయడానికి WhatsAppను మీరు ఎలా వాడవచ్చో తెలిపే కొన్ని మార్గాలు ఇక్కడ ఇస్తున్నాం. మీరు WhatsAppకి కొత్త అయితే లేదా మీరు మరొకసారి తెలుసుకోవాలనుకుంటే, ఎలా ప్రారంభించాలోలో ఎలా ఉపయోగించాలో దశల వారీగా తెలుసుకోండి.

రిమోట్ విధానంలో కనెక్ట్ చేయండి

మీరు మీ ప్రియమైనవారితో కలిసి ఒకే ప్రాంతంలో ఉండే అవకాశం లేనప్పటికీ కూడా వారికి అందుబాటులో ఉండి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం లాంటి పనుల కోసం గ్రూప్‌లు, వాయిస్, మరియు వీడియో కాల్‌లు లాంటి WhatsApp ఫీచర్స్ ఉపయోగించండి.

నమ్మదగిన వర్గాలు అందించే సమాచారాన్ని ఎంచుకోండి

స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో కనెక్ట్ అవ్వండి. తాజా సమాచారం మరియు మార్గదర్శకాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా మీ జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లాంటి నమ్మదగిన వనరులను ఎంచుకోండి.

పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సాయపడండి

మీకు వచ్చే మెసేజ్‌ల గురించి ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే కరోనా వైరస్ గురించి మీరు అందుకునే ప్రతీ మెసేజ్ సరైన సమాచారాన్ని కలిగి ఉండకపోవచ్చు. వాస్తవాల తనిఖీదారులు ద్వారా లేదా అంతర్జాతీయ వాస్తవాల-తనిఖీ నెట్‌వర్క్ (IFCN) యొక్క వాస్తవాల తనిఖీ చాట్‌బాట్‌తో +1 (727) 2912606 ద్వారా వాస్తవాలను ఇతర నమ్మదగిన అధికారిక వర్గాలతో వెరిఫై చేయండి. మీరు ఒక విషయం నిజమో, కాదో తెలియకపోతే, దానిని ఫార్వార్డ్ చేయవద్దు.

కమ్యూనిటీ లీడర్‌లు

ఈ సవాలుకు మీరు ప్రతిస్పందిస్తున్న సమయంలో మీకు కమ్యూనిటీ లీడర్ల మద్దతును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ప్రజలు కరోనా వైరస్ గురించి భయాందోళనలకు గురవుతున్న తరుణంలో మీ కమ్యూనిటీకి సమాచారం అందించడం మరియు వారితో కనెక్ట్ అయ్యి ఉండటం కోసం WhatsAppను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.

ఆరోగ్య సంరక్షణ నిపుణులు

మీ పేషెంట్లతో కనెక్ట్ అయ్యి ఉండటం, కమ్యూనిటీకి సమాచారం అందించడం, రిమోట్ కాన్ఫరెన్సులను నిర్వహించడం, తరచూ అడిగే ప్రశ్నలకు త్వరితంగా స్పందించేందుకు సెట్ అప్ చేయడం లాంటివి ఎలా చేయవచ్చనే వాటి గురించి తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి >

ఎడ్యుకేటర్‌లు

WhatsAppలో మీ విద్యార్థులతో కనెక్ట్ అయ్యి ఉండటం, అసైన్మెంట్లు పంపించడం, స్వీకరించడం, వచనాలు మరియు వాయిస్ మెసేజ్‌ల రూపంలో పాఠాలను షేర్ చేయడం, అలాగే మరెన్నో పనులను ఎలా చేయవచ్చో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి >

లాభాపేక్ష లేని సంస్థలు మరియు స్థానిక ప్రభుత్వాలు

మీ సంస్థ గురించి పరిచయం చేయండి, మీ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి ఉండండి, సరయిన సమాచారాన్ని సరయిన సమయంలో షేర్ చేయండి, మీ టీముతో కోఆర్డినేట్ చేసుకోండి, సాధారణ ప్రశ్నలకు త్వరితంగా స్పందించండి, అలాగే మరెన్నో చేయండి.

