కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp గోప్యతా విధానం

ప్రభావిత 4 జనవరి, 2021

ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లు

మీరు యూరోపియన్ ప్రాంతంలో నివసిస్తుంటే, ఈ సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానం కింద WhatsApp ఐర్లాండ్ లిమిటెడ్ మీకు సేవలు అందిస్తుంది.

మీరు యుకెలో నివసిస్తుంటే, ఈ సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానాలకు లోబడి WhatsApp LLC మీకు సేవలను అందిస్తుంది.

WhatsApp చట్టపరమైన సమాచారం

మీరు యూరోపియన్ ప్రాంతం లేదా UK వెలుపల నివసిస్తుంటే, ఈ సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానం కింద మా సేవలను WhatsApp LLC ("WhatsApp," "మా," "మేము," లేదా "మాకు") మీకు అందిస్తుంది.

మా సేవలు అందించడానికి మేము ప్రాసెస్ చేసే సమాచారంతో సహా, మా డేటా పద్ధతులను వివరించడంలో మా గోప్యతా విధానం ("గోప్యతా విధానం") సహాయపడుతుంది.

ఉదాహరణకు, మేము ఏ సమాచారం సేకరిస్తాము మరియు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి మా గోప్యతా విధానం వివరిస్తుంది. డెలివరీ చేయబడిన మెసేజ్‌లను మేము నిల్వ చేయని విధంగా మరియు మా సేవలతో మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలనే దానిమీద నియంత్రణను మీకే ఇచ్చే విధంగా మా సేవలను రూపొందించడం వంటి మీ గోప్యతను రక్షించడానికి మేము తీసుకునే చర్యలు గురించి కూడా ఇది వివరిస్తుంది.

Meta కంపెనీలలో మేము కూడా ఒకటిగా ఉన్నాము. ఈ కంపెనీల కుటుంబంలో మేము సమాచారాన్ని షేర్ చేసుకునే మార్గాల గురించి ఈ గోప్యతా విధానం కింద మీరు మరింత తెలుసుకోవచ్చు.

ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప, ఈ గోప్యతా విధానం మా అన్ని సేవలకు వర్తిస్తుంది.

మీరు ఉపయోగించే మరియు మేము అందించే మా సేవలకు సంబంధించిన నిబంధనల గురించి వివరించే WhatsApp సేవా నిబంధనలు ("నిబంధనలు") కూడా దయచేసి చదవండి.

తిరిగి పైకి వెళ్లు

ముఖ్యమైన అప్‌డేట్‌లు

మీ గోప్యతను గౌరవించడమనేది మా DNAలోనే భాగంగా ఉంది. మేము WhatsAppని ప్రారంభించినప్పటి నుంచి, దృఢమైన గోప్యతా సూత్రాలను మనసులో ఉంచుకునే మేము మా సేవలు రూపొందించాము. మా అప్‌డేట్ చేయబడిన సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానంలో మీరు వీటిని కనుగొనవచ్చు:

  • మీ డేటాను మేము ఎలా నిర్వహిస్తాము అనే దానికి సంబంధించి అదనపు సమాచారం. మా అప్‌డేట్ చేయబడిన నిబంధనలు మరియు గోప్యతా విధానం అనేవి మీ డేటాను మేము ఎలా ప్రాసెస్ చేస్తాము, మరియు గోప్యతకు మా నిబద్ధత గురించి మరింత సమాచారం అందిస్తాయి. ఉదాహరణకు, ఇటీవలి ఉత్పత్తి ఫీచర్‌లు మరియు కార్యాచరణల గురించి, సురక్షత, భద్రత మరియు సమగ్రత కోసం మీ డేటాను మేము ఎలా ప్రాసెస్ చేస్తామనే దాని గురించి మేము మరింత సమాచారం జోడించాము, మరియు వినియోగదారు సెట్టింగ్‌లు, సహాయ కేంద్రం కథనాలు మరియు మీ సమాచారాన్ని మీరు ఎలా నిర్వహించవచ్చు అనే అంశాలకు మరిన్ని డైరెక్ట్ లింక్‌లను జోడించాము.
  • బిజినెస్‌లతో మెరుగైన కమ్యూనికేషన్. చాలా బిజినెస్‌లు తమ కస్టమర్‌లు మరియు క్లయింట్‌లతో కమ్యూనికేట్ చేయడానికి WhatsApp మీద ఆధారపడతాయి. WhatsAppలో మీతో వారి కమ్యూనికేషన్‌లను నిల్వ చేయడానికి మరియు చక్కగా నిర్వహించడానికి Meta లేదా మూడవ పక్షాలను ఉపయోగించే బిజినెస్‌లతో మేము పని చేస్తాము.
  • కనెక్ట్ చేయడాన్ని సులభతరం చేయడం. Meta కంపెనీలలో భాగంగా, Meta కుటుంబ యాప్‌లు మరియు ఉత్పత్తులతో అనుభవాలు మరియు ఏకీకరణలు ఆఫర్ చేయడానికి Metaతో WhatsApp భాగస్వామ్యం వహిస్తుంది.

తిరిగి పైకి వెళ్లు

మేము సేకరించే సమాచారం

మా సేవలను మీరు ఎప్పుడు ఇన్‌స్టాల్ చేయాలి, యాక్సెస్ చేయాలి లేదా ఉపయోగించాలనే వాటితో సహా మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడం కోసం WhatsApp తప్పనిసరిగా కొంత సమాచారాన్ని స్వీకరించాలి లేదా సేకరించాలి.

మేము ఏ రకమైన సమాచారం సేకరిస్తామనేది మీరు మా ఉత్పత్తులను ఎలా వినియోగిస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మా సేవలు అందించడానికి మాకు కొంత సమాచారం అవసరం. ఇది లేకపోతే మా సేవలను మీకు అందించలేము. ఉదాహరణకు, మా సేవలు ఉపయోగించడం కోసం అకౌంట్ రూపొందించడానికి మీరు మీ మొబైల్ ఫోన్ నంబర్‌ తప్పక అందించాలి.

మా సేవల్లో ఎంపిక చేసుకోగల ఫీచర్‌లు ఉన్నాయి, వాటిని మీరు ఉపయోగించిన పక్షంలో, అలాంటి ఫీచర్‌లు అందించడానికి మేము అదనపు సమాచారం సేకరించాల్సి ఉంటుంది. అలాంటి సేకరణల గురించి తగిన విధంగా మీకు తెలియజేయబడుతుంది. ఏదైనా ఫీచర్ ఉపయోగించడానికి అవసరమైన సమాచారం అందించకూడదని మీరు ఎంచుకుంటే, మీరు ఆ ఫీచర్ ఉపయోగించలేరు. ఉదాహరణకు, మీ డివైజ్‌ నుండి మీ లొకేషన్‌ డేటా సేకరించడానికి మీరు మాకు అనుమతి ఇవ్వకపోతే, మీ లొకేషన్‌ను మీ కాంటాక్ట్‌లకు షేర్ చేయలేరు. Android మరియు iOS డివైజ్‌లు రెండింటిలో మీ సెట్టింగ్‌ల మెను ద్వారా అనుమతులను నిర్వహించవచ్చు.

