Uber
"మా కస్టమర్లకు సాయపడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటాం — వారు ప్రయాణిస్తున్నా లేదా ప్రయాణించకపోయినా వారి కోసం మేము సిద్ధంగా ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని డ్రైవర్లకు మా బృందంలోని సభ్యునితో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి ప్రశ్నలకు సమాధానం పొందడానికి వేగవంతమైన, సుపరిచితమైన మరియు నమ్మదగిన మార్గాన్ని ఇవ్వడం కోసం WhatsAppతో భాగస్వాములమైనందుకు మేము సంతోషంగా ఉన్నాము."
― మానిక్ గుప్తా, విపి, ప్రోడక్ట్ హెడ్
Wish
"అత్యంత క్లిష్టమైన కొనుగోలు అనుభవాల్లో ఎదురయ్యే జంజాటాలను తొలగించడం ద్వారా కస్టమర్లతో సులభంగా అనుసంధానమయ్యేందుకు WhatsApp Business API ఒక గొప్ప పరిష్కారం. కస్టమర్లు అందరూ తమ ఆర్డర్ల వివరాలను ట్రాక్ చేసుకునేందుకు WhatsApp ఉపయోగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి."
― పీటర్ షూల్షెవిస్కీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, విష్
B2W
"క్లయింట్లతో మరింత సన్నిహితంగా ఉండాలని, కొనుగోలు తర్వాత కూడా డిజిటల్ విధానంలో వారికి సహాయ సహకారాలు అందించాలనే మా దార్శనికతతో WhatsApp చక్కగా జోడీ అయింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మాకు చాలా ఉత్కంఠగా ఉంది."
― జీన్ లెస్సా, డిజిటల్ డైరెక్టర్
iFood
"బ్రెజిల్‌లో WhatsApp ఒక ముఖ్యమైన సమాచార ప్లాట్‌ఫామ్‌గా వినియోగించబడుతోంది. మా వినియోగదారులకు iFoodను మరింత చేరువ చేయడానికి గల లెక్కలేనన్ని అవకాశాల్లో అది ప్రధానమైనదిగా ఉండగలదని మేము నమ్ముతున్నాము."
― ఫిలిప్పీ పెరీరా, మార్కెటింగ్ డైరెక్టర్
Singapore Airlines
"ఎపిఎసి ప్రాంతంలో WhatsApp Business API కోసం ప్రారంభ భాగస్వామిగా అవతరించిన తొలి విమానయాన సంస్థగా ఉన్నందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంతోషిస్తోంది. మా కస్టమర్లు మాతో అనుసంధానమై మా నుండి వెలువడే సమాచారాన్ని సకాలంలో అందుకునేలా ఈ తొలి అడుగు ఒక కొత్త సమాచార ఛానెల్‌ను అందిస్తోంది."
― జార్జ్ వాంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
Melia Hotels
"WhatsApp Business API మా క్లయింట్లతో అనుసంధానమయ్యేందుకు ఒక త్వరితమైన కొత్త మార్గాన్ని తెరుస్తోంది. మా కస్టమర్లకు ఉపయోగకరమైన సమాచారం మరియు మెరుగైన అనుభవాన్ని అందించేలా మాకు తోడ్పాటు అందిస్తూ మా కస్టమర్-కేంద్రీకృత విధానానికి చక్కగా సరిపోతుంది."
― జోస్ మారియా డాల్మా, విపి, గ్లోబల్ బిజినెస్ డెవలప్‌మెంట్
KLM
"మా కస్టమర్లతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి KLM Royal Dutch ఎయిర్‌లైన్స్‌కు WhatsApp కొత్త సేవా ఛానెల్ అయింది. ఎంచుకున్నప్పుడు, KLM కస్టమర్లు విమాన సమాచారం మరియు డాక్యుమెంట్స్ సమాచారం అందుకుంటారు, అలాగే ప్రపంచంలో అతిపెద్దదైన ప్రత్యేక సోషల్ మీడియా బృందం నుండి 24/7 సహాయం పొందుతారు."
― మార్టిన్ వాన్ డెర్ లీ, సోషల్ మీడియా డైరెక్టర్
Bank BRI
"మా వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్ SABRINAను WhatsAppలో ఉపయోగిస్తున్నందుకు Bank BRI గర్వంగా భావిస్తోంది. సంభాషణతో కూడిన బ్యాంకింగ్ సేవలు మా కస్టమర్లకు ఆ రోజంతా సరికొత్త గొప్ప అనుభవాన్ని అందిస్తుందని మేము నమ్ముతాము."
― కాస్పర్ సీతూమోరాంగ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డిజిటల్
absa
"సరికొత్త ఆవిష్కరణల గురించి మాకు ఆసక్తి ఎక్కువ, అందుకే మా కస్టమర్లు మాతో సన్నిహితంగా మసలుకునే విధానాన్ని ఎప్పటికీ మార్చివేసే ఈ వినూత్న ప్లాట్‌ఫామ్‌ను అందించేందుకు WhatsAppతో భాగస్వాములమైనందుకు ఎంతగానో గర్విస్తున్నాము"
― ఆరీ రౌటెన్బాక్, ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ రీటైల్ మరియు బిజినెస్ బ్యాంకింగ్
Coppel
"మేము మా కస్టమర్ కమ్యూనికేషన్‌ను సమర్థవంతమైన సేవ మరియు శ్రద్ధతో అందించేందుకు WhatsApp వినూత్న మార్గాలను ఆవిష్కరిస్తున్నాము. మా కస్టమర్లు Coppel యొక్క ఉనికితో మా బ్రాండ్‌కు మరింత సన్నిహితంగా ఉన్న అనుభవాన్ని పొందుతున్నామనుకునేలా చేయగలమని మేము నమ్ముతున్నాము."
― రాబర్టో గిల్, చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్
Sale Stock
"WhatsApp ఉపయోగాల గురించి తెలుసుకోవడం అనేది మా బిజినెస్ మరియు కస్టమర్లపై గొప్ప ప్రభావాన్నే చూపింది, ఇంకా మరెన్నో అవకాశాలను అన్వేషించాల్సి ఉంది. డెలివరీ రేట్, ఎంగేజ్‌మెంట్ మరియు సులభతర అనుసంధానాలను ఇతర విధానాలతో పోల్చిచూడటం సాధ్యపడదు."
― వాహ్యూ సాపుత్రా, ప్రోడక్ట్ హెడ్, కస్టమర్ ఫేసింగ్
WorldRemit
"WhatsApp Business APIతో కలిసిన తొలి యూకే ఫిన్‌టెక్‌గా మారినందుకు WorldRemit సంతోషిస్తోంది. లక్షలాది WorldRemit కస్టమర్లు ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ప్రియమైన వారితో చాట్ చేయడానికి, డబ్బు పంపించడం మరియు స్వీకరించడం గురించి చర్చించడానికి WhatsApp ఉపయోగిస్తుంటారు. మా కస్టమర్లకు వారి లావాదేవీల గురించి తక్షణ అప్‌డేట్లను WhatsApp ద్వారా అందిస్తూ, మేము నగదు బదిలీలను మరింత సులభతరం చేశాము."
― అలీస్ న్యూటన్-రెక్స్, చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్, వరల్డ్‌రెమిట్