
WhatsApp Business యాప్
WhatsApp Businessను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఇది చిన్న వ్యాపారాల యజమానులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ యాప్ వ్యక్తిగతంగా మీ కస్టమర్లతో కనెక్ట్ కావడం, మీ ఉత్పత్తులు మరియు సేవలను ప్రముఖంగా చూపడం మరియు వారి షాపింగ్ అనుభవంలో వారి ప్రశ్నలకు సమాధానమివ్వడం సులభం చేస్తుంది. మీ ఉత్పత్తులు మరియు సేవలను చూపడానికి కేటలాగ్‌ను సృష్టించండి మరియు మెసేజ్‌లను ఆటోమేట్ చేయడానికి, సార్ట్ చేయడానికి మరియు వేగంగా ప్రతిస్పందించడానికి ప్రత్యేక టూల్లను ఉపయోగించండి.
WhatsApp అనేది మధ్యస్థ మరియు భారీ వ్యాపారాలకు కూడా కస్టమర్ మద్దతు అందిస్తుంది మరియు కస్టమర్లకు ముఖ్యమైన నోటిఫికేషన్లను డెలివర్ చేస్తుంది. WhatsApp Business API గురించి మరింత తెలుసుకోండి.