మీరు అందించే సమాచారం

  • మీ అకౌంట్ సమాచారం. WhatsApp అకౌంట్ రూపొందించడానికి మీ మొబైల్ ఫోన్ నంబర్ మరియు ప్రాథమిక సమాచారం (మీకు నచ్చిన ప్రొఫైల్ పేరుతో సహా) మీరు తప్పక అందించాలి. ఈ సమాచారాన్ని మీరు మాకు అందించని పక్షంలో, మా సేవలు ఉపయోగించడం కోసం మీరు అకౌంట్‌ను రూపొందించలేరు. మీరు మీ అకౌంట్‌కు ప్రొఫైల్ చిత్రం మరియు "గురించి" సమాచారం లాంటి ఇతర సమాచారం జోడించవచ్చు.
  • మీ మెసేజ్‌లు. మీకు మా సేవలు అందించే సాధారణ క్రమంలో మేము మీ మెసేజ్‌లను నిల్వ చేసి, ఉంచుకోము. బదులుగా, మీ మెసేజ్‌లు మీ డివైజ్‌లోనే నిల్వ చేయబడతాయి. సాధారణంగా ఇవి మా సర్వర్‌లలో నిల్వ చేయబడవు. మీ మెసేజ్‌లను డెలివరీ చేయగానే, అవి మా సర్వర్‌ల నుండి తొలగించబడతాయి. మీ మెసేజ్‌లను డెలివరీ చేసే క్రమంలో మేము వాటిని నిల్వ చేసే అవకాశం ఉన్న పరిస్థితులను ఈ క్రింది సందర్భాలు వివరిస్తాయి:
    • డెలివరీ చేయబడని మెసేజ్‌లు. ఏదైనా మెసేజ్ తక్షణం డెలివరీ చేయలేని పక్షంలో (ఉదాహరణకు, స్వీకరించాల్సిన వారు ఆఫ్‌లైన్‌లో ఉంటే), దానిని డెలివరీ చేసే ప్రయత్నంలో భాగంగా మేము దానిని 30 రోజుల వరకు మా సర్వర్‌లలో ఎన్‌క్రిప్ట్ చేయబడిన రూపంలో నిల్వ చేస్తాము. ఏదైనా మెసేజ్ 30 రోజుల తర్వాత కూడా డెలివరీ కాని పక్షంలో, మేము దానిని తొలగిస్తాము.
    • మీడియాను ఫార్వార్డ్ చేయడం. వినియోగదారు మెసేజ్‌లో మీడియాను ఫార్వార్డ్ చేసినప్పుడు, అదనపు ఫార్వార్డ్‌లను మరింత సమర్థవంతంగా డెలివరీ చేయడంలో సహాయంగా మేము ఆ మీడియాను ఎన్‌క్రిప్ట్ చేసిన రూపంలో మా సర్వర్‌లలో తాత్కాలికంగా నిల్వ చేస్తాము.

      మేము మా సేవల కోసం సంపూర్ణ గుప్తీకరణను ఆఫర్ చేస్తాము. సంపూర్ణ గుప్తీకరణ అంటే, మీ మెసేజ్‌లను మేము మరియు మూడవ పక్షాలు చదవకుండా రక్షించే రీతిలో గుప్తీకరించబడతాయి. ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు WhatsApp ద్వారా బిజినెస్‌లు మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.
  • మీ కనెక్షన్‌లు. కాంటాక్ట్ అప్‌లోడ్ ఫీచర్‌ను మీరు ఉపయోగించవచ్చు మరియు వర్తించే చట్టాలు అనుమతించిన పక్షంలో, మా సేవల యూజర్‌లు మరియు మీ ఇతర కాంటాక్ట్‌లతో సహా, మీ అడ్రస్ బుక్‌లోని ఫోన్ నంబర్‌లను క్రమబద్ధంగా మాకు అందించవచ్చు. మీ పరిచయాలలోని ఎవరైనా ఇప్పటికీ మా సేవలు ఉపయోగించని పక్షంలో, ఆ కాంటాక్ట్‌లు మా ద్వారా గుర్తించబడలేవని నిర్ధారించే రీతిలో ఈ సమాచారాన్ని మీ కోసం మేము నిర్వహిస్తాము. మా కాంటాక్ట్ అప్‌లోడ్ ఫీచర్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి. మీరు గ్రూప్‌లు మరియు బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లు రూపొందించవచ్చు, వాటిలో చేరవచ్చు లేదా వాటికి జోడించబడవచ్చు మరియు అలాంటి గ్రూప్‌లు మరియు లిస్ట్‌లు మీ అకౌంట్ సమాచారంతో అనుబంధించబడతాయి. మీరు మీ గ్రూప్‌లకు పేరు పెట్టవచ్చు. మీరు గ్రూప్ ప్రొఫైల్ చిత్రం లేదా వివరణ చేర్చవచ్చు.
  • స్టేటస్ సమాచారం. మీ అకౌంట్‌కు స్టేటస్ జోడించాలనుకుంటే, దానిని మాకు అందించవచ్చు. Android, iPhone లేదా KaiOSలో స్టేటస్ ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి.
  • లావాదేవీలు మరియు చెల్లింపు డేటా. మీరు మా చెల్లింపుల సేవలు ఉపయోగిస్తుంటే లేదా కొనుగోళ్లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల కోసం ఉద్దేశించిన మా సేవలు ఉపయోగిస్తుంటే, చెల్లింపు అకౌంట్ మరియు లావాదేవీ సమాచారంతో సహా మీ గురించిన అదనపు సమాచారాన్ని మేము ప్రాసెస్ చేస్తాము. లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని (ఉదాహరణకు, మీ చెల్లింపు పద్ధతి, షిప్పింగ్ వివరాలు మరియు లావాదేవీ మొత్తం గురించిన సమాచారాన్ని) చెల్లింపు అకౌంట్ మరియు లావాదేవీ సమాచారం కలిగి ఉంటుంది. మీ దేశం లేదా భూభాగంలో అందుబాటులో ఉన్న మా చెల్లింపుల సేవలను మీరు ఉపయోగిస్తే, వర్తించే చెల్లింపుల గోప్యతా విధానంలో మా గోప్యతా పద్ధతులు వివరించబడతాయి.
  • కస్టమర్ సహాయం మరియు ఇతర కమ్యూనికేషన్‌లు. కస్టమర్ సహాయం కోసం లేదా మరో విధంగా మీరు మాతో కమ్యూనికేట్ చేసినప్పుడు, మీ మెసేజ్‌ల కాపీలు, మీకు సహాయపడగలదని మీరు భావించే ఇతర సమాచారం మరియు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి (ఉదా., ఇమెయిల్ చిరునామా) అనే వివరాలతో సహా మా సేవల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి రావచ్చు. ఉదాహరణకు, యాప్ పనితీరు లేదా ఇతర సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని మీరు మాకు ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

