కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

చివరిగా సవరించినది: జనవరి 04, 2021 (భద్రపరచిన వెర్షన్స్)

WhatsApp సేవా నిబంధనలు

*మీరు యూరోపియన్ ప్రాంతంలో నివసించే వారు కాకపోతే, ఈ సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానం కింద WhatsApp LLC మీకు WhatsAppని అందిస్తుంది. *

WhatsApp ఒప్పంద సారాంశం కోసం మరియు యూరోపియన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కోడ్ ద్వారా మాకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మా యాప్‌లు, సేవలు, ఫీచర్‌లు, సాఫ్ట్‌వేర్ లేదా వెబ్‌సైట్ ద్వారా మా సేవలు (క్రింద పేర్కొన్న విధంగా) అందించాలంటే, మేము మా సేవా నిబంధనలు ("నిబంధనలు") కోసం మీ ఒప్పందం పొందాలి.

మీరు యూరోపియన్ ఎకనామిక్ ప్రాంతంలోని ఒక దేశం లేదా భూభాగం (యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో భాగం) మరియు ఏదైనా చేర్చబడిన ఇతర దేశం లేదా భూభాగం (సమిష్టిగా "యూరోపియన్ ప్రాంతం"గా సూచిస్తారు)లో నివసిస్తుంటే, క్రింద వివరించిన సేవలను WhatsApp ఐర్లాండ్ లిమిటెడ్ ("WhatsApp," "మా," "మేము," లేదా "మాకు") మీకు అందిస్తుంది. యూరోపియన్ ప్రాంతంలో భాగం కాని ఏదైనా ఇతర దేశం లేదా ప్రాంతంలో మీరు నివసిస్తుంటే, ఈ, సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానం కింద WhatsApp LLC మీకు సేవలు అందిస్తుంది.

మళ్లీ పైకి

మా సేవల గురించి

  • గోప్యత మరియు భద్రత సూత్రాలు. మేము WhatsAppని ప్రారంభించినప్పటి నుంచి, దృఢమైన గోప్యత మరియు భద్రతా సూత్రాలను దృష్టిలో ఉంచుకుని మేము మా సేవలను రూపొందించాము.
  • ఇతర వ్యక్తులతో మిమ్మల్ని కనెక్ట్ చేయడం. మేము సందేశాలు, వాయిస్ మరియు వీడియో కాల్‌ల ద్వారా, చిత్రాలు మరియు వీడియో పంపడం, మీ స్టేటస్ చూపడం మరియు మీ లొకేషన్‌ను మీరు ఎంపిక చేసిన ఇతరులతో షేర్ చేసుకోవడం సహా ఇతర WhatsApp వినియోగదారులతో కమ్యూనికేట్ చేసే మార్గాలను మీకు అందిస్తాము మరియు వాటిని మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. భాగస్వాములు, సేవా ప్రదాతలు మరియు అనుబంధ కంపెనీలతో WhatsApp కలసి పనిచేయడం ద్వారా, వారి సేవలతో మిమ్మల్ని కనెక్ట్ చేసే మార్గాలు అందించడంలో మాకు సహాయంగా పని చేస్తుంది.
  • బిజినెస్‌లతో కమ్యూనికేట్ చేయడం. ఆర్డర్, లావాదేవీ మరియు అపాయింట్మెంట్ సమాచారం, డెలివరీ మరియు షిప్పింగ్ నోటిఫికేషన్‌లు, ఉత్పత్తి మరియు సేవా అప్‌డేట్‌లు మరియు మార్కెటింగ్ లాంటి వాటి ద్వారా మా సేవలు ఉపయోగించి పరస్పరం కమ్యూనికేట్ చేయడానికి వీలుగా మీకు మరియు బిజినెస్‌లు మరియు ఇతర సంస్థలకు మేము మార్గాలు అందిస్తున్నాము మరియు ఆ దిశగా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. బిజినెస్‌లు మరియు ఇతర సంస్థలు మా సేవలు ఉపయోగించడానికి సంబంధించి కొలమానాలు అందించడం లాంటి నిర్దిష్ట ఫీచర్లు మరియు సేవలను మేము వారికి అందిస్తాము.
  • సురక్షత, భద్రత మరియు సమగ్రత. మా సేవల సురక్షత, భద్రత మరియు సమగ్రతను రక్షించడానికి మేము పని చేస్తాము. దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులు మరియు మా నిబంధనలను ఉల్లంఘించే కార్యకలాపంతో తగిన విధంగా ప్రవర్తించడం లాంటివి ఇందులో ఉంటాయి. ఇతరుల పట్ల హానికర రీతిలో ప్రవర్తించడంతో సహా మా సేవల దుర్వినియోగాన్ని నిరోధించడానికి మేము కృషి చేస్తాము. మాకు ఇటువంటి వ్యక్తులు లేదా కార్యాకలాపం గురించి తెలిస్తే, సదరు వ్యక్తులు లేదా కార్యకలాపాన్ని తీసివేయడం లేదా చట్ట పరిరక్షణ అధికారులను సంప్రదించడం ద్వారా మేము తగిన చర్యలు తీసుకుంటాము. అటువంటి తీసివేత అనేది క్రింద పేర్కొన్న “రద్దు” విభాగానికి అనుగుణంగా ఉంటుంది.
  • మా సేవలకు యాక్సెస్‌ను అనుమతించడం. మా ప్రపంచవ్యాప్త సేవలను నిర్వహించడం కోసం, మేము కంటెంట్ మరియు సమాచారాన్ని మీ నివాస దేశం వెలుపలి ప్రాంతాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా డేటా కేంద్రాలు మరియు సిస్టమ్‌లలో నిల్వ చేయాలి మరియు పంపిణీ చేయాలి. మా సేవలను అందించడం కోసం ఈ అంతర్జాతీయ మౌలిక సదుపాయాన్ని ఉపయోగించడం తప్పనిసరి మరియు ఆవశ్యకం. అనుబంధ కంపెనీలతో సహా మా సేవా ప్రదాతలు ఈ మౌలిక సదుపాయాన్ని సొంతంగా కలిగి ఉండవచ్చు లేదా నిర్వహించవచ్చు.

