WhatsApp గోప్యతా విధానం
కంటెంట్స్ టేబుల్
WhatsApp చట్టపరమైన సమాచారం
మీరు యూరోపియన్ ప్రాంతంలో నివసిస్తుంటే, ఈ సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానం కింద మా సేవలను WhatsApp ఐర్లాండ్ లిమిటెడ్ ("WhatsApp," "మా," "మేము," లేదా "మాకు") మీకు అందిస్తుంది. మీరు యూరోపియన్ ప్రాంతం వెలుపల నివసిస్తుంటే, WhatsApp LLC ద్వారా ఈ సేవలు మీకు అందించబడుతాయి.
Facebook కంపెనీలలో మేము కూడా ఒకటిగా ఉన్నాము. మా సేవలు అందించడానికి మేము ప్రాసెస్ చేసే సమాచారంతో సహా, మా డేటా పద్ధతులు వివరించడంలో మా గోప్యతా విధానం ("గోప్యతా విధానం") సహాయపడుతుంది.
ఉదాహరణకు, మేము ఏ సమాచారం సేకరిస్తాము మరియు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి మా గోప్యతా విధానం వివరిస్తుంది. మీ గోప్యతను రక్షించడానికి మేము తీసుకునే చర్యలు - డెలివరీ చేయబడిన మెసేజ్‌లు మా ద్వారా నిల్వ చేయబడని విధంగా మరియు మా సేవలతో మీరు ఎవరిని కమ్యూనికేట్ చేయాలనే దాని మీద నియంత్రణను మీకే ఇచ్చే విధంగా మా సేవలను రూపొందించడం లాంటి వాటి గురించి కూడా ఇది వివరిస్తుంది.
ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప, ఈ గోప్యతా విధానం మా అన్ని సేవలకు వర్తిస్తుంది.
మీరు ఉపయోగించే మరియు మేము అందించే మా సేవలకు సంబంధించిన నిబంధనల గురించి వివరించే WhatsApp సేవా నిబంధనలు ("నిబంధనలు") కూడా దయచేసి చదవండి.
మళ్లీ పైకి
మేము సేకరించే సమాచారం
మా సేవలను మీరు ఇన్స్టాల్ చేసిన, యాక్సెస్ చేసిన లేదా ఉపయోగించిన సమయాలతో సహా మా సేవలు నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడం కోసం WhatsApp తప్పనిసరిగా కొంత సమాచారం స్వీకరించాలి లేదా సేకరించాలి. మేము ఏ రకమైన సమాచారం సేకరిస్తామనేది మీరు మా ఉత్పత్తులను ఎలా వినియోగిస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
మా సేవలు అందించడానికి మాకు కొంత సమాచారం అవసరం. ఇది లేకపోతే మా సేవలను మీకు అందించలేము. ఉదాహరణకు, మా సేవలు ఉపయోగించడం కోసం అకౌంట్ రూపొందించడానికి మీరు మీ మొబైల్ ఫోన్ నంబర్ తప్పక అందించాలి.
మా సేవల్లో ఎంపిక చేసుకోగల ఫీచర్లు ఉన్నాయి, వాటిని మీరు ఉపయోగించిన పక్షంలో, అలాంటి ఫీచర్లు అందించడానికి మేము అదనపు సమాచారం సేకరించాల్సి ఉంటుంది. అలాంటి సేకరణల గురించి తగిన విధంగా మీకు తెలియజేయబడుతుంది. ఏదైనా ఫీచర్ ఉపయోగించడానికి అవసరమైన సమాచారం అందించకూడదని మీరు ఎంచుకుంటే, మీరు ఆ ఫీచర్ ఉపయోగించలేరు. ఉదాహరణకు, మీ డివైజ్ నుండి మీ లొకేషన్ డేటా సేకరించడానికి మీరు మాకు అనుమతి ఇవ్వకపోతే, మీ లొకేషన్‌ను మీ కాంటాక్ట్‌లకు షేర్ చేయలేరు. Android మరియు iOS డివైజ్‌లు రెండింటిలోనూ మీ సెట్టింగ్‌లు మెనూ ద్వారా అనుమతులు నిర్వహించవచ్చు.
మీరు అందించే సమాచారం
- మీ అకౌంట్ సమాచారం. WhatsApp అకౌంట్ రూపొందించడానికి మీ మొబైల్ ఫోన్ నంబర్ మరియు ప్రాథమిక సమాచారం (మీకు నచ్చిన ప్రొఫైల్ పేరుతో సహా) మీరు తప్పక అందించాలి. ఈ సమాచారాన్ని మీరు మాకు అందించని పక్షంలో, మా సేవలు ఉపయోగించడం కోసం మీరు అకౌంట్‌ను రూపొందించలేరు. మీరు మీ అకౌంట్‌కు ప్రొఫైల్ చిత్రం మరియు "పరిచయం" సమాచారం లాంటి ఇతర సమాచారం జోడించవచ్చు.
- మీ మెసేజ్‌లు. మీకు మా సేవలు అందించే సాధారణ క్రమంలో మేము మీ మెసేజ్‌లను నిల్వ చేసి, ఉంచుకోము. బదులుగా, మీ మెసేజ్‌లు మీ డివైజ్‌లోనే నిల్వ చేయబడతాయి. సాధారణంగా ఇవి మా సర్వర్లలో నిల్వ చేయబడవు. మీ మెసేజ్‌లను డెలివరీ చేయగానే, అవి మా సర్వర్ల నుండి తొలగించబడతాయి. మీ మెసేజ్‌లను డెలివరీ చేసే క్రమంలో మేము వాటిని నిల్వ చేసే అవకాశం ఉన్న పరిస్థితులను ఈ క్రింది సందర్భాలు వివరిస్తాయి:
- డెలివరీ చేయబడని మెసేజ్‌లు. ఏదైనా మెసేజ్ తక్షణం డెలివరీ చేయలేని పక్షంలో (ఉదాహరణకు, స్వీకరించాల్సిన వారు ఆఫ్‌లైన్‌లో ఉంటే), దానిని డెలివరీ చేసే ప్రయత్నంలో భాగంగా మేము దానిని 30 రోజుల వరకు మా సర్వర్లలో ఎన్‌క్రిప్ట్ చేయబడిన రూపంలో నిల్వ చేస్తాము. ఏదైనా మెసేజ్ 30 రోజుల తర్వాత కూడా డెలివరీ కాని పక్షంలో, మేము దానిని తొలగిస్తాము.
- మీడియాను ఫార్వార్డ్ చేయడం. ఒక యూజర్ ఒక మెసేజ్‌లో మీడియాను ఫార్వార్డ్ చేసినప్పుడు, అదనపు ఫార్వార్డ్‌లను మరింత సమర్థంగా డెలివరీ చేయడంలో సహాయపడడం కోసం మేము ఆ మీడియాను ఎన్‌క్రిప్ట్ చేసిన రూపంలో మా సర్వర్లలో తాత్కాలికంగా నిల్వ చేస్తాము.
- మేము మా సేవల కోసం ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ అందిస్తాము. ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే, మీ మెసేజ్‌లు మేము మరియు మూడవ పక్షాలు కూడా చదవకుండా రక్షించే రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ మరియు WhatsApp ద్వారా బిజినెస్‌లు మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.
- మీ కనెక్షన్లు. కాంటాక్ట్ అప్లోడ్ ఫీచర్‌ను మీరు ఉపయోగించవచ్చు మరియు వర్తించే చట్టాలు అనుమతించిన పక్షంలో, మా సేవల యూజర్లు మరియు మీ ఇతర కాంటాక్ట్‌లతో సహా, మీ అడ్రస్ బుక్‌లోని ఫోన్ నంబర్లను క్రమబద్ధంగా మాకు అందించవచ్చు. మీ పరిచయాలలోని ఎవరైనా ఇప్పటికీ మా సేవలు ఉపయోగించని పక్షంలో, ఆ కాంటాక్ట్‌లు మా ద్వారా గుర్తించబడలేవని నిర్ధారించే రీతిలో ఈ సమాచారాన్ని మీ కోసం మేము నిర్వహిస్తాము. మా కాంటాక్ట్ అప్లోడ్ ఫీచర్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి. మీరు గ్రూప్‌లు మరియు బ్రాడ్కాస్ట్ లిస్ట్‌లు రూపొందించవచ్చు, వాటిలో చేరవచ్చు లేదా వాటికి జోడించబడవచ్చు మరియు అలాంటి గ్రూప్‌లు మరియు లిస్ట్‌లు మీ అకౌంట్ సమాచారంతో అనుబంధించబడతాయి. మీరు మీ గ్రూప్‌లకు పేరు పెట్టవచ్చు. మీరు గ్రూప్ ప్రొఫైల్ చిత్రం లేదా వివరణ చేర్చవచ్చు.
- స్టేటస్ సమాచారం. మీ అకౌంట్‌కు స్టేటస్ జోడించాలనుకుంటే, దానిని మాకు అందించవచ్చు. Android, iPhone లేదా KaiOSలో స్టేటస్ ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి.
- లావాదేవీలు మరియు చెల్లింపు డేటా. మీరు మా చెల్లింపుల సేవలు ఉపయోగిస్తుంటే లేదా కొనుగోళ్లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల కోసం ఉద్దేశించిన మా సేవలు ఉపయోగిస్తుంటే, చెల్లింపు అకౌంట్ మరియు లావాదేవీ సమాచారంతో సహా మీ గురించిన అదనపు సమాచారాన్ని మేము ప్రాసెస్ చేస్తాము. లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని (ఉదాహరణకు, మీ చెల్లింపు పద్ధతి, షిప్పింగ్ వివరాలు మరియు లావాదేవీ మొత్తం గురించిన సమాచారాన్ని) చెల్లింపు అకౌంట్ మరియు లావాదేవీ సమాచారం కలిగి ఉంటుంది. మీ దేశం లేదా భూభాగంలో అందుబాటులో ఉన్న మా చెల్లింపుల సేవలను మీరు ఉపయోగిస్తే, వర్తించే చెల్లింపుల గోప్యతా విధానంలో మా గోప్యతా పద్ధతులు వివరించబడతాయి.
- వినియోగదారు మద్దతు మరియు ఇతర కమ్యూనికేషన్లు. వినియోగదారు మద్దతు కోసం లేదా మరో విధంగా మీరు మాతో కమ్యూనికేట్ చేసినప్పుడు, మీ మెసేజ్‌ల కాపీలు, మీకు సహాయపడగలదని మీరు భావించే ఇతర సమాచారం మరియు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి (ఉదా., ఇమెయిల్ చిరునామా) అనే వివరాలతో సహా మా సేవల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి రావచ్చు). ఉదాహరణకు, మా యాప్ పనితీరు లేదా ఇతర సమస్యలకు సంబంధించిన సమాచారంతో మీరు మాకు ఇమెయిల్ పంపవచ్చు.