స్వయంచాలకంగా సేకరించబడే సమాచారం

  • వినియోగ మరియు లాగ్ సమాచారం. సేవ-సంబంధిత, విశ్లేషణాత్మక మరియు పనితీరు సమాచారం లాంటి మా సేవల్లో మీ కార్యకలాపం గురించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. మీ కార్యకలాపం గురించిన సమాచారం (మీరు మా సేవలను ఎలా ఉపయోగిస్తున్నారు, మీ సేవల సెట్టింగ్‌లు, మా సేవలు ఉపయోగించి ఇతరులతో మీరు ఎలా సంప్రదింపులు నిర్వహిస్తున్నారు (ఏదైనా బిజినెస్‌తో మీరెప్పుడు సంభాషించారనే దానితో సహా) మరియు మీ కార్యకలాపాలు మరియు ఇంటరాక్షన్ సమయం, తరచుదనం మరియు వ్యవధితో సహా), లాగ్ ఫైల్‌లు మరియు విశ్లేషణ, క్రాష్, వెబ్‌సైట్ మరియు పనితీరు లాగ్‌లు మరియు నివేదికలను ఇది కలిగి ఉంటుంది. మా సేవలు ఉపయోగించడం కోసం మీరెప్పుడు నమోదు చేసుకున్నారు; మా మెసేజింగ్, కాలింగ్, స్థితి, గ్రూప్‌లు (గ్రూప్ పేరు, గ్రూప్ చిత్రం, గ్రూప్ గురించిన వివరణతో సహా), చెల్లింపులు లేదా బిజినెస్ ఫీచర్‌ల వంటి మీరు ఉపయోగించే ఫీచర్‌లు; ప్రొఫైల్ ఫోటో "గురించి" సమాచారం; మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా, మీరు చివరిసారిగా మా సేవలను ఎప్పుడు ఉపయోగించారు (మీరు "చివరిగా చూసిన సమయం"); మరియు మీ "గురించి" సమాచారాన్ని మీరు చివరగా ఎప్పుడు అప్‌డేట్ చేశారు లాంటి సమాచారం కూడా ఇందులో ఉంటుంది.
  • డివైజ్ మరియు కనెక్షన్ సమాచారం. మీరు మా సేవలను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, యాక్సెస్ చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు డివైజ్ మరియు నిర్దిష్ట కనెక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఇందులో హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ సమాచారం, బ్యాటరీ స్థాయి, సిగ్నల్ బలం, యాప్ వెర్షన్, బ్రౌజర్ సమాచారం, మొబైల్ నెట్‌వర్క్, కనెక్షన్ సమాచారం (ఫోన్ నంబర్‌, మొబైల్ ఆపరేటర్ లేదా ISP సహా), భాష మరియు టైమ్ జోన్, IP చిరునామా, డివైజ్ చర్యల సమాచారం, మరియు ఐడెంటిఫైయర్‌లు (అదే డివైజ్ లేదా అకౌంట్‌తో అనుబంధించబడిన Meta కంపెనీ ఉత్పత్తులకు ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌లతో సహా) వంటి సమాచారం ఉంటుంది.
  • లొకేషన్ సమాచారం. మీరు మీ లొకేషన్‌ను మీ కాంటాక్ట్‌లతో పంచుకోవాలనుకోవడం లేదా సమీప లొకేషన్‌లు లేదా ఇతరులు మీతో పంచుకున్న లొకేషన్‌లను చూడాలనుకోవడం లాంటి లొకేషన్-సంబంధిత ఫీచర్‌లను ఉపయోగించడానికి ఎంచుకున్నప్పుడు, మేము మీ అనుమతితో మీ పరికరం నుండి ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని సేకరించి, ఉపయోగిస్తాము. మీ డివైజ్ సెట్టింగ్‌లలో లేదా ఇన్-యాప్ సెట్టింగ్‌లలో మీరు గుర్తించగల లొకేషన్ షేర్ లాంటి లొకేషన్-సంబంధిత సమాచారానికి సంబంధించిన కొన్ని సెట్టింగ్‌లు ఉన్నాయి. మీరు మా లొకేషన్-సంబంధిత ఫీచర్‌లు ఉపయోగించకపోయినప్పటికీ, మీ సర్వసాధారణ లొకేషన్ (ఉదా., నగరం మరియు దేశం) అంచనా కోసం మేము IP చిరునామాలు మరియు ఫోన్ నంబర్ ఏరియా కోడ్‌లు వంటి ఇతర సమాచారం ఉపయోగిస్తాము. డయాగ్నోస్టిక్‌లు మరియు ట్రబుల్‌షూటింగ్ ప్రయోజనాల కోసం కూడా మేము మీ లొకేషన్ సమాచారం ఉపయోగిస్తాము.
  • కుకీలు. వెబ్-ఆధారితమైన మా సేవలు అందించడం, మీ అనుభవాలు మెరుగుపరచడం, మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడం, మరియు వాటిని అనుకూలీకరించడం లాంటి వాటితో సహా మా సేవలను నిర్వహించడానికి మరియు అందించడానికి మేము కుకీలు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, వెబ్ మరియు డెస్క్‌టాప్ మరియు ఇతర వెబ్-ఆధారిత సేవలకు మా సేవలు అందించడానికి మేము కుకీలు ఉపయోగిస్తాము. మా సహాయ కేంద్ర కథనాల్లో ఏవి బాగా ప్రాచుర్యం పొందాయో అర్థం చేసుకోవడానికి మరియు మా సేవలకు సంబంధించిన కంటెంట్‌ను మీకు ప్రదర్శించడానికి కూడా మేము కుకీలు ఉపయోగించవచ్చు. వీటికి అదనంగా, మీకు ఒక సురక్షిత అనుభవం అందించడం, మరియు మీ కోసం మా సేవలను అనుకూలీకరించడం కోసం మీ భాషా ప్రాధాన్యతల వంటి మీ ఎంపికలు గుర్తుంచుకోవడానికి మేము కుకీలు ఉపయోగించవచ్చు. మీకు మా సేవలు అందించడానికి మేము కుకీలు ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

