మీరు ఒక పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో బోధిస్తుంటే, విద్యా బోధన కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నట్లయితే మీ విద్యార్ధులకు WhatsApp ద్వారా పాఠాలు బోధిస్తూ వారితో నిమగ్నమయ్యేందుకు ఆలోచించండి.*
మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడు దయచేసి WhatsAppను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీకు తెలిసిన వినియోగదారులతో మరియు మీ నుండి మెసేజ్‌లను స్వీకరించాలనుకునే వారితో మాత్రమే సంభాషించండి, మీ ఫోన్ నంబర్‌ను వారి అడ్రెస్ బుక్‌లో సేవ్ చేయమని కస్టమర్లను అడగండి మరియు గ్రూప్‌లకు ఆటోమేటిక్ లేదా ప్రచార మెసేజ్‌లను పంపకండి. ఈ సరళమైన ఉత్తమ ఆచరణలు పాటించకపోతే, ఇతర వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడం మరియు అకౌంట్ బాన్ అవడం వంటివి జరగవచ్చు.
మీరు WhatsAppకు కొత్త అయితే, దానిని ఉపయోగించడం ప్రారంభించడం ఎలాగో తెలిపే దశల వారీ మార్గదర్శి కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
WhatsApp కరోనా వైరస్ సమాచార హబ్‌కు సంబంధించి మీకేమైనా ప్రశ్నలుంటే, మమ్మల్ని సంప్రదించండి.