స్వయంచాలకంగా సేకరించబడే సమాచారం
- వినియోగ మరియు లాగ్ సమాచారం. సేవ-సంబంధిత, విశ్లేషణాత్మక మరియు పనితీరు సమాచారం లాంటి మా సేవల్లో మీ కార్యకలాపం గురించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. మీ కార్యకలాపం గురించిన సమాచారం (మీరు మా సేవలను ఎలా ఉపయోగిస్తున్నారు, మీ సేవల సెట్టింగ్‌లు, మా సేవలు ఉపయోగించి ఇతరులతో మీరు ఎలా సంప్రదింపులు నిర్వహిస్తున్నారు (ఏదైనా బిజినెస్‌తో మీరెప్పుడు సంభాషించారనే దానితో సహా) మరియు మీ కార్యకలాపాలు మరియు ఇంటరాక్షన్ సమయం, తరచుదనం మరియు వ్యవధితో సహా), లాగ్ ఫైల్లు మరియు విశ్లేషణ, క్రాష్, వెబ్సైట్ మరియు పనితీరు లాగ్‌లు మరియు నివేదికలను ఇది కలిగి ఉంటుంది. మా సేవలు ఉపయోగించడం కోసం మీరెప్పుడు నమోదు చేసుకున్నారు; మా మెసేజింగ్, కాలింగ్, స్టేటస్, గ్రూప్‌లు (గ్రూప్ పేరు, గ్రూప్ చిత్రం, గ్రూప్ గురించిన వివరణతో సహా), చెల్లింపులు లేదా బిజినెస్ ఫీచర్ల వంటి మీరు ఉపయోగించే ఫీచర్లు; ప్రొఫైల్ ఫోటో; "పరిచయం" సమాచారం; మీరు ఆన్లైన్లో ఉన్నారా; మీరు చివరిసారిగా మా సేవలను ఎప్పుడు ఉపయోగించారు (మీరు "చివరిగా చూసిన సమయం"); మరియు మీ "పరిచయం" సమాచారాన్ని మీరు చివరగా ఎప్పుడు అప్డేట్ చేశారు లాంటి సమాచారం కూడా ఇందులో ఉంటుంది.
- డివైజ్ మరియు కనెక్షన్ సమాచారం. మీరు మా సేవలను ఇన్స్టాల్ చేసినప్పుడు, యాక్సెస్ చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు డివైజ్ మరియు కనెక్షన్-నిర్దిష్ట సమాచారాన్ని మేము సేకరిస్తాము. హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ సమాచారం, బ్యాటరీ స్థాయి, సిగ్నల్ బలం, యాప్ వెర్షన్, బ్రౌజర్ సమాచారం, మొబైల్ నెట్వర్క్, ఫోన్ నంబర్‌తో సహా కనెక్షన్ సమాచారం, మొబైల్ ఆపరేటర్ లేదా ISP, భాష మరియు టైమ్ జోన్, IP చిరునామా, డివైజ్ చర్యల సమాచారం మరియు ఐడెంటిఫైయర్లు (అదే డివైజ్ లేదా అకౌంట్‌తో అనుబంధించబడిన Facebook కంపెనీ ఉత్పత్తులకు ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌లతో సహా) లాంటి సమాచారాన్ని ఇది కలిగి ఉంటుంది.
- లొకేషన్ సమాచారం. మీరు మీ లొకేషన్‌ను మీ కాంటాక్ట్‌లతో పంచుకోవాలనుకోవడం లేదా సమీప లొకేషన్లు లేదా ఇతరులు మీతో పంచుకున్న లొకేషన్లు చూడాలనుకోవడం లాంటి లొకేషన్-సంబంధిత ఫీచర్లు ఉపయోగించడానికి మీరు ఎంచుకున్నప్పుడు మీ అనుమతితో మేము మీ డివైజ్ నుండి ఖచ్చితమైన లొకేషన్ సమాచారం సేకరించి, ఉపయోగిస్తాము. మీ డివైజ్ సెట్టింగ్‌లలో లేదా ఇన్-యాప్ సెట్టింగ్‌లలో మీరు గుర్తించగల లొకేషన్ షేర్ లాంటి లొకేషన్-సంబంధిత సమాచారానికి సంబంధించిన కొన్ని సెట్టింగ్‌లు ఉన్నాయి. మీరు మా లొకేషన్-సంబంధిత ఫీచర్లు ఉపయోగించకపోయినప్పటికీ, మీ సర్వసాధారణ లొకేషన్ (ఉదా., నగరం మరియు దేశం) అంచనా కోసం మేము IP చిరునామాలు మరియు ఫోన్ నంబర్ ఏరియా కోడ్లు వంటి ఇతర సమాచారం ఉపయోగిస్తాము. డయాగ్నోస్టిక్‌లు మరియు ట్రబుల్షూటింగ్ ప్రయోజనాల కోసం కూడా మేము మీ లొకేషన్ సమాచారం ఉపయోగిస్తాము.
- కుకీలు. వెబ్-ఆధారితమైన మా సేవలు అందించడం, మీ అనుభవాలు మెరుగుపరచడం, మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడం మరియు వాటిని అనుకూలీకరించడం లాంటి వాటితో సహా మా సేవలను నిర్వహించడానికి మరియు అందించడానికి మేము కుకీలు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, వెబ్ మరియు డెస్క్‌టాప్ మరియు ఇతర వెబ్-ఆధారిత సేవలకు మా సేవలు అందించడానికి మేము కుకీలు ఉపయోగిస్తాము. మా సహాయ కేంద్ర కథనాల్లో ఏవి బాగా ప్రాచుర్యం పొందాయో అర్థం చేసుకోవడానికి మరియు మా సేవలకు సంబంధించిన కంటెంట్‌ను మీకు ప్రదర్శించడానికి కూడా మేము కుకీలు ఉపయోగించవచ్చు. వీటికి అదనంగా, మీకు ఒక సురక్షిత అనుభవం అందించడం మరియు మీ కోసం మా సేవలను అనుకూలీకరించడం కోసం మీ భాషా ప్రాధాన్యతల వంటి మీ ఎంపికలు గుర్తుంచుకోవడానికి మేము కుకీలు ఉపయోగించవచ్చు. మీకు మా సేవలు అందించడానికి మేము కుకీలు ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.
మూడవ-పక్షం సమాచారం
- మీ గురించి ఇతరులు అందించే సమాచారం. మీ గురించి ఇతర యూజర్ల నుండి కూడా మేము సమాచారం స్వీకరిస్తాము. ఉదాహరణకు, మీకు తెలిసిన ఇతర యూజర్లు మా సేవలు ఉపయోగించిన సందర్భంలో, వారు మీ ఫోన్ నంబర్, పేరు మరియు ఇతర సమాచారాన్ని (వారి మొబైల్లోని అడ్రస్ బుక్ నుండి లభించే సమాచారం లాంటిది) మీరు వారికి అందించిన విధంగానే మాకు అందించే అవకాశం ఉంది. వారు మీకు మెసేజ్‌లు పంపవచ్చు, మీరు ఉండే గ్రూప్‌లకు మెసేజ్‌లు పంపవచ్చు లేదా మీకు కాల్ చేయవచ్చు. ఈ యూజర్లలో ప్రతి ఒక్కరూ మాకు ఏదైనా సమాచారం అందించే ముందు మీ సమాచారాన్ని సేకరించడం, వినియోగించడం మరియు షేర్ చేయడం కోసం చట్టపరమైన హక్కులు కలిగి ఉండాలి.
సాధారణంగా ఏ యూజర్ అయినా సరే, మీ చాట్లు లేదా మెసేజ్‌లను స్క్రీన్షాట్లు తీయవచ్చు లేదా వారితో మీ కాల్‌లను రికార్డింగ్ చేయవచ్చు మరియు వాటిని WhatsAppకు లేదా ఇంకెవరికైనా పంపవచ్చు లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వాటిని పోస్ట్ చేయవచ్చని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. - యూజర్ నివేదికలు. ఇతర యూజర్లకు సంబంధించి మీరు నివేదించగల విధంగానే, ఇతర యూజర్లు లేదా మూడవ పక్షాలు కూడా మా సేవల ద్వారా మీరు వారితో లేదా ఇతరులతో జరిపిన ఇంటరాక్షన్లు మరియు మీ మెసేజ్‌లను మాకు నివేదించడానికి ఎంచుకోవచ్చు; ఉదాహరణకు, మా నిబంధనలు లేదా విధానాల ఉల్లంఘనలను నివేదించవచ్చు. ఒక నివేదిక రూపొందించబడినప్పుడు, నివేదిస్తున్న యూజర్ మరియు నివేదించబడిన యూజర్ ఇద్దరి సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఎవరైనా యూజర్ నివేదికను తయారు చేసినప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఇక్కడ "అధునాతన భద్రత మరియు భద్రతా ఫీచర్లు" చూడండి.
- WhatsAppలో బిజినెస్‌లు. మా సేవలు ఉపయోగించి మీరు ఇంటరాక్ట్ అయ్యిన బిజినెస్‌లు వారితో మీ ఇంటరాక్షన్ల గురించిన సమాచారాన్ని మాకు అందించవచ్చు. ఏదైనా సమాచారం మాకు అందించే సమయంలో, ఈ బిజినెస్‌లలో ప్రతి ఒక్కటీ వర్తించే చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని మేము కోరుతున్నాము. మీరు WhatsApp ద్వారా ఏదైనా బిజినెస్‌కు మెసేజ్ పంపినప్పుడు, మీరు షేర్ చేసే కంటెంట్ అనేది ఆ బిజినెస్లోని అనేక మందికి కనిపించవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, కొన్ని బిజినెస్‌లు తమ వినియోగదారులతో వారి కమ్యూనికేషన్లు నిర్వహించడంలో సహాయంగా మూడవ పక్షం సేవా ప్రదాతలతో (ఇందులో Facebook కూడా ఉండవచ్చు) కలసి పని చేస్తుండవచ్చు. ఉదాహరణకు, బిజినెస్ కోసం పంపడానికి, నిల్వ చేయడానికి, చదవడానికి, నిర్వహించడానికి లేదా ప్రాసెస్ చేయడానికి తన కమ్యూనికేషన్లను యాక్సెస్ చేసే అవకాశాన్ని ఏదైనా బిజినెస్ అలాంటి మూడవ-పక్షం సేవా ప్రదాతకు అందించవచ్చు.