తిరిగి పైకి వెళ్లు

మూడవ-పక్షం సమాచారం

  • మీ గురించి ఇతరులు అందించే సమాచారం. మీ గురించి ఇతర యూజర్‌ల నుండి కూడా మేము సమాచారం స్వీకరిస్తాము. ఉదాహరణకు, మీకు తెలిసిన ఇతర యూజర్‌లు మా సేవలు ఉపయోగించిన సందర్భంలో, వారు మీ ఫోన్ నంబర్, పేరు మరియు ఇతర సమాచారాన్ని (వారి మొబైల్‌లోని అడ్రస్ బుక్ నుండి లభించే సమాచారం లాంటిది) మీరు వారికి అందించిన విధంగానే మాకు అందించే అవకాశం ఉంది. వారు మీకు మెసేజ్‌లు పంపడం, మీరు ఉండే గ్రూప్‌లకు మెసేజ్‌లు పంపడం లేదా మీకు కాల్ చేయడం కూడా సాధ్యమయ్యేలా ఉండాలి. మాకు ఏదైనా సమాచారం అందించడానికి ముందు మీ సమాచారాన్ని సేకరించడానికి, ఉపయోగించడానికి మరియు షేర్ చేయడానికి ఈ వినియోగదారులు చట్టబద్ధమైన హక్కులను కలిగి ఉండటం మాకు అవసరం.
    సాధారణంగా ఏ వినియోగదారు అయినా సరే, మీ చాట్‌లు లేదా మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లు తీయవచ్చు లేదా వారితో మీ కాల్‌లను రికార్డింగ్ చేయవచ్చు, వాటిని WhatsAppకు లేదా ఇంకెవరికైనా పంపవచ్చు లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వాటిని పోస్ట్ చేయవచ్చని మీరు గుర్తుంచుకోవాలి.
  • వినియోగదారు‌ నివేదికలు. ఇతర యూజర్‌లకు సంబంధించి మీరు నివేదించగల విధంగానే, ఇతర యూజర్‌లు లేదా మూడవ పక్షాలు కూడా మా సేవల ద్వారా మీరు వారితో లేదా ఇతరులతో జరిపిన ఇంటరాక్షన్‌లు మరియు మీ మెసేజ్‌లను మాకు నివేదించడానికి ఎంచుకోవచ్చు; ఉదాహరణకు, మా నిబంధనలు లేదా విధానాల ఉల్లంఘనలను నివేదించవచ్చు. ఒక నివేదిక రూపొందించబడినప్పుడు, నివేదిస్తున్న యూజర్ మరియు నివేదించబడిన యూజర్‌ ఇద్దరి సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఎవరైనా యూజర్‌ నివేదిక తయారు చేసినప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి అధునాతన భద్రత మరియు భద్రతా ఫీచర్‌లు ఇక్కడ చూడండి.
  • WhatsAppలో బిజినెస్‌లు. మా సేవలను ఉపయోగించి మీరు ఇంటరాక్ట్ అయ్యే బిజినెస్‌లు మీతో వారి ఇంటరాక్షన్‌ల గురించిన సమాచారాన్ని మాకు అందించవచ్చు. ఈ వ్యాపారాల్లో ప్రతిదీ మాకు ఏదైనా సమాాచారాన్ని అందిస్తున్నప్పుడు వర్తించదగిన చట్టానికి అనుగుణంగా ప్రవర్తించడం మాకు అవసరం.
    మీరు WhatsAppలో బిజినెస్‌తో మెసేజ్ చేసేటప్పుడు, మీరు షేర్ చేసే కంటెంట్ ఆ బిజినెస్‌కి చెందిన అనేక మందికి వ్యక్తులకు కనిపించవచ్చని గుర్తుంచుకోండి. దాంతో పాటు, కొన్ని బిజినెస్‌లు వారి కస్టమర్‌లతో వారి కమ్యూనికేషన్‌లను నిర్వహించడంలో సహాయపడటానికి మూడవ పక్షం సేవా ప్రొవైడర్‌లతో (అది Metaతో సహా ఏదైనా కావచ్చు) పని చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, బిజినెస్ కోసం పంపడానికి, నిల్వ చేయడానికి, చదవడానికి, నిర్వహించడానికి లేదా ప్రాసెస్ చేయడానికి తన కమ్యూనికేషన్‌లను యాక్సెస్ చేసే అవకాశాన్ని ఏదైనా బిజినెస్ అలాంటి మూడవ-పక్షం సేవా ప్రదాతకు అందించవచ్చు. ఏదైనా బిజినెస్ మీ సమాచారాన్ని మూడవ పక్షాలతో లేదా Metaతో ఎలా షేర్ చేసుకోవాలనే దానితో సహా మీ సమాచారాన్ని అది ఎలా ప్రాసెస్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి, మీరు ఆ బిజినెస్ గోప్యతా విధానాన్ని సమీక్షించాలి లేదా నేరుగా ఆ బిజినెస్‌ను కాంటాక్ట్ చేయాలి.
  • మూడవ-పక్షం సేవా ప్రదాతలు. మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో మాకు సహాయంగా మేము మూడవ పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Meta కంపెనీలతో కలిసి పని చేస్తాము. ఉదాహరణకు, మా యాప్‌ల పంపిణీ; మా సాంకేతికత మరియు భౌతిక మౌలిక సదుపాయాలు, డెలివరీ మరియు ఇతర వ్యవస్థలు అందించడం; ఇంజనీరింగ్ మద్దతు, సైబర్‌ సెక్యూరిటీ మద్దతు మరియు కార్యకలాపం మద్దతు అందించడం; లొకేషన్, మ్యాప్ మరియు ప్రదేశాల సమాచారం సరఫరా; చెల్లింపులను ప్రాసెస్ చేయడం; ప్రజలు మా సేవలను ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడడం; మా సేవలను మార్కెట్ చేయడం; మా సేవలు ఉపయోగించి బిజినెస్‌లతో కనెక్ట్ కావడంలో మీకు సహాయపడడం; మా కోసం సర్వేలు మరియు పరిశోధనలు నిర్వహించడం; సురక్షత, భద్రత మరియు సమగ్రతను నిర్ధారించడం; మరియు కస్టమర్ సేవకు సంబంధించి సహాయపడటం కోసం మేము వారితో కలిసి పని చేస్తాము. ఈ కంపెనీలు నిర్దిష్ట సందర్భాల్లో మీ గురించిన సమాచారాన్ని మాకు అందించవచ్చు; ఉదాహరణకు, సేవకు సంబంధించిన సమస్యలను గుర్తించి, పరిష్కరించడంలో సహాయంగా యాప్ స్టోర్‌లు మాకు రిపోర్ట్‌లను అందించవచ్చు.
    దిగువన ఉన్న "ఇతర Meta కంపెనీలతో మేము ఎలా పని చేస్తాము" విభాగం WhatsApp ఇతర Meta కంపెనీలతో సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది మరియు షేర్ చేస్తుందనే దాని గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది.
  • మూడవ పక్షం సేవలు. మా సేవలను మూడవ పక్షం సేవలు మరియు Meta కంపెనీ ప్రోడక్ట్‌లకు అనుబంధంగా ఉపయోగించడానికి మేము మిమ్మల్ని అనుమతిస్తాము. అలాంటి మూడవ-పక్షం సేవలు లేదా Meta కంపెనీ ప్రోడక్ట్‌లతో మీరు మా సేవలు ఉపయోగిస్తున్న పక్షంలో, మీ గురించిన సమాచారాన్ని మేము వారి నుండి స్వీకరించవచ్చు; ఉదాహరణకు, మీరు ఒక వార్తా కథనాన్ని మా సేవల్లోని మీ WhatsApp కాంటాక్ట్‌లు, గ్రూప్‌లు, లేదా బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లతో షేర్ చేసుకోవడం కోసం ఒక వార్తా సేవలోని WhatsApp షేర్ బటన్‌ను మీరు ఉపయోగిస్తే, లేదా మా సేవలను ప్రచారం చేసే ఒక మొబైల్ క్యారియర్ లేదా డివైజ్ ప్రదాత ద్వారా మా సేవలను యాక్సెస్ చేయాలని మీరు ఎంచుకుంటే, మేము మీ గురించిన సమాచారం స్వీకరించవచ్చు. మీరు మూడవ-పక్షం సేవలు లేదా Meta కంపెనీ ప్రోడక్ట్‌లను ఉపయోగించినప్పుడు, ఆ సేవలు మరియు ప్రోడక్ట్‌లకు సంబంధించిన మీ వినియోగం అనేది, వారి సొంత నిబంధనలు మరియు గోప్యతా విధానాలకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోండి.