అత్యవసర సేవలకు యాక్సెస్ లేదు: మా సేవలు మరియు మీ మొబైల్ ఫోన్ మరియు ఫిక్స్డ్-లైన్ టెలిఫోన్ మరియు SMS సేవల మధ్య ముఖ్యమైన తేడాలున్నాయి. పోలీస్, అగ్నిమాపక విభాగాలు, లేదా ఆసుపత్రులతో సహా అత్యవసర సేవలు లేదా అత్యవసర సేవా ప్రదాతలకు యాక్సెస్‌ను, లేదా ప్రజా భద్రతా ప్రత్యుత్తర కేంద్రాలకు కనెక్షన్‌‌ను మా సేవలు అందించవు. మొబైల్ ఫోన్, ఫిక్స్డ్-లైన్ టెలిఫోన్, లేదా ఇతర సేవ ద్వారా మీరు మీ సంబంధిత అత్యవసర సేవల ప్రదాతలను సంప్రదించవచ్చని మీరు నిర్ధారించుకోవాలి.

నమోదు. మీరు ఖచ్చితమైన సమాచారాన్ని ఉపయోగించి మా సేవల కోసం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి, మీ ప్రస్తుత మొబైల్ ఫోన్ నంబర్‌ను అందించాలి, ఒకవేళ మీరు దాన్ని మార్చినట్లయితే, మేము అందించే యాప్‌లో నంబర్ మార్పు ఫీచర్‌ని ఉపయోగించి మీ మొబైల్ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలి. మా సేవల కోసం నమోదు చేసుకోవడానికి కోడ్‌లతో (మా నుండి లేదా మా మూడవ-పక్షం ప్రదాతల నుంచి) టెక్స్ట్ మెసేజ్‌లు మరియు ఫోన్ కాల్‌లు స్వీకరించడానికి మీరు అంగీకరించాలి.

అడ్రస్ బుక్. కాంటాక్ట్ అప్‌లోడ్ ఫీచర్‌ను మీరు ఉపయోగించవచ్చు మరియు వర్తించే చట్టాలు అనుమతించిన పక్షంలో, మా సేవల వినియోగదారులు మరియు మీ ఇతర కాంటాక్ట్‌లు రెండింటితో సహా, మీ మొబైల్ అడ్రస్ బుక్‌లోని ఫోన్ నంబర్‌లను క్రమబద్ధంగా మాకు అందించవచ్చు. మా కాంటాక్ట్ అప్‌లోడ్ ఫీచర్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

వయస్సు. యూరోపియన్ ప్రాంతంలోని దేశం లేదా భూభాగంలో మీరు నివసిస్తుంటే, మీరు తప్పకుండా కనీసం 16 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి లేదా తల్లిదండ్రుల అనుమతి లేకుండా మా సేవల కోసం నమోదు చేసుకోవడానికి మీ దేశం లేదా భూభాగంలో అవసరమైన గరిష్ట వయసు కలిగి ఉండాలి. యూరోపియన్ ప్రాంతంలో భాగం కాని దేశం లేదా భూభాగంలో మీరు నివసిస్తుంటే, మీరు తప్పకుండా కనీసం 13 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి లేదా మా సేవల కోసం నమోదు చేసుకోవడానికి మీ దేశం లేదా భూభాగంలో అవసరమైన గరిష్ట వయసు కలిగి ఉండాలి. వర్తించే చట్టం ప్రకారం మా సేవలు ఉపయోగించడానికి కనీస వయస్సుకు అదనంగా, మీ దేశం లేదా భూభాగంలో మా నిబంధనలను అంగీకరించే అధికారం మీకు లేకపోతే, మీరు సేవలు ఉపయోగించడానికి మీ తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మా నిబంధనలు అంగీకరించాలి. ఈ నిబంధనలను మీకు చదివి వినిపించాల్సిందిగా దయచేసి మీ తల్లిదండ్రులు లేదా సంరక్షకులను అడగండి.

డివైజ్‌లు మరియు సాఫ్ట్‌వేర్. మేము సరఫరా చేయని మా సేవలను ఉపయోగించడానికి మీరు తప్పనిసరిగా నిర్దిష్ట డివైజ్‌లు, సాఫ్ట్‌వేర్ మరియు డేటా కనెక్షన్‌లు అందించాలి. మా సేవలను ఉపయోగించే క్రమంలో, మా సేవలకు అప్‌డేట్‌లను మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి మీరు సమ్మతించాలి. మా సేవలు మీకు అందించడానికి అవసరమైన పరిధి మేరకు, మేము మా సేవల ద్వారా కాలానుగుణంగా మీకు నోటిఫికేషన్‌లు పంపడానికి కూడా మీరు సమ్మతి అందించాలి.

రుసుములు మరియు పన్నులు. మా సేవలను మీరు ఉపయోగించడంలో అనుబంధమైన అన్ని క్యారియర్ డేటా ప్లాన్‌లు, ఇంటర్నెట్ ఫీజులు, అలాగే ఇతర ఫీజులు మరియు పన్నులకు మీరే బాధ్యత వహించాలి.

మళ్లీ పైకి

గోప్యతా విధానం మరియు యూజర్ డేటా

మీ గోప్యత విషయంలో WhatsApp జాగ్రత్త వహిస్తుంది. WhatsApp గోప్యతా విధానం అనేది మీ నుండి మేము స్వీకరించే మరియు సేకరించే సమాచారం రకాలు, ఈ సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము మరియు షేర్ చేస్తాము, అలాగే మీ గురించిన సమాచారం ప్రాసెసింగ్‌కు సంబంధించి మీ హక్కులతో సహా మా డేటా (మెసేజ్‌తో సహా) పద్ధతులను వివరిస్తుంది.

మళ్లీ పైకి

మా సేవల ఆమోదయోగ్యమైన ఉపయోగం

మా నిబంధనలు మరియు విధానాలు. మీరు తప్పనిసరిగా మా నిబంధనలు మరియు విధానాల ప్రకారమే మా సేవలను ఉపయోగించాలి. మీరు మా నిబంధనలు లేదా విధానాలను ఉల్లంఘించిన పక్షంలో, మేము మీ అకౌంట్‌ను నిలిపివేయడం లేదా తాత్కాలికంగా ఆపివేయడంతో సహా మీ అకౌంట్‌కు సంబంధించి చర్య తీసుకోవచ్చు మరియు మేము అలా చేసిన పక్షంలో, మా అనుమతి లేకుండా మీరు మరొక అకౌంట్ రూపొందించరని మీరు అంగీకరిస్తున్నారు. మీ ఖాతాను నిలిపివేయడం లేదా తాత్కాలికంగా ఆపివేయడం అనేది క్రింద పేర్కొన్న "రద్దు" విభాగానికి అనుగుణంగా ఉంటుంది.