ఏదైనా బిజినెస్ మీ సమాచారాన్ని మూడవ పక్షాలు లేదా Facebookతో ఎలా పంచుకోవాలనే దానితో సహా మీ సమాచారాన్ని అది ఎలా ప్రాసెస్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి, మీరు ఆ బిజినెస్ గోప్యతా విధానం సమీక్షించాలి లేదా నేరుగా ఆ బిజినెస్‌ను సంప్రదించాలి. - మూడవ-పక్షం సేవా ప్రదాతలు. మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో మాకు సహాయపడడం కోసం మేము మూడవ-పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Facebook కంపెనీలతో కలిసి పని చేస్తాము. ఉదాహరణకు, మా యాప్‌లు పంపిణీ; మా సాంకేతికత మరియు భౌతిక మౌలిక సదుపాయాలు, డెలివరీ మరియు ఇతర వ్యవస్థలు అందించడం; ఇంజనీరింగ్ మద్దతు, సైబర్ సెక్యూరిటీ మద్దతు మరియు కార్యకలాపం మద్దతు అందించడం; లొకేషన్, మ్యాప్ మరియు ప్రదేశాల సమాచారం సరఫరా; చెల్లింపుల ప్రాసెస్; ప్రజలు మా సేవలను ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడడం; మా సేవలు మార్కెట్ చేయడం; మా సేవలు ఉపయోగించి బిజినెస్‌లతో కనెక్ట్ కావడంలో మీకు సహాయపడడం; మా కోసం సర్వేలు మరియు పరిశోధనలు నిర్వహించడం; సురక్షత, భద్రత మరియు సమగ్రతను నిర్ధారించడం; మరియు వినియోగదారు సేవతో సహాయం కోసం మేము వారితో కలసి పని చేస్తాము. ఈ కంపెనీలు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో మీ గురించిన సమాచారం మాకు అందించవచ్చు; ఉదాహరణకు, సేవా సమస్యల నిర్ధారణ మరియు పరిష్కారంలో మాకు సహాయం అందించడానికి యాప్ స్టోర్లు మాకు నివేదికలు అందించవచ్చు.
WhatsApp ఏవిధంగా సమాచారం సేకరిస్తుంది మరియు ఇతర Facebook కంపెనీలతో పంచుకుంటుందనే దాని గురించిన మరింత సమాచారాన్ని క్రింద ఉన్న "ఇతర Facebook కంపెనీలతో మేము ఎలా పని చేస్తాము" అనే విభాగం అందిస్తుంది. మేము Facebook కంపెనీలతో ఎలా పని చేస్తామనే దాని గురించి మీరు మా సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోవచ్చు. - మూడవ-పక్షం సేవలు. మూడవ-పక్షం సేవలు మరియు Facebook కంపెనీ ఉత్పత్తులతో అనుబంధంగా మా సేవలు ఉపయోగించడానికి మేము మిమ్మల్ని అనుమతిస్తాము. అలాంటి మూడవ-పక్షం సేవలు లేదా Facebook కంపెనీ ఉత్పత్తులతో మీరు మా సేవలు ఉపయోగిస్తున్న పక్షంలో, మీ గురించిన సమాచారాన్ని మేము వారి నుండి స్వీకరించవచ్చు; ఉదాహరణకు, మీరు ఒక వార్తా కథనాన్ని మా సేవల్లోని మీ WhatsApp కాంటాక్ట్‌లు, గ్రూప్‌లు లేదా బ్రాడ్కాస్ట్ లిస్ట్‌లతో పంచుకోవడం కోసం ఒక వార్తా సేవలోని WhatsApp షేర్ బటన్‌ను మీరు ఉపయోగిస్తే లేదా మా సేవలను ప్రచారం చేసే ఒక మొబైల్ క్యారియర్ లేదా డివైజ్ ప్రదాత ద్వారా మా సేవలను యాక్సెస్ చేయాలని మీరు ఎంచుకుంటే, మేము మీ గురించిన సమాచారం స్వీకరించవచ్చు. మీరు మూడవ- పక్షం సేవలు లేదా Facebook కంపెనీ ఉత్పత్తులు ఉపయోగించినప్పుడు, ఆ సేవలు మరియు ఉత్పత్తులకు సంబంధించిన మీ వినియోగాన్ని వారి సొంత నిబంధనలు మరియు గోప్యతా విధానాలు ప్రభావితం చేస్తాయని దయచేసి గుర్తుంచుకోండి.
మళ్లీ పైకి
సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము
మా సేవల నిర్వహణ, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు ఇవ్వడం మరియు మార్కెట్ చేయడం కోసం మా వద్ద ఉన్న సమాచారాన్ని (మీరు చేసే ఎంపికలు మరియు వర్తించే చట్టానికి లోబడి) మేము ఉపయోగిస్తాము. అది ఎలాగో ఇక్కడ చూడండి:
- మా సేవలు. వినియోగదారు సహాయం, కొనుగోళ్లు లేదా లావాదేవీలు పూర్తి చేయడంతో సహా మా సేవలు నిర్వహించడం మరియు అందించడం; మరియు మా సేవలను మెరుగుపరచడం, పరిష్కరించడం మరియు అనుకూలీకరించడం కోసం మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము. మా సేవలను ప్రజలు ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడం; మా సేవలను అంచనా వేయడం మరియు మెరుగుపరచడం; కొత్త సేవలు మరియు ఫీచర్లను శోధించడం, అభివృద్ధి చేయడం మరియు పరీక్షించడం; మరియు ట్రబుల్షూటింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం కూడా మేము సమాచారం ఉపయోగిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు మీకు ప్రతిస్పందించడానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము.
- సురక్షత, భద్రత మరియు సమగ్రత. సురక్షత, భద్రత మరియు సమగ్రత అనేవి మా సేవల్లో అంతర్భాగంగా ఉంటాయి. అకౌంట్లు మరియు కార్యకలాపం ధృవీకరించడం; హానికర ప్రవర్తనతో పోరాటం, చెడు అనుభవాలు మరియు స్పామ్ నుండి యూజర్లను రక్షించడం; మరియు అనుమానాస్పద కార్యకలాపం లేదా మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘనలను పరిశోధించడం మరియు మా సేవలు చట్టబద్ధంగానే ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడం లాంటి వాటి ద్వారా మా సేవలలో మరియు వెలుపల సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడం కోసం మేము సమాచారం ఉపయోగిస్తాము. మరింత సమాచారం కోసం, దయచేసి క్రింద ఇచ్చిన "చట్టం, మా హక్కులు మరియు రక్షణ" విభాగం చూడండి.
- మా సేవలు మరియు Facebook కంపెనీల గురించిన కమ్యూనికేషన్లు. మా సేవల గురించి మీతో కమ్యూనికేట్ చేయడానికి, అలాగే మా నిబంధనలు మరియు విధానాలు మరియు ఇతర ముఖ్యమైన అప్డేట్ల గురించి మీకు తెలియజేయడానికి మేము సమాచారం ఉపయోగిస్తాము. మా సేవలు మరియు Facebook కంపెనీల కోసం మేము మార్కెటింగ్ అందించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం, దయచేసి "మీ హక్కులను మీరు ఎలా వినియోగించాలి" విభాగం చూడండి.
- మూడవ-పక్షం బ్యానర్ యాడ్లు ఉండవు. మా సేవల్లో మూడవ-పక్షం బ్యానర్ యాడ్లను మేము ఇప్పటికీ అనుమతించడం లేదు. వాటిని పరిచయం చేసే ఉద్దేశ్యం మాకు లేదు, కానీ, ఎప్పుడైనా మేము అలా చేసే పక్షంలో, ఈ గోప్యతా విధానాన్ని మేము అప్డేట్ చేస్తాము.
- బిజినెస్ ఇంటరాక్షన్లు. WhatsAppలో బిజినెస్‌ల క్యాటలాగ్ల వంటి మా సేవలు ఉపయోగించి మీరు మరియు బిజినెస్‌ల వంటి మూడవ పక్షాలు పరస్పరం కమ్యూనికేట్ మరియు ఇంటరాక్ట్ చేయడానికి మేము అవకాశం కల్పిస్తాము. తద్వారా మీరు ఉత్పత్తులు మరియు సేవలు బ్రౌజ్ చేయవచ్చు మరియు ఆర్డర్లు చేయవచ్చు. బిజినెస్‌లు మీకు లావాదేవీ, అపాయింట్మెంట్, మరియు షిప్పింగ్ నోటిఫికేషన్లు; ఉత్పత్తి మరియు సేవా అప్డేట్లు; మరియు మార్కెటింగ్ సమాచారం పంపవచ్చు. ఉదాహరణకు, భవిష్యత్ ప్రయాణం కోసం విమాన స్థితి సమాచారం, మీరు కొనుగోలు చేసిన దానికి రసీదు లేదా దాని డెలివరీ సమయంలో నోటిఫికేషన్ అందుకోవచ్చు. ఏదైనా బిజినెస్ నుండి మీరు స్వీకరించే మెసేజ్‌లలో మీకు ఆసక్తి కలిగించగల ఏదైనా ఒక ఆఫర్ ఉంటుంది. మీకు స్పామ్ అనుభవం ఎదురు కావాలని మేము కోరుకోము; మీ అన్ని మెసేజ్‌ల లాగానే, ఈ కమ్యూనికేషన్లనూ మీరు నిర్వహించవచ్చు మరియు మీరు చేసే ఎంపికలను మేము గౌరవిస్తాము.
- మెసేజింగ్ మెటాడేటా. మెసేజింగ్ మెటాడేటా అనేది మీ మెసేజ్‌లు లేదా కాల్‌లను మీకు అందించడం కోసం మేము ప్రాసెస్ చేసే సమాచారం కలిగి ఉంటుంది మరియు మీ యూజర్ ఐడి మరియు మీరు మెసేజ్ పంపిన సమయం లాంటి సమాచారం కూడా ఇది కలిగి ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రసారం కోసం, మా సేవల (సాధారణ ట్రాఫిక్ నిర్వహణ మరియు వైఫల్యాల నిరోధం, గుర్తింపు, దర్యాప్తు మరియు పరిహారంతో సహా) నిర్వహణ కోసం, మా సేవల సురక్షత మరియు భద్రతా నిర్ధారణ (వాటి లభ్యత, ప్రామాణికత, సమగ్రత మరియు గోప్యత మరియు ప్రత్యేకించి భద్రతాపరమైన సంఘటనలు, స్పామ్, దుర్బలత్వం, మాల్వేర్ మరియు సేవలను అనధికారికంగా ఉపయోగించడం లేదా వాటిని యాక్సెస్ చేయడం లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి) కోసం, బిల్లింగ్ కోసం (వర్తించే చోట) మరియు వర్తించే చట్టం క్రింద చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించడం కోసం మేము మెసేజింగ్ మెటాడేటాను ఉపయోగిస్తాము.
