ప్రభావిత 16 జూన్, 2025
ఈ WhatsApp ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్ సేవా నిబంధనలు (“ఛానెల్‌ల సబ్‌స్క్రైబర్ నిబంధనలు” లేదా “నిబంధనలు”) అనేవి (దిగువన నిర్వచించినట్లు) ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను మీరు (ఇక్కడ మీరు, మీ మరియు/లేదా సబ్‌స్క్రైబర్ వంటి పదాలతో సూచించబడతారు) కొనుగోలు చేయడాన్ని మరియు దానిలో పాల్గొనడాన్ని నియంత్రిస్తాయి. ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌లో చేరడం లేదంటే పాల్గొనడం ద్వారా, మీరు ఈ ఛానెల్‌ల సబ్‌స్క్రైబర్ నిబంధనలకు అంగీకారం తెలుపుతున్నారు. దయచేసి ఈ ఛానెల్‌ల సబ్‌స్క్రైబర్ నిబంధనలను జాగ్రత్తగా చదవండి.
ఛానెల్‌ల యజమాని(నులు) అంటే ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ గల WhatsApp ఛానెల్‌కు యజమానిగా ఉండే వ్యక్తి లేదా సంస్థ.
ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్(లు) అంటే ఛానెల్ యజమాని యొక్క ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ మరియు/లేదా నిర్దిష్ట డిజిటల్ ఫీచర్‌లకు యాక్సెస్ కోసం WhatsAppలో అందుబాటులో ఉంచబడినటువంటి ప్రతినెలా ఆటోమేటిక్‌గా పునరావృతమయ్యే సబ్‌స్క్రిప్షన్.
ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ అంటే ఛానెల్ యజమాని యొక్క ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న సబ్‌స్క్రైబర్‌లకు ఆ ఛానెల్ యజమాని అందుబాటులో ఉంచిన కంటెంట్.
మీరు లేదా సబ్‌స్క్రైబర్ అంటే WhatsApp నుండి ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే ఎవరైనా వ్యక్తి.
రెన్యువల్ తేదీ అంటే (ఒక్కో సందర్భంలో, వర్తించే విధంగా) మీ సబ్‌స్క్రిప్షన్ తేదీ యొక్క క్యాలెండర్ రోజుకు లేదా క్యాలెండర్ నెల మరియు రోజుకు అనుగుణంగా మీ సబ్‌స్క్రిప్షన్ తేదీ తర్వాత (ఒక్కో సందర్భంలో, వర్తించే విధంగా) ప్రతి నెలలోని క్యాలెండర్ రోజు లేదా ప్రతి సంవత్సరంలోని క్యాలెండర్ నెల మరియు రోజు. మీరు మీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేస్తే లేదంటే దిగువ నిబంధనలకు అనుగుణంగా మీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ ఆపివేయబడితే మినహా ప్రతి రెన్యువల్ తేదీన, మీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యూ అవుతుంది, అలాగే సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి గానూ మీకు ఛార్జీ విధించబడుతుంది. ఉదాహరణకు, మీరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకుంటే, మీ సబ్‌స్క్రిప్షన్ తేదీ (దిగువన నిర్వచించినట్లుగా) ఫిబ్రవరి 15 అయితే, అదే క్యాలెండర్ సంవత్సరంలో మార్చి 15వ తేదీన మరియు మీ ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడే వరకు లేదా ఆపివేయబడే వరకు ప్రతి తదనంతర నెలలో 15వ రోజున మరొక నెల ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌కు గానూ మీకు ఛార్జీ విధించబడుతుంది. అందించబడిన నెలలో లేని క్యాలెండర్ రోజున మీరు ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లింపు చేస్తే, మీ రెన్యువల్ తేదీ అనేది ఆ నెలలో చివరి రోజున ఉంటుంది. ఉదాహరణకు, మీ సబ్‌స్క్రిప్షన్ తేదీ మార్చి 31 అయితే, మీ మొదటి రెన్యువల్ తేదీ ఏప్రిల్ 30 అవుతుంది, అలాగే తదనంతర రెన్యువల్ తేదీలు అనేవి తదనంతర నెలలలో 30వ రోజున ఉంటాయి.
సబ్‌స్క్రిప్షన్ తేదీ అంటే మీరు ఈ నిబంధనలకు అంగీకారం తెలిపే తేదీ.
సబ్‌స్క్రిప్షన్ వ్యవధి అంటే మీ సబ్‌స్క్రిప్షన్ తేదీ తర్వాత వచ్చే ఒక్కో నెల. ఉదాహరణకు, మీరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే, మీ సబ్‌స్క్రిప్షన్ తేదీ మార్చి 15 అయితే, అప్పటి సబ్‌స్క్రిప్షన్ వ్యవధి అనేది అదే క్యాలెండర్ సంవత్సరంలో మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది, ఆపై తదుపరి సబ్‌స్క్రిప్షన్ వ్యవధి అనేది అదే క్యాలెండర్ సంవత్సరంలో ఏప్రిల్ 15న ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది.
మూడవ పక్షం ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్(లు) అంటే మీరు ఛానెల్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే Apple App Store లేదా Google Play వంటి WhatsApp యేతర ప్లాట్‌ఫామ్.