చట్టబద్ధమైన మరియు ఆమోదయోగ్యమైన వినియోగం. మీరు తప్పనిసరిగా మా సేవలను చట్టబద్ధమైన, అధీకృత, మరియు ఆమోదయోగ్యమైన ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. క్రింద పేర్కొన్న మార్గాల్లో మీరు మా సేవలను వినియోగించడం (లేదా అలా వినియోగించడంలో ఇతరులకు సహాయం చేయడం) చేయకూడదు: (ఎ) గోప్యత, ప్రచారం, మేధో సంపత్తి, లేదా ఇతర యాజమాన్య హక్కులతో సహా, WhatsApp, మా యూజర్‌లు లేదా ఇతరుల హక్కులను ఉల్లంఘించడం, దుర్వినియోగం చేయడం లేదా అతిక్రమించడం; (బి) చట్టవ్యతిరేక, అశ్లీల, అపకీర్తి కలిగించే, బెదిరింపులకు గురిచేసే, భయపెట్టే, వేధించే, ద్వేషించే, జాతిపరంగా లేదా జాతిమూలం పరంగా అభ్యంతరకరమైన లేదంటే హింసాత్మక నేరాలను ప్రోత్సహించే, పిల్లలు లేదా ఇతరులను ప్రమాదంలో పడవేసే లేదా దోపిడీకి గురిచేసే లేదా హానికి కారణమయ్యే లాంటి చట్ట వ్యతిరేకంగా లేదా అనుచితంగా ఉండే ప్రవర్తనను రేకెత్తించడం లేదా ప్రోత్సహించడం; (సి) అబద్ధాలు, తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచురించడంలో భాగం కావడం; (డి) వేరొకరి వలె నటించడం; (ఇ) బల్క్ మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ మరియు అలాంటి చట్టవిరుద్ధమైన లేదా అనుమతించడానికి వీలుకాని కమ్యూనికేషన్‌లు పంపడంలో భాగం కావడం; లేదా (ఎఫ్) మా నుండి అనుమతి పొందితే తప్ప, ఉపయోగించకూడని మా సేవలను వ్యక్తిగతయేతర ప్రయోజనం కోసం ఉపయోగించడం.

WhatsApp లేదా మా యూజర్‌లకు హాని కలిగించడం. అనుమతించబడని లేదా అనధీకృత పద్ధతుల్లో, లేదా మాకు, మా సేవలు, వ్యవస్థలు, మా యూజర్‌లకు భారం కాగల, బలహీనపరచగల లేదా హానిచేయగల మార్గాల్లో మా సేవలను పంపిణీ, లైసెన్స్, సబ్‌లైసెన్స్, బదిలీ, డిస్‌ప్లే, పనిచేసేలా చేయడం మీద ఆధారపడి ఆటోమేటెడ్‌గా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా యాక్సెస్ చేయడం, వినియోగించడం, కాపీ చేయడం, స్వీకరించడం, సవరించడం, ఉత్పన్న కార్యకలాపాలు సిద్ధం చేయడం చేయకూడదు (లేదా అలా చేయడంలో ఇతరులకు సహాయపడకూడదు), వీటితో పాటు ప్రత్యక్షంగా లేదా ఆటోమేటెడ్ పద్ధతుల ద్వారా మీరు ఇవి కూడా చేయకూడదు: (ఎ) రివర్స్ ఇంజనీరింగ్, మార్చడం, సవరించడం, మా సేవల నుండి కోడ్‌ను విడదీయడం, లేదా సేకరించడం ద్వారా ఉత్పన్న కార్యకలాపాలు రూపొందించడం; (బి) మా సేవల ద్వారా లేదా నుండి వైరస్‌లు లేదా ఇతర హానికర కంప్యూటర్ కోడ్‌ను పంపడం, నిల్వ చేయడం లేదా ప్రసారం చేయడం; (సి) మా సేవలు లేదా వ్యవస్థలకు అనధికార యాక్సెస్ పొందడం లేదా ఆ ప్రయత్నం చేయడం; (డి) మా సేవల సురక్షత, భద్రత, గోప్యత, సమగ్రత, లభ్యత లేదా పనితీరులో జోక్యం చేసుకోవడం లేదా వాటికి అంతరాయం కలిగించడం; (ఇ) అనధికార లేదా ఆటోమేటెడ్ మార్గాల ద్వారా మా సేవలకు అకౌంట్‌లు సృష్టించడం; (ఎఫ్) మా యూజర్‌ల లేదా వారి గురించిన సమాచారాన్ని అనూహ్యమైన లేదా అనధికార పద్ధతిలో సేకరించడం; (జి) మా సేవలను లేదా మా నుండి లేదా మా సేవల నుండి పొందిన డేటాను అనధికారిక పద్ధతిలో అమ్మడం, పునఃవిక్రయం చేయడం, అద్దెకు ఇవ్వడం లేదా వాటి కోసం ఛార్జీలు వసూలు చేయడం; (హెచ్) మా సేవల ద్వారా వ్యక్తీకరించిన రూపంలో అందించిన టూల్స్ ద్వారా అధికారం పొంది ఉంటే తప్ప, ఒకే సమయంలో బహుళ డివైజ్‌ల ద్వారా ఉపయోగించబడే నెట్‌వర్క్ ద్వారా మా సేవలను పంపిణీ చేయడం లేదా అందుబాటులో ఉంచడం; (ఐ) మా సేవలు లాగానే పనిచేసే సాఫ్ట్‌వేర్ లేదా APIలు రూపొందించడం మరియు వాటిని మూడవ పక్షాలు అనధికారిక పద్ధతిలో ఉపయోగించేలా అందించడం; లేదా (జె) మోసపూరిత లేదా నిరాధార నివేదికలు లేదా విజ్ఞప్తులు సమర్పించడం ద్వారా ఏవైనా రిపోర్టింగ్ ఛానెల్‌లను దుర్వినియోగం చేయడం.

మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచడం. మీ డివైజ్ మరియు మీ WhatsApp అకౌంట్ సురక్షితంగా మరియు భద్రంగా ఉండేలా చూసే బాధ్యత మీ మీదే ఉంది మరియు మీ అకౌంట్ లేదా మా సేవలకు సంబంధించిన ఏదైనా అనధికారిక ఉపయోగం లేదా భద్రతా ఉల్లంఘన గురించి మీరు తక్షణం మాకు తెలియజేయాలి.

మళ్లీ పైకి

మూడవ-పక్షం సేవలు

మూడవ-పక్షం వెబ్‌సైట్‌లు, యాప్‌లు, కంటెంట్, ఇతర ఉత్పత్తులు మరియు సేవలు మరియు Facebook కంపెనీ ఉత్పత్తులను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం లేదా ఇంటరాక్ట్ కావడం కోసం మా సేవలు మిమ్మల్ని అనుమతించవచ్చు. ఉదాహరణకు, మా సేవలతో అనుసంధానమైన మూడవ-పక్షం డేటా బ్యాకప్ సేవలు (iCloud లేదా Google డ్రైవ్ లాంటివి) ఉపయోగించడానికి లేదా మీ WhatsApp కాంటాక్ట్‌లకు సమాచారం పంపడానికి మిమ్మల్ని అనుమతించే మూడవ-పక్షం వెబ్‌సైట్‌లోని షేర్ బటన్‌తో ఇంటరాక్ట్ కావడానికి మీరు ఎంచుకోవచ్చు. మా సేవల వినియోగానికి మాత్రమే ఈ నిబంధనలు మరియు మా గోప్యతా విధానం వర్తిస్తాయని దయచేసి గుర్తుంచుకోండి. మీరు మూడవ- పక్షం ఉత్పత్తులు లేదా సేవలు లేదా ఇతర Facebook కంపెనీ ఉత్పత్తులు ఉపయోగించినప్పుడు, ఆ ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన మీ వినియోగాన్ని వారి సొంత నిబంధనలు మరియు గోప్యతా విధానాలు ప్రభావితం చేస్తాయి.

మళ్లీ పైకి

లైసెన్సులు

మీ హక్కులు. మీ WhatsApp అకౌంట్ కోసం లేదా మా సేవల ద్వారా మీరు సమర్పించిన సమాచారానికి యాజమాన్యాన్ని WhatsApp కోరుకోదు. మీ WhatsApp అకౌంట్ కోసం లేదా మా సేవల ద్వారా మీరు సమర్పించిన అలాంటి సమాచారానికి హక్కులను మరియు మా నిబంధనలలో హక్కులు మరియు లైసెన్సులు మంజూరు చేసే హక్కులను మీరు తప్పక కలిగి ఉంటారు.

WhatsApp హక్కులు. మా సేవలతో అనుబంధించబడిన అన్ని కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, డొమైన్‌లు, లోగోలు, ట్రేడ్ డ్రెస్, వాణిజ్య రహస్యాలు, పేటెంట్లు మరియు ఇతర మేధో సంపత్తి హక్కులు అన్నీ మేము కలిగి ఉన్నాము. మా ఎక్స్‌ప్రెస్ అనుమతి లేకపోతే మరియు మా బ్రాండ్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే, మీరు మా కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు (లేదా వాటిని పోలిన మార్కులు), డొమైన్‌లు, లోగోలు, ట్రేడ్ డ్రెస్, వాణిజ్య రహస్యాలు, పేటెంట్లు లేదా ఇతర మేధోసంపత్తి హక్కులను మీరు ఉపయోగించలేకపోవచ్చు. ఏదైనా ప్రచురిత బ్రాండ్ మార్గదర్శకాలలో అధికారమిచ్చిన వాటితో సహా, మా అనుబంధ కంపెనీల ట్రేడ్‌మార్కులను వారి అనుమతితో మాత్రమే ఉపయోగించగలరు.

WhatsAppకు మీ లైసెన్స్. మా సేవలు నిర్వహించడానికి మరియు అందించడానికి, ఉత్పన్న కార్యకలాపాల వినియోగం, పునరుత్పత్తి, పంపిణీ, రూపొందించడం మరియు మా సేవల్లో లేదా వాటి ద్వారా మీరు అప్‌లోడ్, సమర్పణ, నిల్వ, పంపడం, లేదా స్వీకరించడం చేయగల సమాచార (కంటెంట్‌తో సహా) నిర్వహణ కోసం WhatsAppకు మీరు ఒక ప్రపంచవ్యాప్త, ప్రత్యేకం కాని, రాయల్టీ- రహిత, ఉపలైసెన్స్ ఇవ్వగల, మరియు బదిలీ చేయగల లైసెన్స్‌ను మంజూరు చేయాలి. ఈ లైసెన్స్‌లో మీరు మంజూరు చేసే హక్కులనేవి మా సేవలు (మీ ప్రొఫైల్ చిత్రం మరియు స్టేటస్ మెసేజ్ ప్రదర్శించడానికి, మీ మెసేజ్‌లు ప్రసారం చేయడానికి మరియు డెలివరీ చేయబడని మీ మెసేజ్‌లను మా సర్వర్‌లలో 30 రోజుల వరకు నిల్వ చేయడానికి మమ్మల్ని అనుమతించడం లాంటివి) నిర్వహించడం మరియు అందించడమనే పరిమిత ప్రయోజనం కోసం ఈ లైసెన్స్ క్రింద మీరు హక్కులను మంజూరు చేస్తారు.

మీకు WhatsApp లైసెన్స్. మా నిబంధనలకు లోబడి మరియు వాటికి అనుగుణంగా మా సేవలు ఉపయోగించడం కోసం మేము మీకు ఒక పరిమిత, ఉపసంహరించుకోలేని, ప్రత్యేకం-కాని, ఉప-లైసెన్స్ ఇవ్వలేని మరియు బదిలీ చేయలేని లైసెన్స్‌ మంజూరు చేస్తాము. మా నిబంధనల ద్వారా అనుమతించబడిన పద్ధతిలో మా సేవలు ఉపయోగించడం కోసం మిమ్మల్ని అనుమతించే ఏకైక ప్రయోజనం కోసం మాత్రమే ఈ లైసెన్స్ ఉద్దేశించబడింది. స్పష్టంగా మీకు మంజూరు చేయబడిన లైసెన్సులు మరియు హక్కులు మినహా, సూత్రప్రాయంగా కూడా మీకు ఎటువంటి ఇతర లైసెన్సులు లేదా హక్కులు ఇవ్వబడవు.