మళ్లీ పైకి
మీరు మరియు మేము షేర్ చేసుకునే సమాచారం
మా సేవల ద్వారా ఉపయోగిస్తూ మరియు కమ్యూనికేట్ చేస్తూ మీ సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడం కోసం మాకు సహాయంగా మేము మీ సమాచారాన్ని షేర్ చేస్తాము.
- మీరు కమ్యూనికేట్ చేయడానికి ఎంచుకున్న వారికి మీ సమాచారం పంపండి. మీరు మా సేవల ద్వారా ఉపయోగిస్తున్నప్పుడు మరియు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీరు మీ సమాచారం (మెసేజ్‌లతో సహా) పంచుకుంటారు.
- మీ అకౌంట్‌తో అనుబంధించబడిన సమాచారం. మా సేవలు ఉపయోగించే ఎవరికైనా మీ ఫోన్ నంబర్, ప్రొఫైల్ పేరు మరియు ఫోటో, "పరిచయం" సమాచారం, చివరిగా చూసిన సమాచారం మరియు మెసేజ్ రసీదులు అందుబాటులో ఉంటాయి, అయినప్పటికీ, బిజినెస్‌లతో సహా ఇతర యూజర్లకు అందుబాటులో ఉండే నిర్దిష్ట సమాచారాన్ని మీరు ఎవరితో కమ్యూనికేట్ చేస్తారో నిర్వహించడానికి మీ సేవల సెట్టింగ్‌లను మీరు కాన్ఫిగర్ చేయవచ్చు.
- మీ కాంటాక్టులు మరియు ఇతరులు. మీరు కమ్యూనికేట్ చేసే బిజినెస్‌లతో సహా యూజర్లు మీ సమాచారాన్ని (మీ ఫోన్ నంబర్ లేదా మెసేజ్‌లతో సహా) నిల్వ చేయగలరు లేదా మా సేవల ద్వారా మరియు ఇతర రూపాల్లో రీషేర్ చేయగలరు. మా సేవల ద్వారా మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలో మరియు మీరు షేర్ చేసే నిర్దిష్ట సమాచారాన్ని నిర్వహించడానికి మీరు మీ సేవల సెట్టింగ్‌లను మరియు మా సేవల్లోని "బ్లాక్" ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
- WhatsAppలో బిజినెస్‌లు. బిజినెస్‌లు మా సేవలను ఉపయోగించడానికి సంబంధించి కొలమానాలు అందించడం లాంటి నిర్దిష్ట సేవలు మరియు ఫీచర్లను మేము వారికి అందిస్తాము.
- మూడవ-పక్షం సేవా ప్రదాతలు. మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో మాకు సహాయపడడం కోసం మేము మూడవ-పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Facebook కంపెనీలతో కలిసి పని చేస్తాము. సాంకేతిక మౌలిక సదుపాయాలు, డెలివరీ మరియు ఇతర వ్యవస్థలు అందించడం; మా సేవలను మార్కెట్ చేయడం; మా కోసం సర్వేలు మరియు పరిశోధన నిర్వహించడం; యూజర్లు మరియు ఇతరుల రక్షణ, భద్రత మరియు సమగ్రతను రక్షించడం; మరియు వినియోగదారు సేవతో సహాయం కోసం మేము కంపెనీలతో కలసి పనిచేస్తాము. ఈ సామర్థ్యంతో మూడవ-పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Facebook కంపెనీలతో మేము సమాచారం షేర్ చేసినప్పుడు, మా సూచనలు మరియు నిబంధనలకు అనుగుణంగా మా తరఫున వారు మీ సమాచారం ఉపయోగించాలని వారిని మేము కోరుతాము. మా సేవలు నిర్వహించడం మరియు అందించడంలో Facebook కంపెనీలు మాకు ఎలా సహాయపడతాయనే దానికి సంబంధించిన మరింత సమాచారం కోసం, క్రింద ఇచ్చిన "ఇతర Facebook కంపెనీలతో మేము ఎలా పనిచేస్తాము" చూడండి. Facebook కంపెనీలతో మేము ఎలా పని చేస్తాము అనే విషయమై మా సహాయ కేంద్రంలో కూడా మీరు మరింత తెలుసుకోవచ్చు.
- మూడవ-పక్షం సేవలు. మా సేవలతో అనుసంధానమైన మూడవ-పక్షం సేవలు లేదా ఇతర Facebook కంపెనీ ఉత్పత్తులను మీరు లేదా ఇతరులు ఉపయోగించినప్పుడు, మీరు లేదా ఇతరులు ఆ మూడవ-పక్షం సేవలతో షేర్ చేసిన సమాచారాన్ని అవి స్వీకరించవచ్చు. ఉదాహరణకు, మా సేవలు (iCloud లేదా Google డ్రైవ్ లాంటివి)తో అనుసంధానమైన ఒక డేటా బ్యాకప్ సేవను మీరు ఉపయోగిస్తున్న పక్షంలో, మీరు వారితో షేర్ చేసిన మీ WhatsApp మెసేజ్‌ల వంటి సమాచారాన్ని వారు స్వీకరిస్తారు. మా సేవల ద్వారా లింక్ చేయబడిన ఒక మూడవ-పక్షం సేవ లేదా ఇతర Facebook కంపెనీ ఉత్పత్తితో మీరు ఇంటరాక్ట్ అయ్యినప్పుడు, ఒక మూడవ-పక్షం ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ ప్లే చేయడానికి ఇన్-యాప్ ప్లేయర్‌ను మీరు ఎప్పుడు ఉపయోగించారు, మీ IP చిరునామా మరియు మీరొక WhatsApp యూజర్ అనే వాస్తవం లాంటివి ఆ మూడవ-పక్షం లేదా Facebook కంపెనీ ఉత్పత్తికి అందజేసే అవకాశం ఉంది. మీరు మూడవ- పక్షం సేవలు లేదా ఇతర Facebook కంపెనీ ఉత్పత్తులు ఉపయోగించినప్పుడు, ఆ సేవలు మరియు ఉత్పత్తులకు సంబంధించిన మీ వినియోగాన్ని వారి సొంత నిబంధనలు మరియు గోప్యతా విధానాలు ప్రభావితం చేస్తాయని దయచేసి గుర్తుంచుకోండి.
మళ్లీ పైకి
మేము ఇతర Facebook కంపెనీలతో ఎలా పని చేస్తాము
Facebook కంపెనీలలో భాగంగా, Facebook కంపెనీ ఉత్పత్తుల వ్యాప్తంగా, సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి, ఉదా., స్పామ్, బెదిరింపులు, దుర్వినియోగం లేదా ఉల్లంఘన కార్యకలాపాల మీద పోరాడడం కోసం ఇతర Facebook కంపెనీల నుండి WhatsApp సమాచారాన్ని స్వీకరిస్తుంది మరియు సమాచారాన్ని షేర్ చేస్తుంది.
మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో మాకు సహాయపడేందుకు మా తరఫున పనిచేసే ఇతర Facebook కంపెనీలతో కూడా WhatsApp పని చేస్తుంది మరియు సమాచారాన్ని షేర్ చేస్తుంది. ఉదా. ప్రపంచవ్యాప్తంగా మీకు వేగవంతమైన మరియు విశ్వసనీయ మెసేజింగ్ మరియు కాల్స్ అందించడం కోసం; మౌలిక సదుపాయాలు మరియు డెలివరీ వ్యవస్థలు మెరుగుపరచడం; మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడం; బిజినెస్‌లతో కనెక్ట్ కావడానికి మీకు ఒక మార్గం అందించడంలో మాకు సహాయం చేసుకోవడం; మరియు వ్యవస్థలను సురక్షితం చేయడం కోసం మౌలిక సదుపాయాలు, సాంకేతికత మరియు వ్యవస్థలను ఇది కలిగి ఉంటుంది. Facebook కంపెనీల నుండి మేము సేవలు స్వీకరించినప్పుడు, వారితో మేము పంచుకునే సమాచారం అనేది WhatsApp తరఫున మరియు మా సూచనలకు అనుగుణంగా ఉపయోగించబడుతుంది. ఈ ప్రాతిపదికన WhatsApp షేర్ చేసే ఏదైనా సమాచారం Facebook కంపెనీల సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించబడదు.
Facebook కంపెనీలతో WhatsApp ఎలా పని చేస్తుందనే దాని గురించిన మరింత సమాచారాన్ని మేము మా సహాయ కేంద్రంలో ఉంచాము.
మళ్లీ పైకి
డేటా ప్రాసెసింగ్ కోసం మా చట్టపరమైన ప్రాతిపదికలు
వర్తించదగిన డేటా రక్షణ చట్టం ప్రకారం, కంపెనీలు డేటా ప్రాసెస్‌ను తప్పనిసరిగా చట్టం అనుమతించిన ప్రాతిపదికన నిర్వహించాలి. ఈ గోప్యతా విధానంలో వివరించిన వివిధ ప్రయోజనాల కోసం మీ డేటాను ప్రాసెస్ చేయడానికి మేము విభిన్న చట్టపరమైన ప్రాతిపదికల మీద ఆధారపడతాము. క్రింద వివరించిన విధంగా, పరిస్థితుల మీద ఆధారపడి, ఒకే ప్రయోజనం కోసం మీ డేటాను ప్రాసెస్ చేసే సమయంలో మేము విభిన్న చట్టపరమైన ప్రాతిపదికల మీద ఆధారపడే అవకాశం ఉంది. క్రింద పేర్కొన్న ప్రతి చట్టపరమైన ప్రాతిపదిక కోసం, మా ప్రాసెసింగ్ ప్రయోజనాలు (మేము మీ సమాచారాన్ని ఎందుకు ప్రాసెస్ చేస్తాము) మరియు మా ప్రాసెసింగ్ కార్యకలాపాలు (మేము మీ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తాము, ఉదా., మీ నుండి మేము సమాచారం సేకరించి, మీ అకౌంట్ రూపొందించడానికి దానిని ఉపయోగిస్తాము) మేము వివరిస్తాము. ప్రతి ప్రయోజనం కోసం మేము ప్రాసెస్ చేసే మీ డేటా వర్గాలను కూడా మేము జాబితా చేస్తాము.
