కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
  • యాప్‌లు
    • కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుస్టేటస్ఛానల్‌లుMeta AIభద్రత
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • కాలింగ్

      వాయిస్ మరియు వీడియోతో కనెక్ట్ అయ్యి ఉండండి.

    • మెసేజింగ్

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మొదలైనవాటితో మీరు అనుకున్నది చెప్పండి.

    • గ్రూప్‌లు

      మీరు గ్రూప్‌లలో కనెక్ట్ కావడానికి అవసరమయ్యే మెసేజింగ్ ఫీచర్‌లు.

    • ఛానల్‌లు

      మీరు శ్రద్ధ వహించే అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి.

    • Meta AI

      WhatsAppలో భద్రత మరియు గోప్యతతో ఏ విషయంలోనైనా సహాయం పొందండి.

    • స్టేటస్

      ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ నోట్‌లతో మీ రోజువారీ కార్యక్రమాలను షేర్ చేయండి.

    • భద్రత

      సురక్షితంగా ఉండటంలో మీకు సహాయపడే రక్షణ వలయాలు.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌ల గోప్యతా నోటీసు

ప్రభావిత 15 అక్టోబర్, 2024

మీరు ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లను ఎంచుకున్నట్లయితే, ఈ గోప్యతా నోటీసు వర్తిస్తుంది. ఇది ఈ కెమెరా ఎఫెక్ట్‌లను రూపొందించడానికి మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము మరియు రక్షిస్తాము అనే విషయాన్ని వివరించడంతో పాటు WhatsApp గోప్యతా విధానానికి అనుబంధంగా ఉంటుంది.

ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లు అనేవి సన్నివేశంలోని వ్యక్తులు కదులుతున్నప్పుడు, మాట్లాడేటప్పుడు మరియు వ్యక్తీకరిస్తున్నప్పుడు ప్రతిస్పందించే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్‌లు. వాటిలో ఫిల్టర్‌లు, మాస్క్‌లు మరియు ఇతర ఇంటరాక్టివ్ డిజిటల్ అనుభవాలు ఉన్నాయి. మీరు మీ కెమెరా, ఫోటోలు మరియు వీడియోలలో ఈ ఎఫెక్ట్‌లను ఉపయోగించగలరు.

పని చేయడానికి మేము ఉపయోగించే సమాచారం

మీరు ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లను ఉపయోగించినప్పుడు, మేము వాటిని మీ కెమెరా, ఫోటోలు మరియు వీడియోలలో సరైన స్థలంలో చూపాలి అలాగే మీ సంజ్ఞలు, వ్యక్తీకరణలు లేదా కదలికలకు కొన్ని ప్రభావాలు ప్రతిస్పందించేలా చేయాలి. ఉదాహరణకు, మీరు కుక్కపిల్ల చెవులను ఎంచుకున్నట్లయితే, చెవులు మీ తల పైభాగంలో ఉండేలా చూసుకోవడంతో పాటు మీరు కదిలేటప్పుడు అక్కడే ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. దీన్ని చేయడానికి, మేము మీ ముఖంలోని భాగాల(మీ కళ్లు, ముక్కు లేదా నోరు వంటి వాటి) స్థానాన్ని మరియు మీ ముఖం, కళ్లు లేదా చేతులపై పాయిం‌ట్‌లను అంచనా వేస్తాము. కొన్ని ఎఫెక్ట్‌ల కోసం, మేము ఈ పాయింట్‌లను ముఖం యొక్క సాధారణ నమూనాకు వర్తింపజేయడంతో పాటు మీ ముఖంలోని భావాలు మరియు కదలికలను అనుకరించేలా సర్దుబాటు చేస్తాము. మిమ్మల్ని గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగించబడదు.

ఈ సమాచారంతో మేము ఏమి చేస్తాము

మేము ఈ సమాచారాన్ని మా సర్వర్‌లలో ప్రాసెస్ చేయడం లేదా నిల్వ చేయడం లేదా మూడవ పక్షాలతో షేర్ చేయడం వంటివి చేయము. సమాచారం ప్రాసెస్ చేయబడింది, కానీ మీ పరికరంలో నిల్వ చేయబడకపోవడంతో పాటు మీరు ఎంచుకున్న ఎఫెక్ట్‌ని ఉపయోగించిన తర్వాత తొలగించబడుతుంది.

ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లను ఇతర వ్యక్తులతో ఉపయోగించడం

మీరు ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లను ఉపయోగించినప్పుడు, మీ కెమెరా ఫీడ్, ఫోటో లేదా వీడియోలో కనిపించే ఇతర వ్యక్తుల చిత్రాల నుండి మేము సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఎఫెక్ట్‌లను వీడియో కాల్‌లో ఉపయోగించినప్పుడు, నేపథ్యంలోని వేరొకరి తలపై కుక్కపిల్ల చెవులు కనిపించేలా చేయవచ్చు.

యు.ఎస్.లో నివసించే వ్యక్తులకు అదనపు సమాచారం

మీరు యు.ఎస్.లో నివసించే వ్యక్తి అయినట్లయితే, మీరు ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లను WhatsAppలో యాక్సెస్ చేయడానికి ముందు మీరు వాటిని ఆన్ చేయవలసి ఉంటుంది. మీరు WhatsAppలో ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌లను ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు, ఎఫెక్ట్‌లను ఆన్ చేయవలసిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

మీ ముఖం మరియు చేతులకు సంబంధించిన ఎఫెక్ట్‌ల సెట్టింగ్‌ని మీరు ఎప్పుడైనా మార్చగలరు. సెట్టింగ్ ఆఫ్ చేయబడినట్లయితే, మీరు ఇప్పటికీ ఇతర ఫీచర్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు.

ఎఫెక్ట్‌లను ఆన్ చేయడం ద్వారా, మీ కెమెరా ఫీడ్, ఫోటో లేదా వీడియోలో కనిపించే వ్యక్తులందరూ కూడా వారి WhatsApp ఖాతాల ద్వారా ఎఫెక్ట్‌లను ఆన్ చేసి ఉన్నా లేదా మీరు వారి చట్టబద్ధమైన అధీకృత ప్రతినిధి కావడంతో పాటు వారి తరఫున ఈ నోటీసు నిబంధనలకు సమ్మతిస్తే మాత్రమే మీరు ఫీచర్‌ను ఉపయోగిస్తారని మీరు అంగీకరిస్తున్నారు.

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్