మీ గోప్యతకు మేము ప్రాధాన్యత ఇస్తాము. వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపండి.
సింపుల్‌గానూ, ప్రైవేటుగానూ ఉండే ఒక ఉత్పత్తిని రూపొందించడం ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రైవేటుగా కనెక్ట్ అయ్యేలా చేయడమే మా లక్ష్యం. మీరు మీ స్నేహితులు లేదా కుటుంబానికి వ్యక్తిగత మెసేజ్‌లు పంపుతున్నా, ఒక బిజినెస్ సంస్థకు మెసేజ్ పంపుతున్నా, మీ మధ్య జరిగే సమాచార మార్పిడి సురక్షితంగా ఉంటుంది కాబట్టి నియంత్రణ మీ చేతిలోనే ఉంటుంది.
మీ ప్రైవసీ ఆటోమేటిక్‌గా ఉంటుంది
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన చాట్‌లలోని సంభాషణలు ఒక బంగారు మెసేజ్‌తో లేబుల్ చేయడం జరుగుతుంది; ఈ మెసేజ్‌లు మరియు కాల్‌లు మీ మధ్య మాత్రమే ఉంటాయి, WhatsAppతో పాటు ఇతరులు ఎవరూ వాటిలోని కంటెంట్‌ని చదవలేరు లేదా వినలేరు.
మెసేజ్‌లు మీ పరికరంలో స్టోర్ అవుతాయి
మీ మెసేజులు మీవే. అందుకే మీ మెసేజులు మీ ఫోన్లో స్టోర్ చేయబడతాయి, వాటిని మేము ప్రకటనదారులతో షేర్ చేయము.
మీ గోప్యతను మీరే నియంత్రించుకుంటారు
మీ గోప్యత మరియు భద్రతను అర్థం చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకోవడాన్ని WhatsApp సులభతరం చేస్తోంది.
ఒకసారి చూడండి
ఒకసారి చూసిన తర్వాత అదృశ్యమయ్యే ఫోటోలు మరియు వీడియోలను పంపండి.
మీ WhatsAppను లాక్ చేయండి
చివరిగా కనిపించినది
మీరు WhatsAppను చివరిగా ఎప్పుడు తెరిచారనే దానిని కేవలం మీ కాంటాక్టులు మాత్రమేనా లేదా ప్రతీ ఒక్కరూ చూడగలగవచ్చా లేక ఎవరూ చూడకూడదా అనే దానిని ఎంచుకోండి.
ప్రొఫైల్ ఫోటో గోప్యత
మీ ప్రొఫైల్ ఫోటోను కేవలం మీ కాంటాక్టులు, ప్రతి ఒక్కరూ చూడవచ్చా లేక ఎవరికీ వద్దా అనే దానిని నిర్ణయించండి.
గ్రూప్ గోప్యతా సెట్టింగ్‌లు
మిమ్మల్ని గ్రూప్ చాట్‌కు ఎవరైనాా జోడించవచ్చా లేక మీ కాంటాక్ట్‌లలోని వారందరా లేక కేవలం కొందరు కాంటాక్ట్‌లు మాత్రమే జోడించవచ్చా అనే దానిని ఎంచుకోండి.
మీ భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము
సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో మరియు మీ కమ్యూనికేషన్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు WhatsApp పలు రకాల టూల్స్, ఫీచర్లు మరియు వనరులను అందిస్తోంది.
కింది వాటిని ఎలా చేయాలో తెలుసుకోండి:
డేటా పారదర్శకత
ఏ సమాచారం ప్రైవేటుగా ఉంటుంది, అలాగే ఏ సమాచారాన్ని మేము సేకరించి మా మాతృ సంస్థ అయిన Metaతో షేర్ చేస్తామనే అంశాలపై మేము స్పష్టంగా ఉండాలనుకుంటాము. మేము షేర్ చేసే సమాచారం, ఉత్తమమైన వినియోగదారు అనుభవాన్ని అందించి భద్రతను మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది. ఖచ్చితమైన తాజా సమాచారం కోసం, మా గోప్యతా విధానం చూడండి.