మళ్లీ పైకి

మూడవ-పక్షం కాపీరైట్, ట్రేడ్‌మార్క్ మరియు ఇతర మేధోసంపత్తి ఉల్లంఘనను నివేదించడం

మూడవ-పక్షం కాపీరైట్, ట్రేడ్‌మార్క్, లేదా ఇతర మేధోసంపత్తి ఉల్లంఘన దావాలు నివేదించడానికి, దయచేసి మా మేధోసంపత్తి విధానం సందర్శించండి. మీరు స్పష్టంగా, ఉద్దేశపూర్వకంగా లేదా పదేపదే ఇతరుల మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన పక్షంలో లేదా చట్టపర కారణాలతో మేము అలా చేయాల్సి వచ్చినప్పుడు మీ అకౌంట్‌కు సంబంధించి మేము చర్య తీసుకునే అవకాశం ఉంది. మీ ఖాతాను నిలిపివేయడం లేదా తాత్కాలికంగా ఆపివేయడం అనేది క్రింద పేర్కొన్న "రద్దు" విభాగానికి అనుగుణంగా ఉంటుంది.

మళ్లీ పైకి

బాధ్యత నిరాకరణలు మరియు విడుదల

క్రింది బాధ్యత నిరాకరణలకు లోబడి మీ సొంత పూచీతో మీరు మా సేవలు ఉపయోగిస్తారు. వర్తక సామర్థ్యం వారెంటీలు, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఫిట్‌నెస్, టైటిల్, ఉల్లంఘించకపోవడం మరియు కంప్యూటర్ వైరస్ లేదా ఇతర హానికర కోడ్ నుండి స్వేచ్ఛతో సహా, వాటికి మాత్రమే పరిమితం కాకుండా, ఎటువంటి వ్యక్తీకరించిన లేదా ఊహాజనిత వారెంటీలు లేకుండా మేము మా సేవలను "ఉన్నది ఉన్నట్టుగా" అందిస్తాము. మా ద్వారా అందించబడే ఏదైనా సమాచారం ఖచ్చితమైనది, సమగ్రమైనది, లేదా ఉపయోగకరమైనది అని, మా సేవలు ఉపయోగానికి సిద్ధంగా ఉంటాయని, దోషాలు ఉండవని, భద్రమైనవి లేదా సురక్షితమైనవని, లేదా మా సేవలు అంతరాయాలు, ఆలస్యాలు, లేదా లోపాలు లేకుండా పనిచేస్తాయని మేము వారెంటీ ఇవ్వము. మా యూజర్‌లు మా సేవలు లేదా మా సేవలు అందించే ఫీచర్‌లు, సేవలు మరియు ఇంటర్‌ఫేస్‌లను ఎలా లేదా ఎప్పుడు ఉపయోగిస్తారనే విషయాన్ని మేము నియంత్రించలేము మరియు వాటికి బాధ్యత వహించము. మా యూజర్‌లు లేదా ఇతర మూడవ-పక్షం చర్యలు లేదా సమాచారం (కంటెంట్‌తో సహా) నియంత్రించడానికి మేము బాధ్యత వహించము మరియు దానికి కట్టుబడి ఉండము. ఏదైనా మూడవ-పక్షానికి వ్యతిరేకంగా మీకు అలాంటి దావా ఉన్నప్పుడు దానితో ముడిపడి, దానికి సంబంధించి, దాని నుండి తెలిసి మరియు తెలియక ఉత్పన్నమైన ఏదైనా దావా, ఫిర్యాదు, దావా వేయగల కారణం, వివాదం, లేదా నష్టాలు (కలిపి "దావా"), నుండి మీరు మమ్మల్ని, మా సబ్సిడరీలు మరియు అఫ్లియేట్‌లు, మరియు మా మరియు వారి డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, భాగస్వాములు మరియు ఏజెంట్లను (సమిష్టిగా, "WhatsApp పార్టీలు") విడుదల చేయాలి. మీరు మా సేవలు ఉపయోగించిన ఫలితంగా, వర్తించే మీ దేశం లేదా నివాస భూభాగం చట్టాలు ఆ ఉపయోగాన్ని అనుమతించకపోతే, WhatsApp పార్టీలకు సంబంధించి మీ హక్కులనేవి భవిష్యత్ బాధ్యత నిరాకరణ ద్వారా సవరించబడవు.

మళ్లీ పైకి

బాధ్యతకు సంబంధించిన పరిమితి

WhatsApp అనేది క్రింద పేర్కొన్న పరిధి వరకు మాత్రమే బాధ్యత వహిస్తుంది:

ఉద్దేశపూర్వకంగా; పూర్తి స్థాయి నిర్లక్ష్యం; మరియు ఉత్పత్తి బాధ్యత ఆదేశం కారణంగా ప్రాణానికి, శరీరానికి లేదా ఆరోగ్యానికి హాని కారణంగా సంభవించే నష్టాలకు చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా పరిమితి లేకుండా WhatsApp బాధ్యత వహిస్తుంది.

మీకు సేవలు అందించే క్రమంలో WhatsApp వృత్తిగతమైన శ్రద్ధ వహిస్తుంది. మేము వృత్తిపరమైన శ్రద్ధతో వ్యవహరించినప్పటికీ, మేము ఈ నిబంధనలు ఉల్లంఘించకపోవడం లేదా మా చర్యల కారణంగా జరగని నష్టాలు; ఈ నిబంధనల్లోకి ప్రవేశించే సమయంలో మీ వల్ల మరియు మా వల్ల సహేతుకమైన బలవంతం లేకుండా జరిగే నష్టాలు; మరియు మా సముచిత నియంత్రణా పరిధి దాటిన నష్టాలకు WhatsApp బాధ్యత వహించదు.