ఏ చట్ట ప్రాతిపదికను మేము ఉపయోగిస్తామనే దాని మీద ఆధారపడి మీకు నిర్దిష్ట హక్కులు కూడా అందుబాటులో ఉంటాయి మరియు వీటిని మేము క్రింద వివరించాము. ఏ చట్టం అనుమతించిన మేరకు వర్తించబడిందనే దానితో సంబంధం లేకుండా మీ డేటాకు యాక్సెస్‌ను, దిద్దుబాటును మరియు దాని తొలగింపును అభ్యర్థించే హక్కు మీకు ఎల్లప్పుడూ ఉంటుందని మీరు తప్పక తెలుసుకోవాలి. మీ హక్కులు వినియోగించుకోవడం కోసం, క్రింద ఇచ్చిన "మీ హక్కులను మీరు ఎలా ఉపయోగించుకోవాలి" విభాగం చూడండి.
"మేము సేకరించే సమాచారం" విభాగంలో వివరించబడిన సమాచారాన్ని మేము సేకరిస్తాము, ఉపయోగిస్తాము మరియు షేర్ చేస్తాము:
- మా నిబంధనలలోని "మా సేవలు" విభాగంలో వివరించబడిన మెసేజింగ్ మరియు కమ్యూనికేషన్ సేవలు నిర్వహించడానికి మరియు అందించడానికి అవసరమైన ప్రకారం. ఇక్కడ మరింత తెలుసుకోండి;
- వర్తించే చోట (చట్టబద్ధంగా సమ్మతి అవసరమయ్యే చోటుతో సహా), ఒకవేళ మీరు మీ సమ్మతిని ఇచ్చి ఉంటే, మీరు ఎప్పుడైనా దానిని ఉపసంహరించుకోవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి;
- చట్ట పరిరక్షణ శాఖ నుండి వచ్చిన ఒక చట్టపరమైన అభ్యర్థనకు మేము ప్రతిస్పందించాల్సి రావడం లాంటి చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరింత తెలుసుకోండి;
- మీకు లేదా ఇంకెవరికైనా ప్రాణ హాని ఉన్న అత్యవసర పరిస్థితుల్లో మీకు సంబంధించిన లేదా ఆ ఇతరుల కీలక ప్రయోజనాలను రక్షించాల్సిన సమయం మరియు అవసరం వచ్చినప్పుడు. ఇక్కడ మరింత తెలుసుకోండి;
- మా యూజర్లు మరియు భాగస్వాములకు ఒక వినూత్న, సందర్భోచిత, సురక్షిత మరియు లాభదాయక సేవ అందించడంలో మా ప్రయోజనాలతో సహా, మా (లేదా ఇతరుల) చట్టబద్ధ ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు, ఆ ప్రయోజనాలనేవి వ్యక్తిగత డేటా రక్షణకు అవసరమైన మీ ప్రయోజనాలు లేదా ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛ ద్వారా అధిగమించబడనప్పుడు మాత్రమే; ఉదాహరణకు, మా సేవలను హానికర లేదా చట్టవ్యతిరేక కార్యకలాపం కోసం ఉపయోగించడాన్ని నిరోధించడానికి. ఇక్కడ మరింత తెలుసుకోండి;
- ప్రజా ప్రయోజనం కోసం ఇది అవసరమైన చోట. ఇక్కడ మరింత తెలుసుకోండి.
మీ డేటాను మేము ప్రాసెస్ చేసే మార్గాలు మరియు ప్రయోజనాలు గురించి మరియు అలా చేయడానికి మాకు ఉన్న చట్టపరమైన ప్రాతిపదికల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
మళ్లీ పైకి
మేము మీ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తాము
నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించడం
మీతో మా ఒప్పందం (నిబంధనలు) నిర్వహించడానికి అవసరమైన రీతిలో మీ గురించి మా వద్ద ఉన్న డేటాను ("మేము సేకరించే సమాచారం" విభాగంలో వివరించిన విధంగా) ప్రాసెస్ చేస్తాము. మేము ప్రాసెస్ చేసే డేటా వర్గాలనేవి మీరు అందించడానికి ఎంచుకున్న డేటా మరియు మీరు మా సేవలు ఉపయోగించే విధానం (మేము స్వయంచాలకంగా సేకరించే సమాచారాన్ని ఇది నిర్ణయిస్తుంది) మీద ఆధారపడి ఉంటాయి. మా ఒప్పంద సేవలు అందించడానికి అవసరమైన ప్రాసెసింగ్ ప్రయోజనాలు:
మేము మీ డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము:
- బిజినెస్‌లతో సహా ఇతర WhatsApp యూజర్లతో కనెక్ట్ మరియు కమ్యూనికేట్ చేయడం కోసం మార్గాలను అందించే మా నిబంధనలులోని "మా సేవలు" విభాగంలో వివరించిన విధంగా మా సేవలు ఆపరేట్ చేయడం, అందించడం, మెరుగుపరచడం, అనుకూలీకరించడం, మరియు మద్దతు అందించడం కోసం. WhatsApp అకౌంట్ రూపొందించడానికి, WhatsApp ద్వారా చేరగల బిజినెస్‌లతో మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి, మా సేవలకు సంబంధించిన మీ వినియోగాన్ని విశ్లేషించడానికి, ఒక సమస్యకు ప్రతిస్పందించడంలో వినియోగదారు మద్దతు అందించడానికి లేదా మీ అకౌంట్‌ను మూసివేయాలని మీరు ఎంచుకున్నప్పుడు మీ డేటాను తొలగించడానికి మీ నుండి సమాచారం సేకరించడం ఇందులో భాగంగా ఉంటుంది.
- కమ్యూనికేషన్ ప్రసారం; సాధారణ ట్రాఫిక్ నిర్వహణ మరియు వైఫల్యాల నిరోధం, గుర్తింపు, దర్యాప్తు మరియు పరిహారంతో సహా సేవల నిర్వహణ; మరియు బిల్లింగ్, కోసం వర్తించే చోట మేము మెసేజింగ్ మెటాడేటాను ఉపయోగిస్తాము.
- ఉదాహరణకు బహుళ అకౌంట్లను ఉపయోగించే స్పామర్ల మీద చర్య తీసుకోవడం ద్వారా మా సేవల సురక్షత, భద్రత మరియు సమగ్రతను నిర్ధారించడం. మా సేవలను చట్టవిరుద్ధంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి మీరు అకౌంట్ రూపొందించినప్పుడు లేదా మీ అకౌంట్‌తో సంబంధం కలిగిన అనుమానాస్పద కార్యకలాపాన్ని విశ్లేషించినప్పుడు మీరు అందించిన డేటాను ధృవీకరించడంలో ఇది భాగం వహిస్తుంది.
- మా సేవల సురక్షత మరియు భద్రతను నిర్ధారించడానికి మేము మెసేజింగ్ మెటాడేటా ఉపయోగిస్తాము, (వాటి లభ్యత, ప్రామాణికత, సమగ్రత మరియు గోప్యత మరియు ప్రత్యేకించి భద్రతా సంఘటనలు, దుర్బలత్వం, మాల్వేర్ మరియు స్పామ్ లేదా సేవలు లేదా యూజర్ డివైజ్‌లకు అనధీకృత యాక్సెస్ ఎనేబుల్ చేయడం లేదా వాటిని ఉపయోగించడాన్ని నిరోధించడం, గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు పరిష్కరించడం ఇందులో భాగంగా ఉంటాయి. మరింత తెలుసుకోవడానికి, WhatsApp భద్రతను సందర్శించండి.
- "మా గ్లోబల్ ఆపరేషన్లు" క్రింద వివరించిన విధంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలు లేదా భూభాగాలతో సహా మూడవ దేశాలలో మీ డేటా బదిలీ చేయడానికి లేదా ప్రసారం చేయడానికి, నిల్వ చేయడానికి లేదా ప్రాసెస్ చేయడానికి.
- అప్డేట్ గురించి మీకు ఒక నోటిఫికేషన్ పంపడం లేదా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు మీకు ప్రతిస్పందించడం లాంటి సేవల-సంబంధిత సమస్యల మీద మీతో కమ్యూనికేట్ చేయడానికి.
- ఉపయోగించిన డేటా వర్గాలు: మేము ఈ ప్రయోజనం కోసం ఈ గోప్యతా విధానంలోని "మీరు అందించే సమాచారం" విభాగంలో వివరించిన సమాచారం ఉపయోగిస్తాము.
మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము మరియు మా ప్రపంచ కార్యకలాపాలు కింద, ఈ ప్రయోజనాలలో ప్రతి ఒక్కటీ మరింత వివరంగా వివరించబడింది. GDPR క్రింద మీతో మా ఒప్పంద భాగస్వామ్యం నిర్వహించడం అవసరమై, మీరు మాకు అందించిన డేటాను మేము ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ డేటాను దిగుమతి చేసుకునే హక్కు మీకు ఉంటుంది. మీ హక్కులు వినియోగించుకోవడం కోసం, గోప్యతా విధానంలోని మీరు మీ హక్కులను ఎలా వినియోగించాలి విభాగం సందర్శించండి.
మీ డేటాను ప్రాసెస్ చేస్తున్నప్పుడు నిర్దిష్ట సందర్భాల్లో మేము ఆధారపడే ఇతర చట్టపరమైన ప్రాతిపదికలు దిగువన పేర్కొనబడ్డాయి:
మీ సమ్మతి
మీ డేటాను ప్రాసెస్ చేయడానికి మీరు మాకు సమ్మతి తెలియజేసినప్పుడు క్రింద వివరించిన ప్రయోజనాల కోసం మేము డేటాను ప్రాసెస్ చేస్తాము. మీ సమ్మతి మీద మేము ఆధారపడతాము:
మేము మీ డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము:
సమాచారం సేకరించడానికి మరియు ఉపయోగించడానికి మీరు ఎనేబుల్ చేసిన (మీ లొకేషన్, కెమెరా లేదా ఫోటోలకు యాక్సెస్ లాంటివి) డివైజ్-ఆధారిత సెట్టింగ్‌లు ద్వారా స్వీకరించడానికి మీరు మమ్మల్ని అనుమతించారు, కాబట్టి, మీరు సెట్టింగ్‌లు ఎనేబుల్ చేసినప్పుడు వివరించిన సేవలను మేము అందించగలము; ఉదాహరణకు, మీరు మీ లొకేషన్‌ను మీ కాంటాక్ట్‌లతో షేర్ చేయడానికి మీరు మా లొకేషన్ ఫీచర్లు ఉపయోగిస్తున్న పక్షంలో లేదా ఫోటోగ్రాఫ్‌లు లేదా మీడియాను మీ కాంటాక్ట్‌లతో షేర్ చేసుకోవడానికి మీ కెమెరా లేదా ఫోటో గ్యాలరీని యాక్సెస్ చేస్తున్న పక్షంలో మీ డివైజ్ యొక్క ఖచ్చితమైన లొకేషన్ సమాచారం షేర్ చేయడం.
