కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమీ భావాలు వ్యక్తపరచండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
డౌన్‌లోడ్ చేయి
సేవా నిబంధనలు2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ అవ్వండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
WhatsApp Webడౌన్‌లోడ్

WhatsApp Messengerను ఉపయోగించడం ఎలా ప్రారంభించాలి

WhatsAppను డౌన్‌లోడ్ చేసి సెటప్ చేయండి

1. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రారంభించండి: Google Play స్టోర్ లేదా Apple App Store నుండి WhatsApp Messengerను ఉచితంగా డౌన్‌లోడ్ చేయండి. యాప్‌ను తెరవడానికి, మీ హోమ్ స్క్రీన్‌పై WhatsApp ఐకాన్‌పై ట్యాప్ చేయండి.

2. సేవా నిబంధనలను సమీక్షించండి: సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానం చదవండి, ఆ తర్వాత నిబంధనలను ఆమోదించడానికి అంగీకరించి కొనసాగించు అనే బటన్‌ను ట్యాప్ చేయండి.

3. రిజిస్టర్ చేయండి: మీ దేశపు కోడ్‌ను జోడించేందుకు, డ్రాప్-డౌన్ జాబితా నుండి మీ దేశాన్ని ఎంచుకోండి, తర్వాత మీ ఫోన్ నంబరును అంతర్జాతీయ ఫోన్ నంబర్ ఫార్మాట్‌లో ఎంటర్ చేయండి. పూర్తయింది లేదా తర్వాత ట్యాప్ చేయండి, ఆపై SMS లేదా ఫోన్ కాల్ ద్వారా మీ 6-అంకెల రిజిస్ట్రేషన్ కోడ్‌ను స్వీకరించడానికి సరే ట్యాప్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి, మీ 6-అంకెల కోడ్ నమోదు చేయండి Android, iPhone, లేదా KaiOSలో మీ ఫోన్ నంబరును ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

4. మీ ప్రొఫైల్‌ను సెటప్ చేయండి: మీ కొత్త ప్రొఫైల్‌లో మీ పేరు ఎంటర్ చేసి ఆపై తర్వాత ట్యాప్ చేయండి. మీరు ఒక ప్రొఫైల్ ఫోటో కూడా జోడించవచ్చు.

5. కాంటాక్ట్‌లు మరియు ఫోటోలకు యాక్సెస్ అనుమతించండి: మీ ఫోన్ అడ్రెస్ బుక్ నుండి కాంటాక్ట్‌లను WhatsAppకు జోడించవచ్చు. మీ ఫోటోలు, వీడియోలు, మరియు ఫైళ్లకు కూడా మీరు యాక్సెస్‌ను అనుమతించవచ్చు.

6. చాట్ ప్రారంభించండి: లేదా ను ట్యాప్ చేసి, ఆపై ప్రారంభించడానికి ఒక కాంటాక్ట్ కోసం వెతకండి. టెక్స్ట్ ఫీల్డ్‌లో మెసేజ్ నమోదు చేయండి. ఫోటోలు లేదా వీడియోలను పంపడానికి, టెక్స్ట్ ఫీల్డ్‌కు పక్కన ఉన్న లేదా ట్యాప్ చేయండి. ఒక కొత్త ఫోటో లేదా వీడియో తీసేందుకు కెమెరా ఎంచుకోండి లేదా మీ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న ఫోటో లేదా వీడియోను ఎంచుకునేందుకు గ్యాలరీ లేదా ఫోటో మరియు వీడియో లైబ్రరీని ఎంచుకోండి. తర్వాత, లేదా ట్యాప్ చేయండి.

7. ఒక గ్రూప్ సృష్టించండి: 256 మంది వరకూ ఉండగలిగేలా మీరు ఒక గ్రూప్ సృష్టించవచ్చు. లేదా ట్యాప్ చేసి, ఆపై కొత్త గ్రూప్ ట్యాప్ చేయండి. గ్రూపులో జోడించేందుకు లేదా ఎంచుకునేందుకు కాంటాక్టులను వెెతకండి, ఆపై తర్వాత ట్యాప్ చేయండి. గ్రూప్ సబ్జెక్ట్ నమోదు చేసి, లేదా సృష్టించండి ట్యాప్ చేయండి.