మరింత తెలుసుకోండి >

స్థానిక వ్యాపారాలు

మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యి ఉండేందుకు మరిన్ని మార్గాలను కనుగొనండి, ప్రస్తుత పని గంటలను షేర్ చేయండి, పికప్స్ మరియు డెలివరీలను మరింత ప్రభావవంతంగా చేయండి, నిరంతరం జాబితాలు అప్‌డేట్ చేయండి, అలాగే మరెన్నో చేయండి.

మరింత తెలుసుకోండి>

స్టోరీలు

ఈ సవాలు సమయంలో ప్రజలు తమ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి ఉండేందుకు WhatsApp ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి:

పాకిస్తాన్ దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఒక ప్రాంతంలోని వారిని పేదరికం నుండి కాపాడడానికి ఒక WhatsApp గ్రూప్ 2 కోట్ల 10 లక్షల రూపాయలను సేకరించింది: ఆర్టికల్ ఇక్కడ చదవండి>

ఇటలీ దేశంలో కొన్ని నగరాల మేయర్‌లు ఒక బృందంగా ఏర్పడి WhatsApp ఉపయోగిస్తూ కనెక్ట్ అయ్యి ఉంటున్నారు: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

పాఠశాలలు మూతపడినప్పటికీ ఇటలీలోని నేపుల్స్‌ ప్రాంత ప్రాథమిక పాఠశాలలు, WhatsApp ఉపయోగించి చిన్నారుల కుటుంబాలకు అసైన్మెంట్లను డెలివరీ చేస్తూ విద్యా బోధనను కొనసాగుతున్నాయి: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

స్థానిక వ్యాపారాలకు మద్దతుగా కమ్యూనిటీని సమీకరించడానికి హాంకాంగ్‌లోని ఒక వ్యక్తి WhatsApp వైపు మొగ్గు చూపుతున్నాడు: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

కరోనావైరస్ సమయంలో ఉద్యోగాలు పొందటానికి మహిళలను ప్రేరేపించడానికి, జోర్డాన్‌లో ఉపాధి సాధికారత కార్యక్రమం WhatsAppని ఉపయోగిస్తోంది:ఆర్టికల్ ఇక్కడ చదవండి >

ఆసుపత్రుల్లో రోగుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పారిస్‌లోని వైద్య నిపుణులు ఒక WhatsApp గ్రూప్‌గా ఏర్పడ్డారు: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

భారతదేశంలోని కోయంబత్తూరు నగర అధికారులు WhatsApp ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

సిరియాలోని శరణార్థి శిబిరాలలోని ఉపాధ్యాయులు WhatsAppలో తల్లితండ్రులకు వీడియో పాఠాలను షేర్ చేసుకుంటున్నారు: ఇక్కడ ఆ ఆర్టికల్ చదవండి >

భారతదేశంలో బానిసత్వం నుండి బయటపడినవారు తమ తోటివారిలో కరోనావైరస్ గురించి అవగాహన పెంచడానికి WhatsApp గ్రూప్‌లను ఉపయోగిస్తున్నారు: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

బ్రెజిల్ దేశపు ఫ్లోరియానోపోలిస్ ప్రాంత రోగులు WhatsApp ఉపయోగించి అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసుకోవడం మరియు ప్రశ్నలు అడగడం లాంటివి చేయవచ్చు: ఆర్టికల్ ఇక్కడ చదవండి >

గ్లోబల్ భాగస్వాములు

డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగోడౌన్‌లోడ్
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్స్టోరీలుబిజినెస్ కోసం
మేము ఎవరుమా పరిచయంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని సంప్రదించండిసహాయ కేంద్రంకరోనావైరస్భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2023 © WhatsApp LLC

సేవా నిబంధనలు