కీలక అప్డేట్లు
చివరగా సవరించినది: జనవరి 04, 2021
మీ గోప్యతను గౌరవించడమనేది మా DNAలోనే భాగంగా ఉంది. మేము WhatsAppని ప్రారంభించినప్పటి నుంచి, దృఢమైన గోప్యతా సూత్రాలను మనసులో ఉంచుకునే మేము మా సేవలు రూపొందించాము. మా అప్డేట్ చేయబడిన సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానంలో మీరు వీటిని కనుగొనవచ్చు:
- మీ డేటాను మేము ఎలా నిర్వహిస్తాము అనే దానికి సంబంధించి అదనపు సమాచారం. మా అప్డేట్ చేయబడిన నిబంధనలు మరియు గోప్యతా విధానం అనేది మా ప్రాసెసింగ్ కోసం చట్టబద్ధ ఆధారం, మరియు గోప్యతకు మా నిబద్ధతతో సహా మీ డేటాను మేము ఎలా ప్రాసెస్ చేస్తామనే దానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తుంది.
- బిజినెస్లతో మెరుగైన కమ్యూనికేషన్. చాలా బిజినెస్లు తమ కస్టమర్లు మరియు క్లయింట్లతో కమ్యూనికేట్ చేయడానికి WhatsApp మీద ఆధారపడతాయి. WhatsAppలో మీతో వారి కమ్యూనికేషన్లను నిల్వ చేయడానికి మరియు చక్కగా నిర్వహించడానికి Facebook లేదా మూడవ పక్షాలను ఉపయోగించే బిజినెస్లతో మేము పని చేస్తాము.
మళ్లీ పైకి