- ఉపయోగించిన డేటా వర్గాలు: ఈ ప్రయోజనం కోసం మేము డివైజ్ సమాచారం (మీ లొకేషన్, ఫోటోలు మరియు మీడియా వంటి డివైజ్ నుండి డేటా) ఉపయోగిస్తాము.
*మీ సమ్మతి ఆధారంగా మేము డేటాను ప్రాసెస్ చేసినప్పుడు, సమ్మతి ఉపసంహరించుకోవడానికి ముందు అలాంటి సమ్మతి ఆధారంగా ప్రాసెసింగ్ చట్టబద్ధతను ప్రభావితం చేయకుండా మీ సమ్మతిని ఎప్పుడైనా ఉపసంహరించుకునే హక్కు మీకు ఉంది. మీ సమ్మతి ఆధారంగా మేము మీ డేటాను ప్రాసెస్ చేస్తున్నప్పుడు, మీరు అందించిన డేటాను దిగుమతి చేసుకునే హక్కు కూడా మీకు ఉంది. మీ హక్కులు వినియోగించుకోవడానికి, మీ ఇన్-యాప్ లొకేషన్ కంట్రోల్ మరియు గోప్యతా విధానంలోని "మీరు మీ హక్కులను ఎలా ఉపయోగించాలి" విభాగం లాంటి మీ డివైజ్-ఆధారిత సెట్టింగ్‌లు, మీ యాప్-ఆధారిత సెట్టింగ్‌లు సందర్శించండి. *
చట్టబద్ధమైన బాధ్యతతో కూడిన సమ్మతి
మేము మీ డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము:
ఉదాహరణకు, ఏదైనా దర్యాప్తుకు సంబంధించి మీ పేరు, ప్రొఫైల్ చిత్రం లేదా IP చిరునామా లాంటి డేటా అందించాలంటూ చట్ట పరిరక్షణ అధికారుల నుండి ఆదేశం లాంటి ఒక చెల్లుబాటు అయ్యే చట్టబద్ద అభ్యర్థనతో సహా, చట్టబద్ధమైన బాధ్యతకు మేము అనుగుణంగా వ్యవహరించినప్పుడు డేటా ప్రాసెసింగ్ కోసం. ఆ చట్టపరమైన బాధ్యతకు అనుగుణంగా మేము డేటా బహిర్గతం చేస్తాము.
- ఉపయోగించిన డేటా వర్గాలు: ఈ ప్రాసెసింగ్ కోసం మేము ఉపయోగించే సమాచారం అనేది పరిస్థితుల మీద ఆధారపడి భిన్నంగా ఉన్నప్పటికీ, అది సాధారణంగా ఈ గోప్యతా విధానంలోని "మీరు అందించే సమాచారం" మరియు "ఆటోమేటిక్‌గా సేకరించిన సమాచారం" విభాగాల్లో వివరించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది.
మీకు సంబంధించిన లేదా ఇతర వ్యక్తికి సంబంధించిన కీలక ప్రయోజనాల రక్షణ
మేము మీ డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము:
మీ యొక్క లేదా మరొక వ్యక్తి యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు రక్షించడం కోసం డేటాను ప్రాసెస్ చేయడానికి. ఈ ప్రాసెసింగ్ కోసం మేము ఆధారపడే కీలక ప్రయోజనాల్లో మీ లేదా ఇతరుల జీవితం, భౌతిక సమగ్రత లేదా భద్రత భాగంగా ఉంటాయి మరియు ఉదాహరణకు, హానికర ప్రవర్తనకు సంబంధించిన నివేదికల మీద మేము దర్యాప్తు చేయడం లేదా ఎవరికైనా సహాయం అవసరం కావడంతో సహా, హానికర ప్రవర్తనతో పోరాడడానికి మరియు సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి మేము దీని మీద ఆధారపడుతాము. అభ్యర్థించబడడం మరియు ఒక వ్యక్తి జీవితం లేదా భద్రతను రక్షించాల్సిన అత్యవసర స్థితిలో, ఉదాహరణకు, దాడి లేదా ఒక వ్యక్తి భద్రత ప్రమాదంలో పడడం లాంటి తక్షణ హానికర ప్రవర్తనా ప్రమాదం లాంటి అత్యవసర సందర్భంలో చట్ట పరిరక్షణ అధికారులకు డేటా అందించడం ద్వారా సురక్షత, భద్రత, మరియు సమగ్రతను ప్రోత్సాహించడం ఇందులో భాగం కావచ్చు.
- ఉపయోగించిన డేటా వర్గాలు: ఈ ప్రాసెసింగ్ కోసం మేము ఉపయోగించే సమాచారం అనేది పరిస్థితుల మీద ఆధారపడి భిన్నంగా ఉన్నప్పటికీ, అది సాధారణంగా ఈ గోప్యతా విధానంలోని "మీరు అందించే సమాచారం" మరియు "ఆటోమేటిక్‌గా సేకరించిన సమాచారం" విభాగాల్లో వివరించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది.
చట్టబద్ధ ప్రయోజనాలు
మీ ఆసక్తులు లేదా ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛలను ("చట్టబద్ధమైన ప్రయోజనాలు") మూడవ పక్షం అధిగమించనప్పుడు మా చట్టబద్ధమైన ప్రయోజనాలు లేదా మూడవ పక్షం చట్టబద్ధమైన ప్రయోజనాల మీద మేము ఆధారపడతాము:
మేము మీ డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము:
కంట్రోలర్‌గా మేము డేటాను ప్రాసెస్ చేస్తున్నప్పుడు కొలతలు, విశ్లేషణలు మరియు ఇతర బిజినెస్ సేవలు అందించడం కోసం
- చట్టబద్ధమైన ప్రయోజనాలు వీటిపై ఆధారపడి ఉంటాయి:
- బిజినెస్‌లు మరియు ఇతర భాగస్వాములకు ఖచ్చితమైన మరియు విశ్వసనీయ సమగ్ర నివేదిక అందించడానికి, పనితీరు మీద ఖచ్చితమైన ధర మరియు గణాంకాలు నిర్ధారించడానికి మరియు మా సేవలు ఉపయోగించి మా భాగస్వాములు గ్రహించే విలువను ప్రదర్శించడానికి; మరియు
- బిజినెస్‌లు మరియు ఇతర భాగస్వాములు వారి వినియోగదారులను అర్థం చేసుకోవడం మరియు వారి వ్యాపారాలు మెరుగుపరచుకోవడం మరియు మా ధర నమూనాలు ధృవీకరించడం మరియు వారి సేవలు మరియు మెసేజ్‌ల ప్రభావం మరియు పంపిణీ అంచనా వేయడం మరియు మా సేవల ద్వారా ప్రజలు వారితో ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడే ప్రయోజనార్థం.
- ఉపయోగించిన డేటా వర్గాలు: "మీరు అందించే సమాచారం," "ఆటోమేటిక్‌గా సేకరించే సమాచారం" మరియు ఈ ప్రయోజనాల కోసం గోప్యతా విధానంలోని "మూడవ-పక్షం సమాచారం" విభాగాల్లో వివరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము.
మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్లు అందించడం కోసం.
చట్ట పరిరక్షణ అధికారులతో సహా ఇతరులతో సమాచారం షేర్ చేయడానికి మరియు చట్టపరమైన అభ్యర్థనలకు ప్రతిస్పందించడానికి. మరింత సమాచారం కోసం చట్టం మరియు రక్షణ కింద మా గోప్యతా విధానం చూడండి.
- చట్టబద్ధమైన ప్రయోజనాలు వీటిపై ఆధారపడి ఉంటాయి:
- మోసం, Facebook కంపెనీ ఉత్పత్తులను అనధికారికంగా వినియోగించడం, మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘనలు లేదా ఇతర హానికర లేదా చట్టవిరుద్ధ కార్యకలాపం నిరోధించడానికి మరియు పరిష్కరించడానికి.
- మమ్మల్ని మేము (మా హక్కులు, ఆస్తి లేదా ఉత్పత్తులతో సహా), మా వినియోగదారులు లేదా ఇతరులు, పరిశోధనలు లేదా నియంత్రణా విచారణలలో భాగంతో సహా రక్షించుకోవడానికి; లేదా మరణం లేదా సంభవించగల శారీరక హాని నిరోధించడానికి.
- ఉపయోగించిన డేటా వర్గాలు: ఈ ప్రయోజనం కోసం ఈ గోప్యత విధానానికి సంబంధించిన "మీరు అందించే సమాచారం," "ఆటోమేటిక్‌గా సేకరించే సమాచారం" మరియు "మూడవ-పక్షం సమాచారం" విభాగాల్లో వివరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము.
సురక్షత మరియు భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడం కోసం Facebook కంపెనీలతో సమాచారం పంచుకోవడానికి. మరింత సమాచారం కోసం "మేము ఇతర Facebook కంపెనీలతో ఎలా పని చేస్తాము" కూడా చూడండి.
అలాంటి ప్రాసెసింగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడానికి మరియు నియంత్రణ కోరడానికి మీకు హక్కు ఉంది; మీ హక్కుల వినియోగం కోసం, గోప్యతా విధానంలో "మీరు మీ హక్కులను ఎలా వినియోగించుకోవాలి" విభాగం సందర్శించండి
ప్రజా ప్రయోజనంలో భాగంగా చేపట్టే విధులు
మేము మీ డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము:
"సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము" విభాగం క్రింద మరింత వివరంగా వివరించిన ప్రకారం, పరిశోధన చేపట్టడం మరియు సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడం కోసం, వర్తించే చట్టం (ఉదా. యూరోపియన్ యూనియన్ చట్టంలో) మరింతగా నిర్దేశించిన ప్రకారం, ప్రజా ప్రయోజనంలో ఇది తప్పనిసరి.
మేము ఈ ప్రాతిపదికన ప్రాసెసింగ్ చేపట్టినప్పుడు, తగిన విధంగా మేము పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడతాము.
ప్రజా ప్రయోజనంలో భాగంగా ఒక పని కోసం మేము మీ డేటాను ప్రాసెస్ చేయవలసిన అవసరం ఏర్పడితే, మీకు అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు మరియు మా ప్రాసెసింగ్‌పై నియంత్రణను కోరే హక్కు ఉంటుంది. మీ హక్కుల వినియోగం కోసం, గోప్యతా విధానంలోని "మీరు మీ హక్కులను ఎలా వినియోగిస్తారు" విభాగానికి వెళ్లండి.
