మేము WhatsAppను రూపొందించినప్పటి నుండి నేటి దాకా మా ధ్యేయం - మీరు స్నేహితులతో టచ్‌లో ఉంటూ, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడంలో, వేరు పడిన కుటుంబాలను కలపడంలో, అలాగే మెరుగైన జీవితాన్ని గడపడంలో మీకు సహాయపడటం. మీ అత్యంత వ్యక్తిగత క్షణాలలో కొన్ని WhatsAppతో షేర్ అవుతుంటాయి, అందుకే మేము మా యాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ నిర్మించాము. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నప్పుడు, మీ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లు మరియు కాల్లు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా సురక్షితంగా ఉంటాయి.
WhatsApp Messenger ఉపయోగించి మీరు వేరే వ్యక్తికి మెసేజ్ పంపినప్పుడు WhatsApp ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగించబడుతుంది. మీరూ, అలాగే మీరు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్న వ్యక్తి మాత్రమే ఏమి పంపబడిందనే దానిని చదవగలిగేలా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ నిర్ధారిస్తుంది, ఈ మధ్యలో ఏ ఒక్కరూ, చివరకు WhatsApp కూడా దానిని చదవడం, వినడం చేయలేరు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కారణంగా మీ మెసేజ్‌లు ఒక లాక్‌తో సురక్షితం చేయబడి ఉంటాయి, కేవలం స్వీకర్త, మరియు మీరు మాత్రమే వాటిని అన్‌లాక్ చేసి చదవడానికి అవసరమైన ఒక ప్రత్యేక కీని కలిగి ఉంటారు. ఇదంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది: మీ మెసేజ్‌లను సురక్షితం చేసుకోవడానికి సెట్టింగ్‌లను టర్న్ ఆన్ చేయవలసిన లేదా ప్రత్యేక రహస్య చాట్స్ సెటప్ చేయవలసిన అవసరం లేదు.
మెసేజ్‌లు మీ డివైజ్ నుండి బయటకు వెళ్లే ముందు వాటిని సురక్షితం చేసే Signal ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్తోనే, ప్రతి ఒక్క WhatsApp మెసేజ్ సంరక్షించబడుతుంది. ఏదైనా ఒక WhatsApp బిజినెస్ అకౌంట్‌కు మీరు మెసేజ్ చేసినప్పుడు, ఆ బిజినెస్ ఎంచుకొన్న గమ్యస్థానానికి మీ మెసేజ్ సురక్షితంగా డెలివరీ అవుతుంది.
WhatsApp Business యాప్‌ను ఉపయోగించే బిజినెస్‌లతో పాటు, తమకు తాముగా కస్టమర్ మేసేజ్‌లను మేనేజ్ చేసే లేదా స్టోర్ చేసే బిజినెస్‌లతో మీరు చేసే చాట్లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయ్యేలా WhatsApp చూసుకుంటుంది. ఒకసారి మెసేజ్ అందుకొన్న తర్వాత, అది సదరు బిజినెస్ సంస్థ స్వంత గోప్యతా విధానాలకు లోబడి ఉంటుంది. మెసేజ్‌ను ప్రాసెస్ చేయడం, దానికి స్పందించడం లాంటివి చేయడానికి ఆ బిజినెస్ సంస్థ కొందరు ఉద్యోగులను లేదా ఇతర వెండార్లను నియమించుకోవచ్చు.
మెసేజ్‌లను సురక్షితంగా స్టోర్ చేయడానికి, కస్టమర్లకు బదులివ్వడానికి కొన్ని బిజినెస్‌లు1 WhatsApp మాతృ సంస్థ అయిన Metaను ఎంచుకోగలుగుతారు. ఆ బిజినెస్ గోప్యతా విధానాల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా సదరు సంస్థను సంప్రదించవచ్చు.
ఎంపిక చేసిన దేశాలలో అందుబాటులో ఉన్న WhatsApp Payments, ఆర్థిక సంస్థల అకౌంట్ల మధ్య బదిలీలను ప్రారంభిస్తాయి. ఒక ఉన్నత స్థాయి-భద్రతా నెట్‌వర్క్‌లో కార్డ్, బ్యాంక్ నంబర్లు ఎన్‌క్రిప్ట్ చేసి స్టోర్ చేయబడతాయి. కానీ, ఈ పేమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించకుండా ఆర్థిక సంస్థలు లావాదేవీలను ప్రాసెస్ చేయలేవు కాబట్టి, ఈ పేమెంట్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడవు.
మీ మెసేజ్‌లు ఏమవుతున్నాయో మీకు తెలియాలని WhatsApp అనుకుంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి లేదా బిజినెస్ నుండి మెసేజ్‌లను స్వీకరించకూడదు అని మీరు అనుకుంటే, ఎప్పుడైనా వారిని నేరుగా చాట్ నుండి బ్లాక్ చేయవచ్చు లేదా మీ కాంటాక్ట్ లిస్ట్ నుండి వారిని తొలగించవచ్చు. మీ మెసేజ్‌లు ఎలా హ్యాండిల్ చేయబడతాయనే దానితో పాటు, మీకు తగిన నిర్ణయాలను మీరు తీసుకోగలిగేలా ఏ ఎంపికలు అందుబాటులో ఉన్నాయనే దాని గురించి మీకు అర్థమయ్యేలా చేయాలని అనుకున్నాము.
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు వేరే దేశంలో ఉన్నా కూడా వారితో ప్రైవేట్‌గా మాట్లాడే అవకాశాన్ని WhatsApp కాలింగ్ ఇస్తుంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన మెసేజ్‌లు డెలివరీ అయిన తర్వాత మీ డివైజ్‌లోనే స్టోర్ చేయబడతాయి, WhatsApp సర్వర్లలో కాదు.
మీరు చేసే కాల్స్, అలాగే పంపే మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతున్నాయా లేదా అని మీరు చెక్ చేసుకోగలిగేలా WhatsApp మిమ్మల్ని అనుమతిస్తోంది. నేరుగా చాట్‌లో లేదా కాంటాక్ట్ సమాచారంలో లేదా బిజినెస్ సమాచారంలో ఈ ఇండికేటర్ కోసం చూడండి.
WhatsAppలోని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి Open Whisper Systems సహకారంతో రూపొందించబడిన లోతైన సాంకేతిక వివరణను చదవండి.
క్రమం తప్పకుండా అందించబడే భద్రతా అప్డేట్ల కోసం భద్రతా అడ్వయిజరీలను చెక్ చేయండి.
1 2021లో.