మళ్లీ పైకి

వివాద పరిష్కారం

మీరు వినియోగదారు కావడంతో పాటు యూరోపియన్ రీజియన్‌లోని దేశం లేదా భూభాగంలో నివసిస్తున్న పక్షంలో, ఈ నిబంధనలు లేదా మా సేవలకు సంబంధించి మాకు వ్యతిరేకంగా మీకు ఏదైనా దావా ఉంటే, దానికి మీ దేశం లేదా భూభాగానికి చెందిన చట్టాలు వర్తిస్తాయి మరియు మీ దేశం లేదా భూభాగంలో ఆ దావాకు వర్తించే న్యాయ పరిధిలోని ఏదైనా సమర్థ న్యాయస్థానంలో మీరు ఆ దావాను పరిష్కరించుకోవచ్చు. మిగిలిన అన్ని సందర్భాల్లో, ఆ దావాను మీరు ఐర్లాండ్‌లో ఆ దావాకు సంబంధించిన న్యాయపరిధిలోని సమర్థ న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలి మరియు చట్ట నిబంధనల సంఘర్షణతో సంబంధం లేకుండా ఐర్లాండ్‌కు చెందిన చట్టాలు ఈ నిబంధనలకు వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.

మళ్లీ పైకి

మా సేవల అందుబాటు మరియు రద్దు

మా సేవలకు అందుబాటు. మా సేవలను మెరుగుపరచడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. అంటే, మా సేవలు, ఫీచర్‌లు, కార్యాచరణలు, మరియు నిర్దిష్ట డివైజ్‌లు మరియు ప్లాట్‌ఫామ్‌లను మేము విస్తరించవచ్చు, జోడించవచ్చు, లేదా తొలగించవచ్చు. నిర్వహణ, మరమ్మతులు, అప్‌గ్రేడ్‌లు, లేదా నెట్‌వర్క్ లేదా ఉపకరణ వైఫల్యాలతో సహా ఇతర కారణాలతో మా సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు. 30 రోజుల నోటీసు వ్యవధి తర్వాత ఎప్పుడైనా, నిర్దిష్ట ఫీచర్‌లు మరియు కొన్ని డివైజ్‌లు మరియు ప్లాట్‌ఫామ్‌లకు మద్దతుతో సహా మా సేవల్లో కొన్నింటిని లేదా అన్నింటిని మేము నిలిపివేయవచ్చు, దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టపరమైన అవసరాలకు స్పందించడం, లేదా భద్రత మరియు కార్యాచరణ సమస్యల పరిష్కారం లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నోటీసు కూడా ఇచ్చే అవసరం లేదు. ప్రకృతిసిద్ధ మరియు ఇతర నిర్బంధ సంఘటనల వంటి మా నియంత్రణా పరిధికి మించిన సంఘటనలు మా సేవల మీద ప్రభావం చూపవచ్చు.

రద్దు. మీరు WhatsApp యూజర్‌గా కొనసాగుతారని మేము విశ్వసించినప్పటికీ, మీ అకౌంట్‌ను తొలగించడం ద్వారా మీరు ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా WhatsAppతో మీ బంధాన్ని ముగించవచ్చు. ఆ పని ఎలా చేయాలనే సూచనల కోసం, దయచేసి మా సహాయ కేంద్రంలోని Android, iPhone, లేదా KaiOS కథనాలను సందర్శించండి.

సదుద్దేశంతో మేము తొలగిస్తే దానిపై ఎలాంటి ప్రభావం ఉండదు. చట్టాలను, మూడవ-పక్షం హక్కులను ఒక పక్షం ఉల్లంఘిస్తే లేదా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, అప్పుడు అది మంచి కారణంగానే భావించబడుతుంది, మరియు అంగీకరించిన రద్దు తేదీ వరకు లేదా నోటీసు కాలం ముగిసే వరకు, వ్యక్తిగత కేసుకు సంబంధించిన అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం మరియు రెండు పార్టీల ప్రయోజనాలు అంచనా వేసే వరకు ఒప్పంద సంబంధం కొనసాగించాలని తొలగింపు పార్టీ సహేతుకంగా భావించదు. ఏదైనా ఉల్లంఘన గురించి ఇతర పక్షానికి తెలిసి వచ్చిన తర్వాత, ఒక సహేతుకమైన కాలవ్యవధిలో మాత్రమే మంచి కారణం కోసం రద్దు అనేది సాధ్యమవుతుంది.

ఈ నిబంధనల బాధ్యతను ఉల్లంఘించడమనేది ముఖ్యమైన కారణమైతే, మంజూరు చేసిన పరిహార కాలం విజయవంతం కాకుండానే ముగిసిన తర్వాత లేదా విజయవంతం కాని హెచ్చరిక తర్వాత మాత్రమే రద్దు అనుమతించబడుతుంది. అయితే, ఉల్లంఘనలో ఉన్న పక్షం తీవ్రంగా మరియు చివరకు తన బాధ్యతలు భర్తీ చేయడానికి నిరాకరిస్తే లేదా ఒకవేళ, ఇరు పక్షాల ప్రయోజనాలను తూకం వేసిన తర్వాత, తక్షణ రద్దును ప్రత్యేక పరిస్థితులు సమర్థించకపోతే ఇది వర్తించదు.

ఈ "రద్దు" విభాగానికి అనుగుణంగా, మోసంతో సహా అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ ప్రవర్తన కోసం, లేదా ఒకవేళ, మీరు మా నిబంధనలను ఉల్లంఘించారని లేదా మాకు, మా యూజర్‌లకు, లేదా ఇతరులకు హాని, ప్రమాదం, లేదా సాధ్యం కాగల చట్టపరమైన బహిర్గతం సృష్టించారని మేము సహేతుకంగా విశ్వసిస్తే, మేము మా సేవలకు మీ యాక్సెస్‌ను లేదా వినియోగాన్ని ఎప్పుడైనా సవరించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా ముగించవచ్చు. అకౌంట్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ అకౌంట్ క్రియాశీలంగా లేకుంటే లేదా ఎక్కువ కాలం నిష్క్రియాత్మకంగా ఉంటే కూడా మేము దాన్ని నిలిపివేయవచ్చు లేదా తొలగించవచ్చు. మీరు మీ అకౌంట్‌ను తొలగిస్తే లేదా మేము దానిని తొలగించినా లేదా నిలిపివేసినా, ఈ నిబంధనలు మీకు మరియు మాకు మధ్య ఒక ఒప్పందంగా ముగుస్తాయి, అయితే, ఈ క్రింది నిబంధనలనేవి WhatsAppతో మీ బాంధవ్యానికి సంబంధించిన ఏదైనా తొలగింపును ఉనికిలో ఉండేలా చేస్తాయి. అవి: "లైసెన్సులు," "బాధ్యత నిరాకరణలు మరియు విడుదల," "బాధ్యతకు పరిమితి,""వివాద పరిష్కారం,""మా సేవల లభ్యత మరియు రద్దు," మరియు "ఇతరాలు". మీ అకౌంట్ రద్దు లేదా సస్పెన్షన్‌లో లోపం ఉందని మీరు భావిస్తే, దయచేసి మమ్మల్ని support@whatsapp.comలో సంప్రదించండి.