మళ్లీ పైకి
మీరు మీ హక్కులను ఎలా వినియోగించుకుంటారు
వర్తించే డేటా రక్షణ చట్టం క్రింద, మీ సమాచారాన్ని నిర్దిష్ట రీతిలో ప్రాసెసింగ్ చేయడం నుండి పరిమితం చేయడం మరియు అభ్యంతరం తెలియజేయడంతో సహా, మీ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, సరిదిద్దడం, దిగుమతి చేసుకోవడం మరియు తొలగించడం చేయడానికి మీకు హక్కు ఉంది.
ప్రత్యక్ష మార్కెటింగ్ కోసం మీ సమాచారాన్ని మేము ప్రాసెస్ చేయడాన్ని అభ్యంతరం తెలియజేసే హక్కు మరియు ప్రజా ప్రయోజనం పేరుతో మేము ఏదైనా పని చేస్తున్నప్పుడు అందులో భాగంగా మీ సమాచార ప్రాసెసింగ్‌ను అభ్యంతరం తెలియజేసే హక్కు లేదా మా చట్టబద్ధ ప్రయోజనాలు లేదా మూడవ పక్షానికి చెందిన అవే ప్రయోజనాలను వెంబడించడాన్ని ఇది కలిగి ఉంటుంది. అభ్యంతరాన్ని మదింపు చేస్తున్నప్పుడు మేము అనేక అంశాలు పరిగణిస్తాము, వాటిలో ఇవి కూడా భాగంగా ఉంటాయి; మా యూజర్ల సముచిత అంచనాలు; మీకు, మాకు, ఇతర యూజర్లు, మూడవ పక్షాల వినియోగదారుల ప్రయోజనాలు మరియు ప్రమాదాలు; మరియు తక్కువ హానికరం కాగల మరియు అసమాన ప్రయత్నం అవసరం లేని అదే ప్రయోజనం సాధించడంలో అందుబాటులోని మార్గాలు. ప్రాసెసింగ్ అనేది చట్టబద్ధ ఆధారాల మీద ఆధారపడి ఉండడం లేదా చట్టబద్ధ కారణాలతో అది అవసరమైతే తప్ప, మీ అభ్యంతరం నిలిపివేయబడుతుంది మరియు మేము మీ సమాచారం ప్రాసెస్ చేయకుండా నిలిపివేస్తాము.
మీరు ఇక్కడికి వెళ్లడం ద్వారా, మీ సమాచారాన్ని మేము ప్రాసెసింగ్ చేయడానికి అభ్యంతరం చెప్పవచ్చు మరియు మీ సమాచారాన్ని మేము ఉపయోగించే విధానాన్ని పరిమితం చేసే మీ ఎంపికల గురించి మరింత తెలుసుకోవచ్చు. ప్రత్యక్ష మార్కెటింగ్ కోసం మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తున్న చోట, అలాంటి కమ్యూనికేషన్లలోని అన్‌సబ్‌స్క్రయిబ్ లింక్ ఉపయోగించి లేదా మా ఇన్-యాప్ "బ్లాక్" ఫీచర్ ఉపయోగించడం ద్వారా, భవిష్యత్ ప్రత్యక్ష మార్కెటింగ్ మెసేజ్‌లకు మీరు ఎల్లప్పుడూ అభ్యంతరం చెప్పవచ్చు మరియు ఎంచుకోవచ్చు.
మా ఇన్-యాప్ అభ్యర్థనా అకౌంట్ సమాచార ఫీచర్ (సెట్టింగ్‌లు > అకౌంట్ కింద అందుబాటులో ఉంటుంది) ఉపయోగించి మీరు మీ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు. "మీ సమాచార నిర్వహణ మరియు నిలిపి ఉంచుకోవడం" విభాగంలో వివరించిన విధంగా, ఇన్-యాప్‌లో నేరుగా మీ సమాచారాన్ని సరిదిద్దడం, అప్డేట్ చేయడం మరియు తొలగించడం కోసం మీరు టూల్స్ యాక్సెస్ చేయవచ్చు.
మీరు మాకు అందించిన డేటాను మీ సమ్మతి ఆధారంగా మేము ప్రాసెస్ చేసినప్పుడు, సమ్మతి ఉపసంహరించుకోవడానికి ముందు సమ్మతి ఆధారంగా ప్రాసెసింగ్ చట్టబద్ధతను ప్రభావితం చేయకుండా మీ సమ్మతిని ఎప్పుడైనా ఉపసంహరించుకునే హక్కు మీకు ఉంది. మీ సమ్మతిని ఉపసంహరించుకోవడానికి, మీ డివైజ్-ఆధారిత లేదా ఇన్-యాప్ సెట్టింగ్‌లు సందర్శించండి.
WhatsApp ప్రధాన పర్యవేక్షణాధికారం అయిన ఐరిష్ డేటా సంరక్షణ విభాగ కమీషన్ లేదా ఏదైనా ఇతర సమర్థ డేటా రక్షణ పర్యవేక్షణ అధికారం ముందు ఫిర్యాదు చేసే హక్కు మీకు ఉంటుంది.
మళ్లీ పైకి
మీ సమాచార నిర్వహణ మరియు నిలిపి ఉంచుకోవడం
మా సేవలు అందించడం లేదా చట్టబద్ధ బాధ్యతలను అనుసరించడం, మా నిబంధనలను అమలు చేయడం మరియు ఉల్లంఘనలను నిరోధించడం లేదా మా హక్కులు, ఆస్తి మరియు యూజర్లను రక్షించుకోవడం మరియు కాపాడుకోవడంతో సహా, ఈ గోప్యతా విధానంలో గుర్తించబడిన ప్రయోజనాల కోసం, అవసరమైనంత కాలం మేము సమాచారాన్ని నిల్వ చేస్తాము. నిల్వ వ్యవధులనేవి సమాచార స్వభావం, అది ఎందుకు సేకరించబడింది మరియు ప్రాసెస్ చేయబడుతోంది, సంబంధిత చట్టబద్ధ లేదా నిర్వాహక నిలుపుదల అవసరాలు మరియు చట్టబద్ధ అభ్యంతరాల వంటి కారకాల మీద ఆధారపడే కేస్-బై-కేస్ ప్రకారం నిర్ణయించబడతాయి.
చట్టపరమైన బాధ్యతలు మరియు సమస్యలు. ఉదాహరణకు, డేటాను నిలుపుకోవడం కోసం మేము చట్టబద్ధమైన బాధ్యత కలిగి ఉన్నప్పుడు, మా నిబంధనల అమలు మరియు ఉల్లంఘనల నిరోధానికి లేదా హక్కులు, ఆస్తి మరియు యూజర్లను రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడడం లాంటి చట్టపరమైన కారణాల కోసం కూడా మేము మీ సమాచారాన్ని నిలిపి ఉంచుతాము. మా "చట్టం, మా హక్కులు మరియు రక్షణ" విభాగంలో దీని గురించిన మరింత సమాచారం అందించబడింది.
కార్యాచరణ నిలుపుదల అవసరాలు. ఉదాహరణకు, మా సేవలు అందించే సమయంలో (పైన పేర్కొన్న పరిమిత పరిస్థితులలో తప్ప) మేము మీ మెసేజ్‌లను నిలిపి ఉంచుకోము కాబట్టి, మీ మెసేజ్‌లు డెలివరీ కాగానే అవి మా సర్వర్ల నుండి తొలగించబడతాయి. అయినప్పటికీ, ఎగువ పేర్కొన్న విధంగా ఏదైనా మెసేజ్‌ను తక్షణం డెలివరీ చేయలేని పక్షంలో, దానిని డెలివరీ చేసే ప్రయత్నంలో భాగంగా మేము దానిని 30 రోజుల వరకు మా సర్వర్లలో ఎన్‌క్రిప్ట్ చేయబడిన రూపంలో నిల్వ చేస్తాము, ఆ తర్వాత అది తొలగించబడుతుంది.
మెసేజింగ్ మెటాడేటా తొలగింపు. కమ్యూనికేషన్ ప్రసారానికి, మా సేవల నిర్వహణకి, మా సేవల సురక్షత మరియు భద్రతకు భరోసా అందించడానికి, బిల్లింగ్ కోసం (వర్తించే చోట) లేదా వర్తించే చట్టం కింద చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించడానికి మెసేజింగ్ మెటాడేటా తొలగించబడుతుంది లేదా అనామకం చేయబడుతుంది.
మీరు మీ సమాచారాన్ని నిర్వహించడం, మార్చడం, పరిమితం చేయడం లేదా తొలగించడం చేయాలనుకుంటే, మీరు క్రింది సాధనాల ద్వారా వాటిని చేయవచ్చు:
- సేవల సెట్టింగ్‌లు. మీరు ఇతర వినియోగదారులకు అందుబాటులోని నిర్దిష్ట సమాచారాన్ని నిర్వహించడానికి మీ సేవల సెట్టింగ్‌లను మార్చవచ్చు. మా సేవల ద్వారా మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలో నిర్వహించడానికి మీరు మీ కాంటాక్ట్‌లు, గ్రూప్‌లు మరియు బ్రాడ్‌క్యాస్ట్ లిస్ట్‌లు నిర్వహించవచ్చు లేదా మా "బ్లాక్" ఫీచర్ ఉపయోగించవచ్చు.
- మీ మొబైల్ ఫోన్ నంబర్, ప్రొఫైల్ పేరు మరియు చిత్రం మరియు "పరిచయం" సమాచారం మార్చడం. మీరు మీ మొబైల్ ఫోన్ నంబర్ మార్చితే, మీరు తప్పనిసరిగా మా ఇన్-యాప్ నంబర్ మార్పు ఫీచర్ ఉపయోగించి దీనిని అప్డేట్ చేయాలి మరియు మీ అకౌంట్‌ను మీ కొత్త మొబైల్ ఫోన్ నంబర్‌కు బదిలీ చేయాలి. మీరు ఎప్పుడైనా మీ ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ చిత్రం మరియు "పరిచయం" సమాచారం కూడా మార్చవచ్చు.
- మీ WhatsApp ఖాతాను తొలగించడం. మీరు మా ఇన్-యాప్ డిలీట్ మై అకౌంట్ ఫీచర్ ఉపయోగించి ఏ సమయంలోనైనా మీరు మీ WhatsApp అకౌంట్ తొలగించవచ్చు. మీరు మీ అకౌంట్ కోసం తొలగింపు ప్రక్రియ ప్రారంభిస్తే, ఇకపై ఆ అకౌంట్‌ను ఉపయోగించలేరు (అంటే, మీరు లాగ్-ఇన్ లేదా మళ్లీ-రిజిస్టర్ చేయడం చేయలేరు).