తిరిగి పైకి వెళ్లు

మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు ఇవ్వడం మరియు మార్కెట్ చేయడం కోసం మా వద్ద ఉన్న సమాచారాన్ని (మీరు చేసే ఎంపికలు మరియు వర్తించే చట్టానికి లోబడి) మేము ఉపయోగిస్తాము. అది ఎలాగో ఇక్కడ చూడండి:

  • మా సేవలు. వినియోగదారు మద్దతు అందించడంతో సహా, మా సేవలు నిర్వహించడానికి మరియు అందించడానికి; కొనుగోళ్లు లేదా లావాదేవీలు పూర్తి చేయడానికి; మా సేవలను మెరుగుపరచడం, పరిష్కరించడం, మరియు అనుకూలీకరించడం; మీరు ఉపయోగించే అవకాశం ఉన్న మా సేవలను Meta కంపెనీ ఉత్పత్తులతో కనెక్ట్ చేయడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము. మా సేవలను ప్రజలు ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడం; మా సేవలను అంచనా వేయడం మరియు మెరుగుపరచడం; కొత్త సేవలు మరియు ఫీచర్‌లను శోధించడం, అభివృద్ధి చేయడం మరియు పరీక్షించడం; మరియు ట్రబుల్‌షూటింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం కూడా మేము సమాచారం ఉపయోగిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు మీకు ప్రతిస్పందించడానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము.
  • సురక్షత, భద్రత మరియు సమగ్రత. సురక్షత, భద్రత మరియు సమగ్రత అనేవి మా సేవల్లో అంతర్భాగంగా ఉంటాయి. అకౌంట్‌లు మరియు కార్యకలాపాన్ని ధృవీకరించడం; హానికర ప్రవర్తనను ఎదుర్కోవడం; చెడు అనుభవాలు మరియు స్పామ్‌ నుండి వినియోగదారు‌లను రక్షించడం; మరియు అనుమానాస్పద కార్యకలాపం లేదా మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘనలను పరిశోధించడం ద్వారా మా సేవలలో మరియు వెలుపల సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడం, అలాగే మా సేవలు చట్టబద్ధంగానే ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడం కోసం మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తాము. మరింత సమాచారం కోసం, దయచేసి దిగువన చట్టం, మా హక్కులు మరియు రక్షణ విభాగం చూడండి.
  • మా సేవలు మరియు Meta కంపెనీలు గురించిన కమ్యూనికేషన్‌లు. మా సేవల గురించి మీతో కమ్యూనికేట్ చేయడానికి మరియు మా నిబంధనలు, విధానాలు, మరియు ఇతర ముఖ్యమైన అప్‌డేట్‌ల గురించి మీకు తెలియజేయడానికి మేము సమాచారం ఉపయోగిస్తాము. మా సేవలు మరియు Meta కంపెనీల కోసం మేము మీకు మార్కెటింగ్ అందించవచ్చు.
  • మూడవ-పక్షం బ్యానర్ యాడ్‌లు ఉండవు. మా సేవల్లో మూడవ-పక్షం బ్యానర్ యాడ్‌లను మేము ఇప్పటికీ అనుమతించడం లేదు. వాటిని పరిచయం చేసే ఉద్దేశ్యం మాకు లేదు, కానీ, ఎప్పుడైనా మేము అలా చేసే పక్షంలో, ఈ గోప్యతా విధానాన్ని మేము అప్‌డేట్ చేస్తాము.
  • బిజినెస్ ఇంటరాక్షన్‌లు. WhatsAppలో బిజినెస్‌ల క్యాటలాగ్‌లు వంటి మా సేవలు ఉపయోగించి మీరు మరియు బిజినెస్‌ల వంటి మూడవ పక్షాలు పరస్పరం కమ్యూనికేట్ మరియు ఇంటరాక్ట్ చేయడానికి మేము అవకాశం కల్పిస్తాము, వీటి ద్వారా మీరు ఉత్పత్తులు మరియు సేవలను బ్రౌజ్ చేయవచ్చు మరియు ఆర్డర్‌లు చేయవచ్చు. బిజినెస్‌లు మీకు లావాదేవీ, అపాయింట్‌మెంట్ మరియు షిప్పింగ్ నోటిఫికేషన్‌లు; ఉత్పత్తి మరియు సేవా అప్‌డేట్‌లు; మరియు మార్కెటింగ్ సమాచారం పంపవచ్చు. ఉదాహరణకు, భవిష్యత్ ప్రయాణం కోసం విమాన స్థితి సమాచారం, మీరు కొనుగోలు చేసిన దానికి రసీదు లేదా దాని డెలివరీ సమయంలో నోటిఫికేషన్ అందుకోవచ్చు. ఏదైనా బిజినెస్ నుండి మీరు స్వీకరించే మెసేజ్‌లలో మీకు ఆసక్తి కలిగించగల ఏదైనా ఒక ఆఫర్ ఉంటుంది. మీకు స్పామ్ అనుభవం ఎదురు కావాలని మేము కోరుకోము; మీ అన్ని మెసేజ్‌ల లాగానే, ఈ కమ్యూనికేషన్‌లనూ మీరు నిర్వహించవచ్చు మరియు మీరు చేసే ఎంపికలను మేము గౌరవిస్తాము.