మళ్లీ పైకి

ఇతరాలు

  • మీకు మరియు మాకు మధ్య పరస్పరం అమలు చేయబడిన ఒప్పందం లేకపోతే, WhatsApp మరియు మా సేవలకు సంబంధించి మీకు మాకు మధ్య మొత్తం ఒప్పందాన్ని మా నిబంధనలు భర్తీ చేస్తాయి మరియు ఏదైనా ముందస్తు ఒప్పందాన్ని అధిగమిస్తాయి.
  • భవిష్యత్తులో మా సేవల్లో కొన్ని ప్రత్యేక నిబంధనలు (ఇక్కడ, వర్తించిన పక్షంలో, మీరు ప్రత్యేకంగా సమ్మతించాలి) నిబంధనల ద్వారా నిర్వహించబడతాయని సూచించే హక్కును మేము మా వద్దే ఉంచుకుంటున్నాము.
  • ఏ దేశంలో లేదా భూభాగంలో పంపిణీ చేయడానికి లేదా ఉపయోగించటానికి మా సేవలు ఉద్దేశించబడవు, అక్కడ అలాంటి పంపిణీ లేదా ఉపయోగం అనేది స్థానిక చట్టాన్ని ఉల్లంఘించవచ్చు లేదా మరొక దేశం లేదా భూభాగంలోని ఏదైనా నిబంధనలకు లోబడి ఉండవచ్చు. ఏ దేశంలోనైనా లేదా భూభాగంలోనైనా మా సేవలను పరిమితం చేసే హక్కు మాకు ఉంది.
  • వర్తించే అన్ని యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్-యేతర ఎగుమతి నియంత్రణ మరియు వాణిజ్య ఆంక్షల చట్టాలకు ("ఎగుమతి చట్టాలు") మీరు కట్టుబడి ఉండాలి. మీరు మా సేవలను వీరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎగుమతి చేయరు, మళ్లీ-ఎగుమతి చేయరు, అందించరు లేదా బదిలీ చేయరు: (ఎ) ఎగుమతి చట్టాల ద్వారా నిషేధించబడిన ఎవరైనా వ్యక్తి, సంస్థ, భూభాగం లేదా దేశానికి; (బి) యునైటెడ్ స్టేట్స్ లేదా యునైటెడ్ స్టేట్స్-యేతర ప్రభుత్వం పరిమితం చేసిన పక్షాల జాబితాలో ఎవరికైనా; లేదా (సి) అవసరమైన ప్రభుత్వ అనుమతి లేకుండా అణు, రసాయన, లేదా జీవ ఆయుధాలు లేదా క్షిపణి సాంకేతిక అప్లికేషన్‌లతో సహా ఎగుమతి చట్టాల ద్వారా నిషేధించబడిన ఏదైనా ప్రయోజనం కోసం. మీరు నియంత్రించబడిన దేశం లేదా భూభాగంలో ఉన్నట్లయితే, మీరు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ లేదా యునైటెడ్ స్టేట్స్-యేతరాలు నిషేధిత పక్షాల జాబితాలో, లేదా ఏదైనా ప్రయోజనంతో ఎగుమతి చట్టాల ద్వారా నిషేధించబడిన జాబితాలో మీరు ప్రస్తుతం ఉంటే, IP ప్రాక్సీయింగ్ లేదా ఇతర పద్ధతుల ద్వారా మీరు మీ లొకేషన్ దాస్తూ ఉంటే, మీరు మా సేవలను ఉపయోగించలేరు లేదా డౌన్‌లోడ్ చేయలేరు.
  • మీరు ప్రతిపాదించిన మా నిబంధనలకు ఏదైనా సవరణ లేదా మాఫీ కోసం మా వ్యక్తీకరించబడిన సమ్మతి అవసరం.
  • మీకు మరియు మా సమాజానికి మా ఉత్పత్తులను మునుపటి కంటే మెరుగైనవిగా రూపొందించడం కోసం మా సేవలను మెరుగుపరచడానికి మరియు కొత్త ఫీచర్‌లు అభివృద్ధిచేయడానికి మేము నిరంతరాయంగా పని చేస్తున్నాము. కాబట్టి, మా సేవలు మరియు పద్ధతులు సరైన విధంగా ప్రతిబింబించడానికి ఈ నిబంధనలను మేము కాలానుగుణంగా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. నిబంధనలనేవి ఇకపై తగినవి కావు లేదా అసంపూర్ణం అయినప్పుడు మాత్రమే మేము మార్పులు చేస్తాము. చట్టం ప్రకారం అవసరమైనప్పుడు మినహా, మా నిబంధనలుకు చేసే మార్పుల గురించి కనీసం 30 రోజుల ముందుగా (ఉదా., ఇ-మెయిల్ ద్వారా లేదా సేవల ద్వారా) మేము మీకు నోటీసు అందిస్తాము, సవరించిన నిబంధనలు ప్రభావంలోకి రావడానికి ముందే వాటిని సమీక్షించే అవకాశాన్ని ఇవి మీకు అందిస్తాయి, మరియు మీ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని అలాంటి మార్పులు మీకు సహేతుకమైనవే అని మేము నిర్ధారిస్తాము. "చివరగా మార్చిన" తేదీని మేము మా నిబంధనల పైభాగంలో కూడా అప్‌డేట్ చేస్తాము. ప్రణాళికాయుత మార్పులకు సంబంధించి మేము నోటీసు ఇచ్చిన తర్వాత, 30 రోజుల కంటే ముందు ఈ నిబంధనలకు మార్పులు అమలులోకి రావు. అప్‌డేటే చేయబడిన ఏవైనా నిబంధనలు ప్రభావంలోకి వస్తే, మీరు మా ఉత్పత్తులను ఉపయోగించడం కొనసాగించాలనుకుంటే వాటికి కట్టుబడి ఉండాలి. మీరు మా సేవలను ఉపయోగించడం కొనసాగిస్తారని మేము విశ్వసించినప్పటికీ, సవరించిన మా నిబంధనలకు మీరు అంగీకరించకపోతే, మీ అకౌంట్‌ను తొలగించడం ద్వారా మీరు మా సేవలను ఉపయోగించడం తప్పనిసరిగా ఆపేయాలి.
