సింపుల్‌గానూ, ప్రైవేటుగానూ ఉండే ఒక ప్రోడక్టును రూపొందించడం ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రైవేటుగా కనెక్ట్ అయ్యేలా చేయడమే మా లక్ష్యం. మీరు మీ స్నేహితులు లేదా కుటుంబానికి వ్యక్తిగత మెసేజ్‌లు పంపుతున్నా, ఒక బిజినెస్ సంస్థకు మెసేజ్ పంపుతున్నా, మీ మధ్య జరిగే సమాచార మార్పిడి సురక్షితంగా ఉంటుంది కాబట్టి నియంత్రణ మీ చేతిలోనే ఉంటుంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన చాట్స్లోని సంభాషణలు స్పష్టంగా గోల్డ్ మెసేజ్‌తో లెబుల్ చేయబడతాయి; ఈ మెసేజ్‌లు, కాల్లు, మీ మధ్యే ఉంటాయి, వాటి కంటెంట్‌ను ఎవరు చదవడం లేదా వినడం చేయలేరు, చివరకు WhatsApp కూడా..
మీ మెసేజులు మీవే. అందుకే మీ మెసేజులు మీ ఫోన్లో స్టోర్ చేయబడతాయి, వాటిని మేము ప్రకటనదారులతో షేర్ చేయము.
మీ గోప్యత మరియు భద్రతను అర్థం చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకోవడాన్ని WhatsApp సులభతరం చేస్తోంది.
సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో మరియు మీ కమ్యూనికేషన్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు WhatsApp పలు రకాల టూల్స్, ఫీచర్లు మరియు వనరులను అందిస్తోంది.
ఎలాగో మరింత తెలుసుకోండి:
ఏ సమాచారం ప్రైవేటుగా ఉంటుంది మరియు ఏ సమాచారాన్ని మేము సేకరించి మా మాతృ సంస్థయిన Facebookతో షేర్ చేస్తామనే అంశాలపై మేము స్పష్టంగా ఉండాలనుకుంటాము. మేము షేర్ చేసే సమాచారం ఉత్తమమైన వినియోగదారు అనుభవాన్ని అందించి భద్రతను మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది. ఖచ్చితమైన తాజా సమాచారం కోసం, మా గోప్యత విధానం చూడండి.