మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఉచితంగా మెసేజ్ చేయండి*. మెసేజ్‌లను పంపడానికి WhatsApp మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తుంది, దీని వలన మీరు SMS ఫీజులను నివారించవచ్చు
.
మీ కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు వంటి మీకు ముఖ్యమైన వ్యక్తుల గ్రూప్‌లతో సన్నిహితంగా ఉండండి. గ్రూప్ చాట్లతో, మీరు ఒకేసారి గరిష్టంగా 256 మందికి సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేయగలరు. మీరు మీ గ్రూప్‌కు పేరు పెట్టవచ్చు, నోటిఫికేషన్లను మ్యూట్ చేయవచ్చు లేదా అనుకూలీకరించవచ్చు, ఇంకా మరెన్నో చేయవచ్చు.
వెబ్ మరియు డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉన్న WhatsApp ద్వారా, మీ చాట్‌లన్నింటినీ మీ కంప్యూటర్‌తో సులభంగా సింక్ చేయవచ్చు, తద్వారా మీకు సౌకర్యవంతంగా ఉండే ఏ పరికరంలోనైనా చాట్ చేయవచ్చు. ప్రారంభించడానికి డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి లేదా web.whatsapp.com సందర్శించండి
వాయిస్ కాల్లతో, మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఉచితంగా మాట్లాడవచ్చు*, మీరు మరొక దేశంలో ఉన్నప్పుడు కూడా. మరియు ఉచిత* వీడియో కాల్లతో, వాయిస్ లేదా టెక్స్ట్ సరిపోని సమయాల్లో ముఖాముఖి సంభాషణల్లో పాల్గొనవచ్చు. WhatsApp వాయిస్ మరియు వీడియో కాల్లు మీ ఫోన్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తాయి, ఇది మీ సెల్ యొక్క వాయిస్ నిమిషాలను ఉపయోగించదు, దీని వలన ఖర్చుతో కూడిన కాలింగ్ ఛార్జీలు కోసం చింతించనవసరం లేదు.
మీ అత్యంత వ్యక్తిగత జ్ఞాపకాలు కొన్నింటినీ మీరు WhatsAppలో షేర్ చేయవచ్చు, ఈ కారణంగా మా యాప్ యొక్క తాజా వెర్షన్‌ల్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను నిర్మించాము. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడినప్పుడు, మీ మెసేజ్‌లు మరియు కాల్లు సురక్షితం చేయబడతాయి, కనుక మీరు మరియు మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తి మాత్రమే వీటిని చదవగలరు లేదా వినగలరు, మధ్యలో ఇంకెవరూ, అలాగే WhatsApp కూడా వీటిని చదవలేదు లేదా వినలేదు.
WhatsAppలో తక్షణమే ఫోటోలు మరియు వీడియోలను పంపండి. మీరు అంతర్గత కెమెరాతో మీకు అత్యంత ముఖ్యమైన జ్ఞాపకాలను కూడా క్యాప్చర్ చేయవచ్చు. WhatsAppతో, మీ నెట్వర్క్ కనెక్షన్ నెమ్మదిగా పని చేస్తున్నప్పటికీ ఫోటోలు మరియు వీడియోలను వేగంగా పంపవచ్చు.
కొన్నిసార్లు, మీ మాటలతోనే అన్నీ సాధ్యమవుతాయి. ఒకసారి ట్యాప్ చేసి మీరు వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయవచ్చు, వేగంగా హల్లో చెప్పడానికి లేదా ఏదైనా పెద్ద కథ చెప్పడానికి ఇది పూర్తిగా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇమెయిల్ లేదా ఫైల్ షేరింగ్ అప్లికేషన్లు అవసరం లేకుండా PDFలు, పత్రాలు, స్ప్రెడ్షీట్లు, స్లయిడ్షోలు మరియు మరిన్ని పంపండి. మీరు 100 MB వరకు పత్రాలను పంపవచ్చు, కనుక మీరు కావాల్సిన వారికి కావాల్సిన వాటిని సులభంగా చేరవేయవచ్చు.