మీరు కమ్యూనికేట్ చేసుకోవడానికి గల విభిన్న మార్గాలు

  • వాయిస్ మెసేజ్‌లు: మీకు టైప్ చేయడం ఇష్టం లేకపోతే, మీరు ఒక ఆడియో రికార్డింగ్‌ను పంపించవచ్చు. మెసేజ్‌ను రికార్డ్ చేయడానికి లేదా ట్యాప్ చేసి, ఉంచండి. రికార్డ్ చేయడం ఆపివేయడానికి, మైక్రోఫోన్‌ను వదిలివేయండి. Android, iPhone లేదా KaiOSలో వాయిస్ మెసేజ్‌లను ఎలా పంపాలో మరియు ప్లే చేయాలో తెలుసుకోండి.
  • వాయిస్ కాల్‌లు: కాల్‌లు ట్యాబ్, ఆపై లేదా ట్యాప్ చేయండి. మీరు కాల్ చేయాలనుకునే కాంటాక్ట్ కోసం వెతకండి. వాయిస్ కాల్‌ను ప్రారంభించడానికి లేదా ట్యాప్ చేయండి. Android లేదా iPhoneలో వాయిస్ కాల్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.
  • వీడియో కాల్‌లు: కాల్‌లు ట్యాబ్ తెరిచి, ఆపై లేదా ట్యాప్ చేయండి. మీరు కాల్ చేయాలనుకునే కాంటాక్ట్‌ను కనుగొనండి. వీడియో కాల్‌ను ప్రారంభించడానికి, లేదా ట్యాప్ చేయండి. Android లేదా iPhoneలో వీడియో కాల్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

భద్రతా చిట్కాలు మరియు సహాయకర ఫీచర్లు

గోప్యత మరియు భద్రతా ఫీచర్‌లను అనుకూలీకరించండి
మీ గోప్యత మరియు భద్రతలను అర్థం చేసుకోవడం మరియు అనుకూలీకరించడాన్ని WhatsApp సులభం చేస్తుంది. మా గోప్యత పేజీలో మరింత తెలుసుకోండి.

మీరు అందుకునే సమాచారం నిజమైనదా కాదా అని నిర్ధారించుకోండి
మీకు వచ్చే మెసేజ్‌లు నిజమైనవేనా అని పరిశీలించండి, ఎందుకంటే మీరు వినే ప్రతీది ఖచ్చితమైనది కాదు. మీకు వచ్చిన మెసేజ్‌ను ఎవరు పంపారో మీకు తెలియకపోతే, ఆ మెసేజ్‌లోని సమాచారాన్ని నమ్మదగిన నిజ-నిర్ధారణ సంస్థల ద్వారా డబుల్ చెక్ చేసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడం ఎలాగో ఈ కథనంలో మరింత తెలుసుకోండి.

ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లు
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నివారించడంలో సాయపడేందుకు, మీరు మెసేజ్‌లను ఎలా ఫార్వార్డ్ చేయగలరనే దానిని మేము పరిమితం చేస్తాము. ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లను మీరు సులభంగా గుర్తించవచ్చు, ఎందుకంటే వాటికి ఫార్వార్డ్ చేయబడింది అనే లేబుల్ ఉంటుంది. ఒక మెసేజ్ ఒక వినియోగదారు నుండి మరొక వినియోగదారునికి పలుమార్లు ఫార్వార్డ్ చేయబడినప్పుడు, అది డబుల్ యారో ఐకాన్‌తో సూచించబడుతుంది. ఫార్వార్డింగ్ పరిమితుల గురించి మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగోడౌన్‌లోడ్
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్స్టోరీలుబిజినెస్ కోసం
మేము ఎవరుమా పరిచయంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని సంప్రదించండిసహాయ కేంద్రంకరోనావైరస్భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2023 © WhatsApp LLC

సేవా నిబంధనలు