మీ స్నేహితులతో సమావేశాన్ని సులభంగా సమన్వయపరచడం మొదలుకుని గ్రూప్ చాట్‌లో షేర్ చేసేందుకు ఇమేజ్‌లను క్రియేట్ చేయడం వరకు, WhatsAppలో సురక్షత మరియు గోప్యత సౌలభ్యాలను అందిస్తూనే, ఏ విషయంలోనైనా సహాయం పొందడాన్ని Meta AI సులభం చేస్తుంది.
ఫీచర్‌లు వినియోగదారులందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. లభ్యత గురించి ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసుకోండి.
గణితశాస్త్ర సమస్యను పరిష్కరించడం మొదలుకుని ఫోటోను ఎడిట్ చేయడం లేదా గ్రూప్ చాట్‌లో ఉన్న అందరూ అంగీకరించగల రెస్టారెంట్‌ను కనుగొనడం వరకు అన్నింటినీ మీరు టెక్స్ట్ లేదా వాయిస్‌లో ఎలా కావాలంటే ఆ విధంగా Meta AIతో సహాయం పొందండి.
మీ గ్రూప్ చిహ్నం వలె ఉపయోగించడం, మీ వీడియో కాల్ కోసం బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేయడం లేదా చాట్‌లో పంపడం కోసం మీ ఫోటోలను ఎడిట్ చేయడానికి లేదా AI ద్వారా జనరేట్ చేయబడిన కొత్త ఇమేజ్‌లను క్రియేట్ చేయడానికి, Meta AIని ఉపయోగించి మీ ఆలోచనలకు జీవం పోయండి.
చూడని మెసేజ్‌లు పేరుకుపోవడం మొదలైనప్పుడు, Meta AI సహాయంతో వాటిలోని సారాంశాన్ని మీరు వేగంగా తెలుసుకోవచ్చు, తద్వారా మీరు వెంటనే సంభాషణలోకి ప్రవేశించవచ్చు. ప్రైవేట్ ప్రాసెసింగ్ సాంకేతికత అనేది మీ మెసేజ్‌లను Meta లేదా WhatsApp చదవలేకుండా వాటిని ప్రాసెస్ చేసే సౌలభ్యాన్ని Meta AIకి అందిస్తుంది.
WhatsApp ద్వారా అందుబాటులో ఉన్న AI అనుభవాలను మీరు ఎలా ఉపయోగిస్తారు అనేది పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది. ఎప్పటిలాగానే, మీ వ్యక్తిగత మెసేజ్‌లు, అలాగే కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడటం ద్వారా రక్షించబడతాయి. మీ వ్యక్తిగత మెసేజ్‌లను ఉపయోగించే ఫీచర్‌ల కోసం, ప్రైవేట్ ప్రాసెసింగ్ సాంకేతికత అనేది మీ మెసేజ్‌లను Meta లేదా WhatsApp చదవలేకుండా ప్రతిస్పందనను జనరేట్ చేసే సౌలభ్యాన్ని Meta AIకి అందిస్తుంది.
మీరు నేరుగా చాట్‌లో అడిగినా లేదా WhatsAppలోనే ఇతర AI అనుభవాలను అన్వేషించినా—సహాయం చేసేందుకు Meta AI సిద్ధంగా ఉంది, అలాగే దాన్ని ఉపయోగించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి.
తెలుసుకోవడానికి, క్రియేట్ చేయడానికి మరియు అన్వేషించడానికి Meta AIతో చాటింగ్ చేయండి. మీరు తర్వాతి వెకేషన్‌కు వెళ్లాలనుకునే గమ్యస్థానం గురించి పరిశోధించడం మొదలుకుని సరైన పదాలతో మెసేజ్ వ్రాయడం వరకు, Meta AI సహాయపడగలదు.
మీరు ఊహించగల దేన్నైనా క్రియేట్ చేసేందుకు Meta AIని ఉపయోగించండి, సెల్ఫీని అప్‌లోడ్ చేసి, ఏదైనా దృశ్య వివరణలో మిమ్మల్ని ఊహించుకుని, ఆపై ఫలితాలను మీ గ్రూప్ చాట్‌తో షేర్ చేయండి.
మీ ఫోటోను మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో అదే విధంగా పొందండి. కొత్త బ్యాక్‌గ్రౌండ్‌ను యాడ్ చేయడం, ఏదైనా వస్తువును తీసివేయడం, ఇలస్ట్రేషన్‌గా మార్చడం వంటివి ఇంకా ఎన్నో చేయమని Meta AIని అడగండి.
మీరు గుర్తించని మొక్క ఫోటోను మీరు తీసినా లేదా గణితశాస్త్రంలోని ఏదైనా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడంలో మీకు సహాయం అవసరమైనా, మీ ఫోటోలలో ఉన్న దాని గురించి తెలుసుకోవడానికి Meta AIని ఉపయోగించండి.