  • మా నిబంధనల క్రింద మా హక్కులు మరియు బాధ్యతలు అన్నీ మా అనుబంధ సంస్థల్లో వేటికైనా లేదా ఆస్తుల విలీనం, ఆర్జన, లేదా పునర్నిర్మాణం, లేదా విక్రయాలకు సంబంధించి, లేదా చట్టం ద్వారా లేదా వేరొక విధమైన నిర్వహణ ద్వారా స్వేచ్ఛగా కేటాయించబడుతాయి. అటువంటి కేటాయింపు జరిగిన సందర్భంలో, మేము మీ సమాచారాన్ని వర్తించే చట్టాలకు అనుగుణంగా మాత్రమే బదిలీ చేస్తాము మరియు అవసరమైన చోట మీ సమ్మతి కోరతాము; ఈ నిబంధనలనేవి అలాంటి మూడవ-పక్షంతో మీ సంబంధాన్ని నిర్వహిస్తాయి. మీరు WhatsApp వినియోగం కొనసాగిస్తారని మేము ఆశించినప్పటికీ, మీరు అలాంటి కేటాయింపును అంగీకరించకపోతే, కేటాయింపును గురించి తెలియజేసిన తర్వాత మీ అకౌంట్‌ను తొలగించడం ద్వారా మీరు మా సేవలను ఉపయోగించడం మానేయాలి.
  • మా నిబంధనల క్రింద మీ హక్కులు లేదా బాధ్యతలు వేటిని మా ముందస్తు వ్రాతపూర్వక సమ్మతి లేకుండా మీరు వేరొకరికి బదిలీ చేయకూడదు.
  • చట్టానికి అనుగుణంగా ప్రవర్తించకుండా మా నిబంధనల్లో ఏదీ మమ్మల్ని నిరోధించలేదు.
  • ఇక్కడ యోచించినట్టు తప్ప, మా నిబంధనలు ఏ మూడవ పక్షం లబ్ధిదారుల హక్కులను ఇవ్వవు.
  • మా నిబంధనలలో వేటినైనా అమలు చేయడంలో మేము విఫలమైతే, వాటిని విడిచిపెట్టినట్లుగా పరిగణించకూడదు.
  • ఈ నిబంధనల్లో ఏదైనా నియమం చట్టవిరుద్ధం, చెల్లనిది, లేదా ఏదైనా కారణంతో అమలు చేయలేనిదిగా తేలితే, అప్పుడు ఆ నిబంధన అనేది దానిని అమలు చేయడానికి అవసరమైన కనీస స్థాయి మేరకు సవరించినట్లుగా పరిగణించబడుతుంది మరియు దానిని అమలు చేయలేని పక్షంలో, అది మా నిబంధనల నుండి విడదీయదగినది మరియు మా నిబంధనల్లోని మిగిలిన నియమాల చెల్లుబాటు మరియు అమలు సామర్థ్యాన్ని ప్రభావితం చేయనిదిగా పరిగణించబడుతుంది మరియు మా నిబంధనల్లోని మిగిలిన భాగం పూర్తి శక్తి మరియు ప్రభావంతో ఉంటుంది.
  • మేము మీకు నిర్దిష్టంగా మంజూరు చేసినవి మినహా మిగతా అన్ని హక్కులూ మా సొంతం. కొన్ని అధికార పరిధుల్లో, వినియోగదారుగా మీకు చట్టపరమైన హక్కులు ఉండవచ్చు, మరియు ఒప్పందం ద్వారా వదులుకోలేని అటువంటి వినియోగదారుల చట్టపరమైన హక్కులను మాఫీ చేయడానికి మా నిబంధనలు ఉద్దేశించబడలేదు. అలాగే, కొన్ని అధికార పరిధుల్లో, ఒక డేటా సబ్జెక్ట్‌గా మీకు చట్టపరమైన హక్కులు ఉండవచ్చు, మరియు ఒప్పందం ద్వారా వదులుకోలేని అటువంటి హక్కులను మాఫీ చేయడానికి మా నిబంధనలు ఉద్దేశించబడలేదు.
  • WhatsApp మరియు మా సేవలు గురించి మీరు అందించే అభిప్రాయం లేదా ఇతర సూచనలను మేము ఎల్లప్పుడూ అభినందిస్తాము, అయితే, అభిప్రాయం అందించాల్సిన బాధ్యత ఏదీ మీకు లేదు మరియు మీ అభిప్రాయం లేదా సూచనలను ఎలాంటి నియంత్రణ లేకుండా లేదా దానికోసం మీకు ప్రతిఫలం ఇవ్వాలనే బాధ్యత లేకుండా మేము దానిని ఉపయోగించుకోవచ్చు.

మళ్లీ పైకి

విభిన్న భాషల్లో WhatsApp నిబంధనలకు యాక్సెస్

నిర్దిష్ట ఇతర భాషల్లో మా నిబంధనలు యాక్సెస్ చేయడానికి, మీ WhatsApp సెషన్ కోసం భాషా సెట్టింగ్‌ మార్చండి. మీరు ఎంచుకున్న భాషలో మా నిబంధనలు అందుబాటులో లేకుంటే, ఇంగ్లీషు వెర్షన్‌ను మేము డిఫాల్ట్‌గా పరిగణిస్తాము.

దయచేసి మా సేవలను మీరు వినియోగించడం గురించి అదనపు సమాచారాన్ని అందించే క్రింది పత్రాలను సమీక్షించండి:

WhatsApp గోప్యతా విధానం

WhatsApp మేధోసంపత్తి విధానం

WhatsApp బ్రాండ్ మార్గదర్శకాలు

మళ్లీ పైకి

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్