మీరు మీ అకౌంట్ తొలగించినప్పుడు మీ సమాచారానికి ఏం జరుగుతుంది?
మీరు మీ WhatsApp అకౌంట్ తొలగించినప్పుడు, పరిమిత పరిస్థితులలో మేము నిలిపి ఉంచుకున్న దిగువ జాబితా చేయబడిన సమాచారం మాత్రమే కాకుండా, మీ గురించి మా వద్ద ఉన్న సమాచారం కూడా మేము తొలగిస్తాము.
తొలగించిన సమాచారం. డెలివరీ చేయబడని మీ మెసేజ్‌లు, మీ అకౌంట్ సమాచారం మరియు ప్రొఫైల్ ఫోటో మా సర్వర్ల నుండి తొలగించబడతాయి. అన్ని WhatsApp గ్రూప్‌ల నుండి మీరు తొలగించబడతారు. మీ WhatsApp సమాచారం తొలగించడానికి తొలగింపు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి 90 రోజులు పడుతుందని గుర్తుంచుకోండి. విపత్తు, సాఫ్ట్వేర్ లోపం లేదా ఇతర డేటా నష్టం లాంటి సందర్భాల్లో కోల్పోయిన డేటాను తిరిగి పొందడం కోసం మేము ఉపయోగించే బ్యాకప్ నిల్వలో 90 రోజుల తర్వాత కూడా పరిమిత సమయం వరకు మీ సమాచార కాపీలు నిల్వ ఉండవచ్చు.
మేము నిలిపి ఉంచుకునే సమాచారం
- కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో, మా సేవల భద్రతను నిర్వహించడానికి, ఒక భద్రతా సంఘటన లేదా దుర్బలత్వాన్ని విశ్లేషించడానికి/దర్యాప్తు చేయడానికి మేము సాధారణ నిలుపుదల వ్యవధిని సమీక్షిస్తున్న కొన్ని లాగ్లను నిలిపి ఉంచుకోవాలి.
- నిర్దిష్ట లాగ్ రికార్డుల వంటి కొన్ని మెటీరియల్ కాపీలు మా డేటాబేస్‌లో అలాగే ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఐడెంటిఫైయర్ల నుండి అవి వేరు చేయబడతాయి మరియు మీ అకౌంట్‌కు లింక్ చేయబడవు. మీ అకౌంట్ నుండి ఈ డేటాను వేరు చేయడానికి, యూజర్ ఐడెంటిఫైయర్‌ను మేము యాదృచ్ఛికంగా ఉత్పత్తి చేయబడే రీప్లేస్‌మెంట్‌తో భర్తీ చేయడం వల్ల అది మీ అకౌంట్‌కు తిరిగి లింక్ చేయబడదు.
- డేటాను నిలుపుకోవడం కోసం మేము చట్టబద్ధమైన బాధ్యత కలిగి ఉన్నప్పుడు, మా నిబంధనల అమలు మరియు ఉల్లంఘనల నిరోధానికి లేదా మా హక్కులు, ఆస్తి మరియు యూజర్లను రక్షించుకోవాల్సినప్పుడు కూడా నిర్దిష్ట సమాచారం కాపీలను నిలిపి ఉంచే అవకాశం ఉంది. మా "చట్టం, మా హక్కులు మరియు రక్షణ" విభాగంలో దీని గురించిన మరింత సమాచారం అందించబడింది.
మా ఇన్-యాప్ డిలీట్ మై అకౌంట్ ఫీచర్ ఉపయోగించకుండా మీ డివైజ్ నుండి మాత్రమే మీరు WhatsApp యాప్ తొలగిస్తే, మీ సమాచారం మా వద్ద దీర్ఘకాలం పాటు నిల్వ చేయబడుతుంది. మీరు మీ అకౌంట్‌ను తొలగించినప్పుడు, గ్రూప్‌లకు సంబంధించి మీరు రూపొందించిన మీ సమాచారాన్ని లేదా మీకు సంబంధించి ఇతర వినియోగదారులు కలిగి ఉన్న సమాచారాన్ని, అంటే, మీరు వారికి పంపిన మెసేజ్‌ల కాపీల వంటి వాటిని అది ప్రభావితం చేయదని గుర్తుంచుకోండి.
మా Android, iPhone, లేదా KaiOS సహాయ కేంద్రం కథనాలలో మా డేటా తొలగింపు మరియు నిలిపి ఉంచుకునే పద్ధతులు మరియు మీ అకౌంట్‌ను ఎలా తొలగించాలి గురించి మరింత తెలుసుకోవచ్చు.
మళ్లీ పైకి
చట్టం, మా హక్కులు మరియు రక్షణ
క్రింది అంశాల కోసం తప్పనిసరి అని మేము సంపూర్ణంగా విశ్వసించిన పక్షంలో, "మేము సేకరించే సమాచారం" విభాగంలో వివరించిన మీ సమాచారాన్ని డేటా ప్రాసెసింగ్ కోసం మా చట్టబద్ధ ఆధారాలకు అనుగుణంగా రెగ్యులేటర్లు, చట్ట పరిరక్షణ అధికారాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు మరియు ఇతరులతో పంచుకోవడంతో సహా, మేము యాక్సెస్ చేస్తాము, భద్రపరుస్తాము మరియు షేర్ చేస్తాము. అవి: (ఎ) వర్తించే చట్టం లేదా నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియ లేదా ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా స్పందించడం; (బి) సంభావ్య ఉల్లంఘనల పరిశోధనలతో సహా మా నిబంధనలు మరియు వర్తించే ఇతర నిబంధనలు మరియు విధానాలు అమలు చేయడం; (సి) మోసం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా భద్రత మరియు సాంకేతిక సమస్యలు గుర్తించడం, దర్యాప్తు చేయడం, నిరోధించడం, లేదా పరిష్కరించడం; లేదా (డి) మరణం లేదా తక్షణ శారీరక హాని నిరోధించడంతో సహా, మా యూజర్లు, WhatsApp, Facebook కంపెనీలు లేదా ఇతరుల హక్కులు, ఆస్తి, మరియు భద్రతను రక్షించడం.
"నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించడం", "చట్టబద్ధ ప్రయోజనాలు" మరియు "కీలక ప్రయోజనాలు" శీర్షికలతో సహా, "డేటా ప్రాసెసింగ్ కోసం మా చట్టబద్ధ ఆధారాలు" విభాగంలో పేర్కొన్న పరిస్థితుల మీద ఆధారపడి ప్రాసెసింగ్ చేపట్టడానికి మేము ఆధారపడే విభిన్న చట్టబద్ధ ఆధారాల మీద మరింత సమాచారం.
మళ్లీ పైకి
మా అంతర్జాతీయ కార్యకలాపాలు
WhatsApp సమాచారాన్నిఅంతర్జాతీయంగా షేర్ చేస్తుంది, Facebook కంపెనీల్లో అంతర్గతంగా మరియు మా భాగస్వాములతో మరియు ఈ గోప్యతా విధానం మరియు మా నిబంధనలకు అనుగుణంగా మీరు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేట్ చేసే వారితో బహిర్గతంగా షేర్ చేస్తుంది.
WhatsApp నియంత్రణలో ఉన్న లేదా వారు నిల్వ చేసిన లేదా ప్రాసెస్ చేసిన సమాచారం ఈ గోప్యతా విధానంలో వివరించిన కారణాల కోసం యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసించే ఇతర మూడవ దేశాలకు బదిలీ చేయబడుతుంది లేదా అందజేయబడుతుంది. WhatsApp యునైటెడ్ స్టేట్స్లో సహా Facebook అంతర్జాతీయ మౌలిక సదుపాయాలను మరియు డేటా కేంద్రాలను ఉపయోగిస్తుంది.
మా నిబంధనలులో పేర్కొన్న సేవలు మీకు అందించేలా మరియు మా సేవలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేలా మరియు మీకు అందించేలా మేము సిద్ధం కావడానికి ఈ బదిలీలు అవసరం మరియు తప్పనిసరి. మూడవ దేశాలకు బదిలీ కోసం, యూరోపియన్ కమీషన్ ఆమోదించిన ప్రామాణిక ఒప్పంద నిబంధనలను (ఇవి ఏమిటనే వివరణ కోసం ఇక్కడ చూడండి) మేము ఉపయోగించుకుంటాము, లేదా కొన్ని దేశాలకు సంబంధించి మూడవ దేశం, భూభాగం, లేదా ఆ మూడవ దేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్ధారించబడిన రంగాలు తగిన స్థాయిలో రక్షణ అందిస్తాయని, లేదా వర్తించిన ప్రకారం, వర్తించే డేటా సంరక్షణ చట్టం కింద అందించబడిన సమానమైన యంత్రాంగాలు ఉపయోగిస్తాయని యూరోపియన్ కమిషన్ గుర్తించినప్పుడు మేము యూరోపియన్ కమిషన్ వారి సంపూర్ణ నిర్ణయాలు మీద ఆధారపడతాము. యూరోపియన్ ఎకనామిక్ ప్రాంతం నుండి యునైటెడ్ స్టేట్స్కు డేటా బదిలీ కోసం, మేము ప్రామాణిక ఒప్పంద నిబంధనల మీద ఆధారపడతాము.
మళ్లీ పైకి
మా విధానానికి అప్డేట్లు
మేము మా గోప్యతా విధానానికి సవరణలు లేదా అప్డేట్ చేయవచ్చు. ఈ గోప్యతా విధానం సవరణలకు సంబంధించిన నోటీసును మీకు మేము తగిన విధంగా అందిస్తాము మరియు ఈ గోప్యతా విధానం పైభాగంలో "చివరిగా సవరించిన" తేదీని అప్డేట్ చేస్తాము. దయచేసి, కాలానుగుణంగా మా గోప్యతా విధానాన్ని సమీక్షించండి.
మళ్లీ పైకి
మమ్మల్ని సంప్రదించండి
WhatsApp డేటా రక్షణ అధికారిని ఇక్కడ సంప్రదించవచ్చు.
మా గోప్యతా విధానం గురించి మీకు ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి లేదా ఇక్కడ మాకు వ్రాయండి:
WhatsApp ఐర్లాండ్ లిమిటెడ్
గమనించండి: గోప్యతా విధానం
4 గ్రాండ్ కెనాల్ స్క్వేర్
గ్రాండ్ కెనాల్ హార్బర్
డబ్లిన్ 2
ఐర్లాండ్
మళ్లీ పైకి