తిరిగి పైకి వెళ్లు

మీరు మరియు మేము షేర్ చేసే సమాచారం

మా సేవల ద్వారా ఉపయోగిస్తూ మరియు కమ్యూనికేట్ చేస్తూ మీ సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, మా సేవల నిర్వహణ, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ కోసం మాకు సహాయంగా మేము మీ సమాచారాన్ని షేర్ చేస్తాము.

  • మీరు కమ్యూనికేట్ చేయడానికి ఎంచుకున్న వారికి మీ సమాచారం పంపండి. మీరు మా సేవల ద్వారా ఉపయోగిస్తున్నప్పుడు మరియు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీరు మీ సమాచారం (మెసేజ్‌లతో సహా) పంచుకుంటారు.
  • మీ అకౌంట్‌తో అనుబంధించబడిన సమాచారం. మా సేవలు ఉపయోగించే ఎవరికైనా మీ ఫోన్ నంబర్, ప్రొఫైల్ పేరు మరియు ఫోటో, "పరిచయం" సమాచారం, చివరిగా చూసిన సమాచారం మరియు మెసేజ్ రసీదులు అందుబాటులో ఉంటాయి, అయినప్పటికీ, బిజినెస్‌లతో సహా ఇతర యూజర్‌లకు అందుబాటులో ఉండే నిర్దిష్ట సమాచారాన్ని మీరు ఎవరితో కమ్యూనికేట్ చేస్తారో నిర్వహించడానికి మీ సేవల సెట్టింగ్‌లను మీరు కాన్ఫిగర్ చేయవచ్చు.
  • మీ కాంటాక్టులు మరియు ఇతరులు. మీరు కమ్యూనికేట్ చేసే బిజినెస్‌లతో సహా యూజర్‌లు మీ సమాచారాన్ని (మీ ఫోన్ నంబర్ లేదా మెసేజ్‌లతో సహా) నిల్వ చేయగలరు లేదా మా సేవల ద్వారా మరియు ఇతర రూపాల్లో రీషేర్ చేయగలరు. మా సేవల ద్వారా మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలో మరియు మీరు షేర్ చేసే నిర్దిష్ట సమాచారాన్ని నిర్వహించడానికి మీరు మీ సేవల సెట్టింగ్‌లను మరియు మా సేవల్లోని “బ్లాక్ చేయి” ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
  • WhatsAppలో బిజినెస్‌లు. బిజినెస్‌లు మా సేవలను ఉపయోగించడానికి సంబంధించి కొలమానాలు అందించడం లాంటి నిర్దిష్ట సేవలను మేము వారికి అందిస్తాము.
  • మూడవ-పక్షం సేవా ప్రదాతలు. మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో మాకు సహాయంగా మేము మూడవ పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Meta కంపెనీలతో కలిసి పని చేస్తాము. సాంకేతిక మౌలిక సదుపాయాలు, డెలివరీ మరియు ఇతర వ్యవస్థలు అందించడం; మా సేవలను మార్కెట్ చేయడం; మా కోసం సర్వేలు మరియు పరిశోధన నిర్వహించడం; వినియోగదారు‌లు మరియు ఇతరుల రక్షణ, భద్రత మరియు సమగ్రతను రక్షించడం; మరియు కస్టమర్ సేవకు సంబంధించి సహాయపడటం కోసం మేము కంపెనీలతో కలసి పని చేస్తాము. ఈ సామర్థ్యం మేరకు మూడవ-పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Meta కంపెనీలతో మేము సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, మా సూచనలు మరియు నిబంధనలకు అనుగుణంగా మా తరఫున మీ సమాచారాన్ని ఉపయోగించాలని వారిని మేము కోరతాము.
  • మూడవ పక్షం సేవలు. మా సేవలతో ఏకీకృతమైన మూడవ-పక్షం సేవలు లేదా ఇతర Meta కంపెనీ ఉత్పత్తులను మీరు లేదా ఇతరులు ఉపయోగించినప్పుడు, మీరు లేదా ఇతరులు ఆ మూడవ-పక్షం సేవలతో షేర్ చేసిన సమాచారాన్ని అవి స్వీకరించవచ్చు. ఉదాహరణకు, మా సేవల (iCloud లేదా Google ఖాతా లాంటి వాటి)తో అనుసంధానమైన ఒక డేటా బ్యాకప్ సేవను మీరు ఉపయోగిస్తున్న పక్షంలో, మీరు వారితో షేర్ చేసిన మీ WhatsApp మెసేజ్‌ల వంటి సమాచారాన్ని వారు స్వీకరిస్తారు. మా సేవల ద్వారా లింక్ చేయబడిన ఒక మూడవ-పక్షం సేవ లేదా ఇతర Meta కంపెనీ ప్రోడక్ట్‌తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు, ఒక మూడవ-పక్షం ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ ప్లే చేయడానికి ఇన్-యాప్ ప్లేయర్‌ను మీరు ఎప్పుడు ఉపయోగించారు, మీ IP చిరునామా మరియు మీరొక WhatsApp వినియోగదారు అనే వాస్తవం లాంటివి ఆ మూడవ-పక్షం లేదా Meta కంపెనీ ప్రోడక్ట్‌కి అందజేసే అవకాశం ఉంది. మీరు మూడవ-పక్షం సేవలు లేదా ఇతర Meta కంపెనీ ప్రోడక్ట్‌లను ఉపయోగించినప్పుడు, ఆ సేవలు మరియు ప్రోడక్ట్‌లకు సంబంధించిన మీ వినియోగం అనేది, వారి సొంత నిబంధనలు మరియు గోప్యతా విధానాలకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోండి.

తిరిగి పైకి వెళ్లు

మేము ఇతర Meta కంపెనీలతో ఎలా పని చేస్తాము

Meta కంపెనీలలో భాగంగా, ఇతర Meta కంపెనీలు నుండి WhatsApp సమాచారం స్వీకరిస్తుంది మరియు సమాచారాన్ని షేర్ చేస్తుంది (ఇక్కడ చూడండి). వారి నుండి స్వీకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు, మరియు Meta కంపెనీ ఉత్పత్తులతో సహా మా సేవలు మరియు వారి ఆఫరింగ్‌లు నిర్వహణ, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో సహాయంగా మేము వారితో షేర్ చేసుకునే సమాచారాన్ని వారు ఉపయోగించవచ్చు. ఇందులో ఇవి ఉంటాయి:

  • మౌలికసదుపాయాలు మరియు డెలివరీ వ్యవస్థల మెరుగుదల కోసం సహాయపడడం;
  • మా సేవలు లేదా వారివి ఎలా ఉపయోగించబడతాయో అర్థం చేసుకోవడం;
  • Meta కంపెనీ ప్రోడక్ట్‌లలో సురక్షత, భద్రత మరియు సమగ్రత పెంపొందించడం, ఉదా., సిస్టమ్‌లను భద్రంగా ఉంచడం మరియు స్పామ్, బెదిరింపులు, దుర్వినియోగం లేదా ఉల్లంఘన కార్యకలాపాలతో పోరాడడం;
  • మీ కోసం సూచనలు రూపొందించడం (ఉదాహరణకు, స్నేహితులు లేదా గ్రూప్ కనెక్షన్‌లు లేదా ఆసక్తికర కంటెంట్), ఫీచర్‌లు మరియు కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడం, కొనుగోళ్లు మరియు లావాదేవీలు పూర్తి చేయడంలో మీకు సహాయపడడం, మరియు Meta కంపెనీ ఉత్పత్తులలో సంబంధిత ఆఫర్‌లు మరియు యాడ్‌లను చూపడం; మరియు
  • మీ WhatsApp అనుభవాన్ని ఇతర Meta కంపెనీ ఉత్పత్తులతో కనెక్ట్ చేయడానికి మీకు అవకాశం కల్పించే ఏకీకరణలను అందించడం. ఉదాహరణకు, WhatsApp ద్వారా పొందే ఏవైనా వస్తువుల కోసం చెల్లించేందుకు మీ Facebook Pay అకౌంట్‌ను కనెక్ట్ చేసే సౌలభ్యాన్ని మీకు అందించడం లేదా మీ WhatsApp అకౌంట్‌ను కనెక్ట్ చేయడం ద్వారా Portal లాంటి ఇతర Meta కంపెనీ ప్రోడక్ట్‌లలో మీ స్నేహితులతో చాట్ చేయడానికి మీకు అవకాశం కల్పించడం.

వారి గోప్యతా విధానాలను సమీక్షించడం ద్వారా ఇతర Meta కంపెనీలు మరియు వారి గోపత్యా విధానాల గురించి మరింత తెలుసుకోండి.

తిరిగి పైకి వెళ్లు

కేటాయించడం, నియంత్రణ మార్పు మరియు బదిలీ

మా అన్ని లేదా కొన్ని ఆస్తుల విలీనం, ఆర్జన, పునర్నిర్మాణం, దివాలా లేదా అమ్మకంలో మేము భాగమైన సందర్భంలో, వర్తించే డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా లావాదేవీకి సంబంధించి మీ సమాచారాన్ని రాబోయే సంస్థలతో లేదా కొత్త యజమానులతో మేము పంచుకుంటాము.

తిరిగి పైకి వెళ్లు

మీ సమాచార నిర్వహణ మరియు నిలిపి ఉంచుకోవడం

మా ఇన్-యాప్ అభ్యర్థనా అకౌంట్ సమాచార ఫీచర్ (సెట్టింగ్‌లు > అకౌంట్ కింద అందుబాటులో ఉంటుంది) ఉపయోగించి మీరు మీ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు. iPhone యూజర్‌ల కోసం మా iPhone సహాయ కేంద్రం కథనాలు ద్వారా మీ సమాచారాన్ని యాక్సెస్, నిర్వహణ, మరియు తొలగించడం ఎలాగో మీరు నేర్చుకోవచ్చు. Android వినియోగదారు‌ల కోసం మా Android సహాయ కేంద్రం కథనాల ద్వారా మీ సమాచారాన్ని యాక్సెస్ చేయడం, నిర్వహించడం, మరియు తొలగించడం ఎలాగో మీరు తెలుసుకోవచ్చు.

మా సేవలు అందించడం లేదా చట్టబద్ధ బాధ్యతలను అనుసరించడం, మా నిబంధనలను అమలు చేయడం మరియు ఉల్లంఘనలను నిరోధించడం లేదా మా హక్కులు, ఆస్తి మరియు వినియోగదారులను రక్షించుకోవడం మరియు కాపాడుకోవడంతో సహా, ఈ గోప్యతా విధానంలో గుర్తించబడిన ప్రయోజనాల కోసం, అవసరమైనంత కాలం మేము సమాచారాన్ని నిల్వ చేస్తాము. నిల్వ వ్యవధులు అనేవి సమాచార స్వభావం, అది ఎందుకు సేకరించబడింది మరియు ప్రాసెస్ చేయబడింది, సంబంధిత చట్టబద్ధ లేదా నిర్వాహక నిలుపుదల అవసరాలు మరియు చట్టబద్ధ అభ్యంతరాల వంటి కారకాల మీద ఆధారపడేటటువంటి కేస్‌ల వారీ ప్రాతిపదికన నిర్ణయించబడతాయి.

మీరు మీ సమాచారాన్ని నిర్వహించడం, మార్చడం, పరిమితం చేయడం లేదా తొలగించడం చేయాలనుకుంటే, మీరు క్రింది సాధనాల ద్వారా వాటిని చేయవచ్చు:

  • సేవల సెట్టింగ్‌లు. మీరు ఇతర వినియోగదారులకు అందుబాటులోని నిర్దిష్ట సమాచారాన్ని నిర్వహించడానికి మీ సేవల సెట్టింగ్‌లను మార్చవచ్చు. మీరు కమ్యూనికేట్ చేసే యూజర్‌లను నిర్వహించడానికి మీరు మీ కాంటాక్ట్‌లు, గ్రూప్‌లు, మరియు బ్రాడ్‌క్యాస్ట్ లిస్ట్‌లు నిర్వహించవచ్చు, లేదా మా "బ్లాక్" ఫీచర్ ఉపయోగించవచ్చు.
  • మీ మొబైల్ ఫోన్ నంబర్, ప్రొఫైల్ పేరు మరియు చిత్రం, మరియు “పరిచయం” సమాచారం మార్చడం. మీరు మీ మొబైల్ ఫోన్ నంబర్‌ మార్చినట్లయితే, మీరు తప్పనిసరిగా మా ఇన్-యాప్ నంబర్ మార్పు ఫీచర్ ఉపయోగించి దీనిని అప్‌డేట్ చేయాలి మరియు మీ అకౌంట్‌ను మీ కొత్త మొబైల్ ఫోన్ నంబర్‌కు బదిలీ చేయాలి. మీరు ఎప్పుడైనా మీ ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ చిత్రం మరియు "పరిచయం" సమాచారం కూడా మార్చవచ్చు.
  • మీ WhatsApp ఖాతాను తొలగించడం. మా ఇన్-యాప్ డిలీట్ మై అకౌంట్ ఫీచర్ ఉపయోగించి మీరు ఎప్పుడైనా (వర్తించే చట్టానికి అనుగుణంగా మీ సమాచారాన్ని ఉపయోగించటానికి మీ సమ్మతిని ఉపసంహరించుకోవాలనుకోవడంతో సహా) మీ WhatsApp అకౌంట్‌ను తొలగించవచ్చు. మీరు మీ WhatsApp అకౌంట్‌ను తొలగించినప్పుడు, మీ డెలివరీ చేయబడని మెసేజ్‌లు మా సర్వర్‌ల నుండి తొలగించబడతాయి, అలాగే, మీ ఏ ఇతర సమాచారాన్ని ఇకపై మేము ఆపరేట్ చేయడం మరియు మా సేవలు అందించడం చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు, మీ అకౌంట్‌ను తొలగించడం అనేది మీ అకౌంట్ సమాచారం మరియు ప్రొఫైల్ ఫోటోను తొలగిస్తుంది, అన్ని WhatsApp గ్రూప్‌ల నుండి మిమ్మల్ని తొలగిస్తుంది మరియు మీ WhatsApp మెసేజ్ చరిత్రను తొలగిస్తుంది. మా ఇన్-యాప్ డిలీట్ మై అకౌంట్ ఫీచర్ ఉపయోగించకుండా మీ డివైజ్ నుండి మాత్రమే మీరు WhatsAppను తొలగిస్తే, మీ సమాచారం మా వద్ద దీర్ఘకాలం పాటు నిల్వ చేయబడుతుందని గుర్తుంచుకోండి. మీరు మీ అకౌంట్‌ను తొలగించినప్పుడు, గ్రూప్‌లకు సంబంధించి మీరు రూపొందించిన మీ సమాచారాన్ని లేదా మీకు సంబంధించి ఇతర వినియోగదారులు కలిగి ఉన్న సమాచారాన్ని, అంటే, మీరు వారికి పంపిన మెసేజ్‌ల కాపీల వంటి వాటిని అది ప్రభావితం చేయదని గుర్తుంచుకోండి.

