WhatsApp అనేది ఒక వేగవంతమైన, సులభమైన అలాగే విశ్వసనీయమైన రీతిలో ప్రపంచంలో ఎవరితోనైనా ముచ్చటించుకునే విధానం. తమ కుటుంబం మరియు స్నేహితులతో ఎప్పుడైనా ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు 180 పైగా దేశాల్లోని 2 బిలియన్లకు పైగా ప్రజలు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp కేవలం ఉచితంగా మాత్రమే కాదు, బహుల మొబైల్ పరికరాల్లో, తక్కువ కనెక్టివిటీ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటుంది - తద్వారా మీరు ఎక్కడున్నప్పటికీ దానిపై ఆధారపడగలిగి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఎంతో ఇష్టమైన క్షణాలను షేర్ చేసుకోవడం, ముఖ్యమైన సమాచారాన్ని పంపడం లేదా ఒక స్నేహితునితో మాట్లాడటం లాంటివి చేయడానికి ఇది ఒక సులభమైన, సురక్షితమైన విధానం. ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నారనే దానితో సంబంధం లేకుండా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి షేర్ చేసుకోగలిగేలా WhatsApp సహాయపడుతుంది.
WhatsApp తన సంస్థలోని ఉద్యోగ అవకాశాలలో సమానత్వాన్ని అమలు చేస్తూ, వివక్షకు గురైన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాము. జాతి, మతం, రంగు, జాతీయ మూలం, లింగం (ప్రెగ్నెన్సీ, పిల్లల పుట్టుక, పునరుత్పత్తి ఆరోగ్య నిర్ణయాలు లేదా సంబంధిత ఆరోగ్య సమస్యలతో సహా), లైంగిక ధోరణి, జెండర్ గుర్తింపు, జెండర్ ఎక్స్‌ప్రెషన్, వయస్సు, ఆర్మీ వెటరన్ స్టేటస్, దివ్యాంగులయిన వ్యక్తి స్టేటస్, జన్యు సంబంధ సమాచారం, రాజకీయ దృక్పథాలు లేదా కార్యకలాపాలు, లేదా చట్టపరంగా సంరక్షించబడే ఇతర ప్రత్యేక లక్షణాల ఆధారంగా మేము ఎటువంటి వివక్షనూ చూపము. ఉద్యోగ అవకాశాలలో మేము అమలు చేసే సమానత్వాన్ని ప్రకటించే మా నోటీసును మీరు ఇక్కడ చూడవచ్చు. వర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక చట్టాలకు అనుగుణంగా, నేర చరిత్ర గల వ్యక్తులెవరైనా మాకు కావాల్సిన అర్హతలను కలిగి ఉన్నట్లయితే వారిని కూడా మేము పరిగణిస్తాము. చట్టం అనుమతించిన మేరకు, అలాగే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా Facebook యొక్క అలాగే దాని ఉద్యోగుల యొక్క సురక్షతను, భద్రతను కాపాడేందుకు మీరు సమర్పించే సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. Facebook యొక్క వేతనాలలో పారదర్శకత అనే విధానాన్ని మరియు ఉద్యోగ అవకాశాలలో సమానత్వం అనేది ఒక చట్టం అనే నోటీసును వాటి సంబంధిత లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా మీరు చూడవచ్చు. అంతే కాక, కొన్ని లొకేషన్లలో వర్తించే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా ఇ-వెరిఫై ప్రోగ్రామ్‌లో కూడా WhatsApp పాల్గొంటుంది.
మా ఎంపిక ప్రక్రియలో పాల్గొనే దివ్యాంగులైన అభ్యర్థులకు సహేతుకమైన స్థాయిలో సౌకర్యాలను అందించడానికి WhatsApp కట్టుబడి ఉంది. ఏదైనా అంగవైకల్యం వల్ల మీకు ఏమైనా సహాయం లేదా అదనపు సౌకర్యాల అవసరం ఉంటే, దయచేసి accommodations-ext@fb.com ఈమెయిల్ అడ్రస్ వద్ద మాకు తెలియజేయండి.