తమ స్నేహితులు మరియు కుటుంబంతో ఎప్పుడైనా, ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు 180కు పైగా దేశాల్లో 2 బిలియన్లకు పైగా ప్రజలు WhatsApp1 ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితం2 మరియు సులభమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన రీతిలో మెసేజ్లు మరియు కాల్స్ చేసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఫోన్లలో అందుబాటులో ఉంది.
1 అవును, 'WhatsApp' అనే పేరు 'What's up'కి మరో పదం.
2 డేటా ఛార్జీలు వర్తించవచ్చు.
ఎస్ఎంఎస్కు ప్రత్యామ్నాయంగా WhatsApp ప్రారంభించబడింది. ప్రస్తుతం మా ప్రోడక్ట్ ఈ తరహాకు చెందిన వివిధ మీడియాలను పంపడానికి, స్వీకరించడానికి మద్దతునిస్తోంది: టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లొకేషన్. అలాగే వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. మీ అత్యంత వ్యక్తిగతమైన క్షణాలు WhatsApp ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సంపూర్ణ గుప్తీకరణను మా యాప్లో నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒకరితో ఒకరు సంభాషించుకునేలా చేయాలనేదే మా ప్రతీ ప్రోడక్ట్ నిర్ణయం వెనుక గల ఆశయం.
జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్షన్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా WhatsApp కనుగొనబడింది. వీరు Yahoo సంస్థ లో 20 సంవత్సరములు పనిచేసినారు. WhatsApp 2014 సంవత్సరంలో Facebook లో అనుసంధానమయినది. కానీ ప్రపంచం మొత్తం వారి యొక్క తీక్షణమైన మరియు నమ్మకమైన సేవలు అందించడానికి సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.