మా డేటా తొలగింపు మరియు నిలిపి ఉంచుకోవడం పద్ధతులు మరియు మీ అకౌంట్‌ను ఎలా తొలగించాలి గురించి ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

తిరిగి పైకి వెళ్లు

చట్టం, మా హక్కులు మరియు రక్షణ

క్రింది అంశాల కోసం తప్పనిసరి అని మేము సంపూర్ణంగా విశ్వసించిన పక్షంలో, పైన పేర్కొన్న ఈ గోప్యతా విధానంలోని "మేము సేకరించే సమాచారం" విభాగంలో వివరించిన మీ సమాచారాన్ని మేము యాక్సెస్ చేస్తాము, భద్రపరుస్తాము మరియు షేర్ చేస్తాము. అవి: (ఎ) వర్తించే చట్టం లేదా నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియ, లేదా ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా స్పందించడం; (బి) సంభావ్య ఉల్లంఘనల పరిశోధనలతో సహా మా నిబంధనలు మరియు వర్తించే ఇతర నిబంధనలు మరియు విధానాలను అమలు చేయడం; (సి) మోసం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా భద్రత మరియు సాంకేతిక సమస్యలను గుర్తించడం, దర్యాప్తు చేయడం, నిరోధించడం, లేదా పరిష్కరించడం; లేదా (డి) మరణం లేదా తక్షణ శారీరక హాని వంటివి నిరోధించడంతో సహా, మా వినియోగదారులు, WhatsApp, Meta కంపెనీలు లేదా ఇతరుల హక్కులు, ఆస్తి మరియు భద్రతను రక్షించడం.

తిరిగి పైకి వెళ్లు

మా అంతర్జాతీయ కార్యకలాపాలు

WhatsApp సమాచారాన్నిఅంతర్జాతీయంగా షేర్ చేస్తుంది, Meta కంపెనీలలో అంతర్గతంగా మరియు మా భాగస్వాములు మరియు సేవా ప్రదాతలు, మరియు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎవరితో కమ్యూనికేట్ చేస్తారో వారితో ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా బహిర్గతంగా షేర్ చేస్తుంది. ఉదాహరణకు, మీ సమాచారం అనేది యునైటెడ్ స్టేట్స్‌కు; Meta కంపెనీల అనుబంధ సంస్థలు మరియు భాగస్వాములు, లేదా మా సేవా ప్రదాతలు ఉన్న దేశాలు లేదా భూభాగాలకు; లేదా ఈ గోప్యతా విధానంలో వివరించిన ప్రయోజనాల కోసం మీరు నివసించే ప్రదేశానికి వెలుపల మా సేవలు అందించే ఇతర దేశం లేదా భూభాగానికి ట్రాన్స్‌ఫర్ చేయబడవచ్చు లేదా పంపబడవచ్చు లేదా నిల్వ చేయబడవచ్చు మరియు ప్రాసెస్ చేయబడవచ్చు. WhatsApp యునైటెడ్ స్టేట్స్‌లో సహా Meta అంతర్జాతీయ మౌలిక సదుపాయాలను మరియు డేటా కేంద్రాలను ఉపయోగిస్తుంది. మా నిబంధనలలో పేర్కొన్న ప్రపంచవ్యాప్త సేవలు అందించడానికి ఈ బదిలీలు అవసరం. మీ సమాచారం బదిలీ చేయబడిన దేశాలు లేదా భూభాగాల గోప్యతా చట్టాలు మరియు రక్షణలనేవి మీ స్వదేశం లేదా భూభాగంలో ఉన్నవాటికి భిన్నమైనవిగా ఉండవచ్చని దయచేసి గుర్తుంచుకోండి.

తిరిగి పైకి వెళ్లు

మా విధానానికి అప్‌డేట్‌లు

మేము మా గోప్యతా విధానానికి సవరణలు లేదా అప్‌డేట్‌లు చేయవచ్చు. ఈ గోప్యతా విధానం సవరణలకు సంబంధించిన నోటీసును మీకు మేము తగిన విధంగా అందిస్తాము మరియు ఈ గోప్యతా విధానం పైభాగంలో "అమలులోకి వచ్చిన తేదీ"ని అప్‌డేట్ చేస్తాము. దయచేసి, కాలానుగుణంగా మా గోప్యతా విధానాన్ని సమీక్షించండి.

తిరిగి పైకి వెళ్లు

యునైటెడ్ స్టేట్స్‌లో నివసించే వారి కోసం గోప్యతా హక్కులు

మీరు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ప్రాంతీయ గోప్యతా నోటీసును సమీక్షించడం ద్వారా మీకు అందుబాటులో ఉండగల వినియోగదారు గోప్యతా హక్కుల గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.

తిరిగి పైకి వెళ్లు



మమ్మల్ని సంప్రదించండి

మా గోప్యతా విధానం గురించి మీకు ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే, దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.

WhatsApp LLC

గోప్యత విధానం

1601 విల్లో రోడ్

మెన్లో పార్క్, కాలిఫోర్నియా 94025

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

తిరిగి పైకి వెళ్లు

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్